back to top
Home Blog Page 11

సిరివెన్నెల పాట – నా మాట – 73 – జీవితం పట్ల నూతనోత్సాహాం కలిగించే పాట

0

[నవంబర్ 30 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి వర్ధంతి. కాలంపై చెరగని సంతకాన్ని చేసి, కాలగతిలో, కాలాతీతుడిగా నిలిచిన ఒక మానవతా కలం శాస్త్రిగారికి హృదయాంజలి ఘటిస్తున్నారు ఆర్. శ్రీవాణీశర్మ.]

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

Now or Never!

~

చిత్రం: వేదం

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం : రంజిత్, దీపు, గీతా మాధురి, చైత్ర

~

పాట సాహిత్యం

పల్లవి:
పద పద పద పద పద
నిన్ను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడూ కానట్టే
ఇక్కడనే ఉంటే, ఉన్నా లేనట్టే
Now or Never! Now or Never! Now or Never!

చరణం:
అతడు: నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజూ ఏదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
ఆమె: నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజూ ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
అతడు: ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదుటలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
Now or Never! Now or Never! Now or Never! ॥ పద పద ॥

చరణం:
అతడు: నీతో నువు కలహిస్తూ
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు.. నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు
Now or Never! Now or Never! Now or Never! ॥ పద పద ॥

‘Success is failure turned inside out’, కాబట్టి..

When things go wrong, as they sometimes will,

When the road you’re trudging seems all up hill, ..Keep Going

అంటారు Edgar A. Guest.

ఇదే విధంగా మనకు ప్రేరణనిచ్చే ‘వేదం’ సినిమాలోని Now or Never! అని పాట గురించి ఇప్పుడు చర్చిద్దాం.

పల్లవి:
పద పద పద పద పద
నిన్ను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడూ కానట్టే
ఇక్కడనే ఉంటే, ఉన్నా లేనట్టే
Now or Never! Now or Never! Now or Never!

తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ.. ప్రతిరోజు ఒక కొత్త ఉదయాన్నే మనకు అందిస్తూ.. పద పదమని పరిగెడుతూనే ఉంటుంది భూమి. అందుకే ఈ భూమి మీద మనిషిగా జన్మించిన మనం.. అనుక్షణం ఎదుగుతూ, ముందుకు సాగుతూనే ఉండాలి. జీవితంలో ఆశ – నిరాశల ఆట పరమపదసోపాన పటంలా తికమక పెడుతూనే ఉంటుంది. కొందరికి ఎదగడానికి అన్ని రకాలా అనుకూలమైన అవకాశాలు దొరికితే, మరికొందరికి ఎంత శ్రమపడినా అనుకున్న గమ్యంలో సాగలేని పరిస్థితులు ఏర్పడతాయి. సానుకూలతల మధ్య నల్లేరు నడకలా సాగే జీవితంలో అనుభవించడానికి కావాల్సినంత thrill దొరకకపోవచ్చు. కానీ, ప్రతికూల పరిస్థితులలో.. మనల్ని మనం ఉత్సాహపరచుకుంటూ, తగినంత ప్రేరణ నిచ్చుకుంటూ, కలల తీరాన్ని ఊతగా పట్టుకుని ముందుకు సాగడంలోనే మరింతగా బ్రతుకులోని మధురిమను ఆస్వాదించగలుగుతాం. ఆ విషయాన్ని నొక్కి చెబుతూ, పద పద పదమని, నిన్ను నువ్వే తరుముకుంటూ ముందుకు వెళ్లాలనీ, నీకు నువ్వే సైన్యంగా మారాలనీ, ఏ మాత్రం నిరాశలో కృంగిపోకూడదని, అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఆగకూడదని సందేశం ఇస్తున్నారు సిరివెన్నెల ఈ పాట ద్వారా. Now or Never! అనే పాట ‘వేదం’ సినిమాలో ఏ ఇతివృత్తాన్ని ప్రతిబింబించడానికి వ్రాశారో, ముందుగా తెలుసుకుందాం. ఈ కథాంశం మొత్తం, కలల సాధనే లక్ష్యంగా, వారి వారి మార్గాలను.. గమ్యాలను.. వర్ణిస్తూ సాగుతుంది.

‘వేదం’, మానవతా విలువలను చాటిచెప్పే ఒక మంచి చిత్రం. ఇందులో ఐదుగురి కథలను కలిపి, ఒక్కొక్కరు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించారు? చివరకు ఏమి జరిగింది? అని చూపిస్తూ, కథ నడుస్తుంది. మొదటి కథ చక్రవర్తిలో (మనోజ్ మంచు) దాగివున్న కళకు సంబంధించినది. తన కలలను సాధించాలని పట్టుదలతో పోరాడే రాక్‌స్టార్. అతను తన మొదటి ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి బెంగళూరు నుండి హైదరాబాదుకు బయలుదేరుతాడు. రెండవ కథలో, రాములు (నాగయ్య) సిరిసిల్లకు చెందిన ఒక వృద్ధుడు. తెలివైన విద్యార్థిగా ఉన్న తన మనవడిని, అప్పు తీర్చే దాకా తన దగ్గర పెట్టుకున్న ఒక షావుకారికి అప్పు చెల్లించి, పాఠశాలలో కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటాడు. అమలాపురంలో ఒక వేశ్యాగృహం కంపెనీలో పని చేసే సరోజ (అనుష్క) హైదరాబాద్ వెళ్లి సొంతంగా బ్రోతల్ కంపెనీ పెట్టాలన్నది ఒక కల. ఇది మూడవ కథ.

