Site icon Sanchika

పదసంచిక-96

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తిరగలి (6)
4. పంది (4)
7. మూల్యాన్ని చెల్లించి వస్తువును కొనే క్రియ (2)
8. వేదండము చేదైనదానిని త్యజించింది. (2)
9. దేవరకొండ బాలగంగాధర తిలక్ రచన. అసంపూర్ణం. (3,4)
11. చరిత్రను తిరగ రాయండి. మీరు దానికి సమర్థులే. (3)
13. దీని రుచి రాజెరుగును వంకాయ రుచి తోటమాలి ఎరుగును అని లోకోక్తి ముక్తావళిలో పేర్కొన్నారు. (5)
14. వేదాన్ని ఇలా అనడం ఏమైనా బాగుందా? (5)
15. సంతోషించి అసమాపక క్రియ (3)
18. ఆయమ్మాయి పేరు రుద్రాణి. ఇంటి పేరు తటవర్తి. (3,4)
19. మ్రాను లేని తరువాత మిగిలేదేమి? (2)     
21. జాతీయ పార్టీల ప్రసవం (2)
22. వట్టికూటి వారో, తంగిరాల వారో ఈ రచయిత గారు. (4)
23. శ్రీకృష్ణునికి కష్టాలు తెచ్చిపెట్టింది. (6)

నిలువు:

1. జెయింట్ వీల్ (4)
2. అడ్డం 7, అడ్డం 15 ఆధారాలలో కనిపించే పని (2)
3. ఋషిపుత్రి (5)
5. దంభములోని సంతోషం (2)
6. పరశురాముడు వెల్లవేయువాడు కావచ్చు (6)
9.  ఈతకోట సుబ్బారావుగారి చరిత్ర పుస్తకం (4, 3)
10. కోట శ్రీనివాసరావుగారి బిరుదు నవరస ___ ____ (3,4)
11. ద్వయ, చతుష్టయాల నడిమిది (3)
12. బంట్రోతు (3)
13. పద్మపత్రవిశాలాక్ష పద్మనాభ సురోత్తమ (3,3)
16.  రజనిగారి అందగత్తె ఆకును కోల్పోయి తికమక అయ్యింది. (5)
17. నాగిరెడ్డి జంట (4)
20. వక్రతలో పెరుగు (2)
21.  వింజామరలోని వృక్షవిశేషము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మార్చ్ 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 96 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మార్చ్ 21 తేదీన వెలువడతాయి.

పదసంచిక-94 జవాబులు:

అడ్డం:                                 

1.కడపటిపైసా 4.పసిపాప 7.సుబ్బి 8.శిరి 9.ఆధ్రమహిళాసభ 11.మముక్ష 13.చిత్రలహరి 14.పట్టభద్రుడు 15.కిరణం 18.సభరనమయవ 19.డుజా 21.కోమా 22.గుణదల 23.డుటగుప్పులుత/డుప్పుగుటలుత/డుగుటప్పులుత

నిలువు:

1.కసుగందు 2.డబ్బి 3.సామూహికము 5.పాశి 6.పరివ్రాజకుడు 9.ఆముదాలవలస 10.భరనభభరవ 11.మురికి 12.క్షపణం 13.చిచ్చరపిడుగు 16.రచనకాడు 17.మేరీమాత 20.జాణ 21.కోలు

పదసంచిక-94కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version