Site icon Sanchika

పదసంచిక-8

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1. హర్రీబర్రీ. ధ్వన్యనుకరణ శబ్దం. హైదరాబాదు వంటి నగరాలలో ప్రజల జీవనస్థితి. (6)
4. హర హరా! (4)
7. మరురాణి కలిగియున్న gem. (2)
8. ఆడుగాడిద (2)
9. నీదు జోలను వీడ కుండ నీడను వదిలి వెనుకకు చూడు. కుంభకర్ణుడు కనిపిస్తాడు. (7)
11.  మగడు సుకుమారుడేమీ కాడు. అసాధ్యుడు. (3)
13. అరణ వరణ తరణలతో దిగుట. (5)
14.  మొదలు కనబడి బడి వదలితే మల్లయుద్ధములో ఒక పట్టు తెలుస్తుంది. (5)
15. నంది తన్నితే ఆడపడుచు దర్శనభాగ్యం కలుగుతుంది. (3)
18. సూర్యుడు మూడు రంగుల దేవుడేనా? (4,3)
19. నీచ వ్యవహారములో ఒక మందు దినుసు. (2)
21. ఇదిగో లేనిది అహమేగా. (2)
22. రంగోళి. రచించిన ముగ్గు. (4)
23. కళ, లలిత అనే అమ్మాయిల fine arts.  (6)

 

నిలువు
1. ఆ మాయావిని సరిద్దితే రోగగ్రస్తుడయ్యాడు. (4)
2. కొణిదల వారి మధ్య రాజుగారు. (2)
3. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి. (5)
5.  శిఖరమున జుట్టు. (2)
6.  తామర వంటి మొగము గలది. స్త్రీ. (6)
9. కుంభవృష్టి(4,3)
10.  నాగలిని ధరించినవాడు.  అచ్చతెనుగులో బలరాముడు. (4,3)
11.   లెక్కగట్టుట. (3)
12.   పెంకె ఆవు. (3)
13.   దిక్కు తోచనిది. (6)
16.  ఈయది కోవిల. కాగడాను వెదుకు. (5)
17.   క్రయము. (4)
20. తిరగబడ్డ ఆలమంద. (2)
21. బుధుని భార్య. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 11వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూలై 14వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-6 జవాబులు:

అడ్డం:

1.నేతిబీరకాయ 4.పుష్యరాగం 7.పత్తి 8.కడ 9.తాతినేని వనజ 11.మతము 13.చదువుపిట్ట 14.సన్నహనము 15.సిప్రాలి 18.రాజశేఖరరెడ్డి 19.త్రయ 21.మూట 22.ముష్టివాడు 23.దుష్టసమాసము

నిలువు:

1.నేపథ్యము 2.తిత్తి 3.యమునిదూత 5.రాక 6.గండభేరుండము 9.తారకవురామారా 10.జగన్మోహనరెడ్డి 11.మట్టసి 12.ముసలి 13.చలనచిత్రము 16.ప్రాణంఖరీదు 17.మర్కటము 20.యష్టి 21.మూస

పదసంచిక-6కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. పాటిబళ్ళ శేషగిరిరావు
  2. అనూరాధాసాయి జొన్నలగడ్డ
  3. భాగవతుల కృష్ణారావు
  4. శారద పోలంరాజు
  5. శుభా వల్లభ
  6. తాతిరాజు జగం
  7. వైదేహి అక్కపెద్ది
  8. వర్ధని మాదిరాజు
  9. మధుసూదనరావు తల్లాప్రగడ
Exit mobile version