Site icon Sanchika

పదసంచిక-79

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మనకున్న కొద్దిమంది మహిళా అవధానులలో ఒకరు. మరొకరితో కలిసి జంట అవధానాలు కూడా చేస్తున్నారు. (6)
4. తటవర్తి జ్ఞానప్రసూన గారి లిఖిత పత్రిక(4)
7. చపలచిత్తుడు సాపు కానిదానిని మింగాడు. (2)
8. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఈ గ్రామం ఓ కొలమానం. (2)
9. సెవెన్ సమురాయ్ సినిమా దర్శకుడు. (3,4)
11. క్షణికమైంది కాబట్టే అటూ ఇటూ అయ్యింది. (3)
13. చెరుకు రామ్మోహనరావు వ్యాసాల సంపుటి (5)
14.  ముసలీ ముతకా దివాలా తీస్తే దానిలో ఆలస్యం కనిపిస్తుంది. (5)
15. వరండా (3)
18. సాధారణంగా చట్టసభలలో సమావేశాలు ప్రారంభం కాగానే చేపట్టే తొలి కార్యక్రమము. మొదట్లో సకారం నకారమైంది. (3,4)
19. శిశువుకు అనుస్వారం జోడిస్తే దుష్కృతమా? (2)    
21. స్టార్ మహిళ వ్యాఖ్యాత్రి (2)
22. అక్రమ పారితోషిక గ్రహీత (4)
23. వేదాంత సౌరభము (3,3)

నిలువు:

1. తగినది కనుక వెలలేదు. (4)
2. స్వీకారము (2) 
3. బాలసాహితీభూషణుడి పర్ణశాల (5)
5. కోతి, నక్క (2)
6. చక్కదనం (6)
9.  చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాడానికి ప్రవేశపెట్టేది. (4,3)
10. ఇది కూడా చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాలని ప్రయత్నించేది. తిరస్కరణకు అవకాశాలు ఎక్కువ. (3,4)
11. ఉసురు(3)
12. హరిణం కోసం వెదకాలంటే చిరాకా? (3)
13. గోపాల చక్రవర్తి నడిపిన ఫీచరు. (3,3)
16.  వడలి రాధాకృష్ణగారి ఒక బిరుదు. (5)
17. అక్షరం లుప్తమైనా సంయమనము సంయమనము కోల్పోలేదు. (4)
20. చూరు కింద మగవారు కట్టుకునేదేనా? (2)
21.  సున్నం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 17  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 22 తేదీన వెలువడతాయి.

పదసంచిక-77 జవాబులు:

అడ్డం:                                 

1.ప్రభుత్వనౌకరు 4.కనీనిక 7.దేవి 8.ద్రావి 9.ప్రయాణసాధనము 11.కర్ణిక 13.ఉండ్రాజవరం 14.బొటనవ్రేలు 15.జడిమి 18. డుతిలతంలన్యాయం 19.వ్రేడు 21.వాగు 22.లుబ్బురఅ 23.పైతృష్యసే(సీ)యుడు

నిలువు:

1.ప్రదేశిని 2.భువి 3.రుద్రసావర్ణి 5.నిద్రా 6.కవికోకిలలు 9.ప్రసన్నాంజనేయుడు 10.ముగిసినఅధ్యాయం 11.కరంజ 12.కబొమి, 13.ఉంగరపువ్రేలు, 16.డిగతంరుపై, 17.చెడుగుడు 20.డుబ్బు 21.వాయు 

పదసంచిక-77కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version