Site icon Sanchika

పదసంచిక-80

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శ్రీకాళహస్తిలోని దైవము (6)

4. కార్టూనిస్ట్ ‘శంకు’ గారు నడిపిన పత్రిక (4)

7. జాక్‌ఫ్రూట్‌లోని శక్తి (2)

8. రెండు దూలాల మధ్య వేసే అడ్డుకొయ్య (2)

9. దూదితో కూడిన డ్రమ్ము (7)

 11. వాటాదారు (3)

13. శోభన్‌బాబు, రాధ జంటగా కె.మురళీమోహనరావు దర్శకత్వంలో 1985లో వచ్చిన సినిమా చివర హ్రస్వమైంది. (3,2)

14. కలర్ ఫోటో (5)

15. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము (3)

18. కాడ్మియం పరమాణు సంఖ్య (3,4)

19. గందవడిలోని ధూళి (2)    

21. అనంతమైన అంతరిక్షములో తొలకరి (2)

22. పద్మము (4)

23. అక్షరాలు పొదిగిన రింగు (6)

నిలువు:

1. చిత్రకారుడు వి.ఆర్.చిత్రా ఆటోబయోగ్రఫీ (4)

2. జాక్‌ఫ్రూట్‌లోని దురద (2)

3. చిందరవందరగా ఊదుకడ్డీ (5)

5. భౌతికశాస్త్రంలో పట్టకము (2)

6. కన్నడ పద్యాలకు ఇది లేదు. (2,4)

9.  గోపీగారి థీసిస్సు (4,3)

10. ప్రాణం పోయింది. (2,5)

11. ప్రస్తుతం దేశంలో చక్రం తిప్పుతున్నది. acronym (3)

12. సిరివరుని గర్భంలో సముద్రకాంత (3)

13. ఈ యేడ్పు వేస్ట్ (6)

16.  మూడు ఒక్కట్లు మూడు. మూడు రెండ్లు ఆరు. (2,3)

17. సిగార్‌తో బంధుత్వం.(4)

20. కళవళికతో విరామము. (2)

21.  రాజయక్ష్మము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 24  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 29 తేదీన వెలువడతాయి.

పదసంచిక-78 జవాబులు:

అడ్డం:                                 

1.వైశ్రవణావాసం 4.నంగామసా 7.జమ 8.జయం 9.అనాఘ్రాతపుష్పము 11.విలంబం 13.ద్రావణీయము 14.ధరవరలు 15.ఖననం 18.తులపుమాత్రకుడు 19.దగా 21.మమ 22.ముమయని 23. కాకోలూకీయము

నిలువు:

1.వైజయంతి 2.శ్రమ 3.సంకేతస్థలం 5.మజ 6.సాయంసమయాలు 9.అఠావణీబంట్రోతు 10.ముసలివర్తకుడు 11.విముఖ 12.బంధనం 13.ద్రావిడవేదము 16.నవమాలికా 17.మిశ్రమము 20.గామ 21.మయ 

పదసంచిక-78కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version