Site icon Sanchika

పదసంచిక-9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. భారత జాతీయగీతము. (6)
4. కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన నవల. (4)
7. సన్న్యాసిని కలిగున్న పంచాయతి. (2)
8. గింగిరాలు తిరిగితే ఈ లోహం కనపడదా? (2)
9. అమ్జదు రుబాయీలను తెలుగు వారికి రుచి చూపించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఈ తెలంగాణా రచయిత పేరు వినగానే యాది యాదికి వస్తుంది. (3,4)
11. వాణిజుకుడు పలుకు లేక తడబడి అంగారకుడైనాడు. (3)
13. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే సినారె పాటవున్న సినిమా.(2,3)
14.  నీ తలపై పేలాలు కాదు వెంట్రుకలు. (5)
15. అమెరికా బుల్లెమ్మ గుర్రాన్ని ఎక్కాలంటే ఇది కావాలి  కదా? (3)
18. వల, లక్ష, క్షమ, మయూఖ సహితుడు ఈ చంద్రుడు. (7)
19. అతడు లేని వాహిని అతని (2)
21. వాక్కు, వాణి, వాదుల రూపాంతరము. (2)
22. స్మశానము. ఆ భూమి ఆరుద్రది కాదే? (4)
23. చలం, భానుమతి నటించిన తెలుగు 1971నాటి సినిమా. (3,3)
నిలువు
1.శ్రీశ్రీ సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చిన కవితా శీర్షిక (4)
2.నమస్కృతి (2)
3.కారు దిద్దిన కాపురం దర్శకులు ఈ రాజు గారు. (5)
5.  నాట్యావధాని రామనాథశాస్త్రిగారి ఇంటి పేరు. (2)
6.  బర్నింగ్ హార్ట్స్. కృష్ణ, జయప్రదలది కావచ్చు. మోహన్‌బాబు, రాధికలదైనా కావచ్చు. (3,3)
9. గదాయుద్ధము అని నిఘంటువు చెబుతున్నది. (7)
10. వరూధినికి మొగుడు కావచ్చు ఈ దండనాయకుడు. (7)
11.  పెండ్లి కాని పిల్ల (3)
12.  బుడుతడు తడబడ్డాడు పాపం. (3)
13. వీరు తమ తప్పులు ఎరుగరని వేమన్న అభిప్రాయం (6)
16.  _________ కాకపోతే రుక్మిణికి ఇంకా నౌకావిహారవేఁమిటండీ? అని మాయాబజార్ సినిమాలో రేవతి డైలాగు. (5)
17.   నేర్పు (4)
20. జ్ఞాని ద్రష్టల నడుమ సుషుప్తి (2)
21. అడ్డము 21యే మరో రూపంలో (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 16వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూలై 21 తేదీన వెలువడతాయి.

పదసంచిక-7 జవాబులు:

అడ్డం:

1.రామా చంద్రమౌళి 4 ఏకాదశ 7.మనం 8.క్షత 9.అంతా మన మంచికే 11.అంకము 13.గమనిపద 14 కులగౌరవం 15.లంపటం 18.తంత్రమంత్రసహితం 19.రాత 21.నుమా 22.లుల్లిగాడు 23.మలయవాసిని

నిలువు:

1.రామతీర్థ 2.మానం 3.ళికేనదక 5. దీక్ష 6.శతదినోత్సవం 9.అంటరాని వసంతం 10.కేదారగౌరివ్రతం 11.అందలం 12.ముకుటం 13 గజఈతరాలు 16.పవిత్రప్రేమ 17.అభిమాని 20.తల్లి 21.నుసి

పదసంచిక-7కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. పాటిబళ్ళ శేషగిరిరావు
  2. అభినేత్రి వంగల
  3. వైదేహి అక్కపెద్ది
  4. అనూరాధాసాయి జొన్నలగడ్డ
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. భాగవతుల కృష్ణారావు
  7. పొన్నాడ సరస్వతి
  8. సత్యవాణి వింజమూరి
Exit mobile version