ఇక నాలుగవ కథలో, రహీముల్లా ఖురేషి (మనోజ్ బాజ్‌పేయ్) హైదరాబాదులో ముస్లిం అయినందుకు వివక్షకు గురై తన కవల పిల్లలను కోల్పోవడంతో దుబాయ్‌కి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కేబుల్ రాజు (అల్లు అర్జున్)‌ కథ ఐదవది. ఫిల్మ్ నగర్ మురికివాడలో కేబుల్ ఆపరేటర్‌గా జీవిస్తున్నా, తాను ధనవంతుడిగా మోసగిస్తూ, ధనవంతుల ఇంటి అమ్మాయిని (దీక్షా సేథ్)ని, ప్రేమిస్తూ, 40 వేల రూపాయల ఖర్చు పెట్టి న్యూ ఇయర్ పార్టీకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అనుకున్నది సాధించుకుంటూ.. కలల బాటలో ముందుకు సాగడమే జీవితం.. అంటారు Langston Hughes..

Hold fast to dreams
For if dreams die
Life is a broken-winged bird
That cannot fly.

ఈ కథలో రాక్‌స్టార్ అయిన చక్రవర్తి, తన బృందంతో కలిసి ఆలపించే ‘నౌ ఆర్ నెవర్’, అనే ప్రేరణాత్మక గీతాన్ని నేపథ్యంలో – రంజిత్, దీపు, గీతా మాధురి, చైత్ర ఆలపించారు. ఈ పాటతోనే సినిమా ప్రారంభమవుతుంది.

మనమేదైనా కార్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు, how ఎంత ముఖ్యమో, when కూడా అంతే ముఖ్యం. కేవలం కలలు మాత్రమే కంటూ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు, కదలకుండా ఉంటే.. ఆ పనులు చక్క పెట్టుకోవడం సాధ్యం కాదు. Growth and development అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. Growth quantitative అభివృద్ధిని సూచిస్తే.. development , complexity of skills లో ఎదుగుదలను సూచిస్తూ qualitative గా కనిపిస్తుంది.

అందుకే అనుకున్నవి సాధించే growth and development విషయంలో.. సిరివెన్నెల అంటారు.. ‘ఇప్పుడు కాకుంటే ఇంకెపుడూ కానట్టే! ఇక్కడనే ఉంటే, ఉన్నా లేనట్టే’.. ఎదుగూబొదుగూ లేకుండా ఉన్న చోటే పడి ఉంటే, ఊపిరితో ఉన్నట్టు లెక్క కానీ, జీవించినట్టు లెక్క కాదు! ఈ సందర్భంలో ఎవరో ఆకాశ రామన్నో, ఆకాశ సీతక్కో.. వ్రాసిన ఒక ఇంగ్లీష్ పద్యం గుర్తుకొస్తుంది.

If a task is well begun
Never leave it, till it’s done
Be the labor great or small
Do it well or not at all..

ఏదైనా ఒక పని మొదలు పెడితే, దాన్ని ఆసాంతం చేయాలి, లేదా అస్సలు ఆ పని చేయకూడదు! అనేది దీని సారాంశం. అదే భావాన్ని Now or Never! Now or Never! Now or Never! అని వ్యక్తీకరిస్తారు సిరివెన్నెల. Self-motivation సూత్రాలలో అతి ముఖ్యమైనది.. Do it now!

చరణం:
అతడు: నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజూ ఏదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
ఆమె: నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజూ ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
అతడు: ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదుటలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
Now or Never! Now or Never! Now or Never! ॥ పద పద ॥

‘Every problem is an opportunity’ అనే సూత్రమే మనకు comfort ను ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక జీవితానికి ఒక కొత్త perspective ను ఇస్తుంది. జీవితకాలం మనిషికి ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంది. ‘ఆ లోటే లేకుంటే.. రేపటికి ఏది చోటు?’ అని ప్రశ్నిస్తున్నారు సిరివెన్నెల గారు. లేమిని కలిమిగా, బలహీనతని బలంగా మార్చుకోవడమే జీవిత పోరాటం. ఆ లోటు భర్తీ చేయడం కోసం మనలో కలిగే తపన, ఆరాటమే, గెలుపును సాధించడానికి మూలమవుతుందన్న బలమైన సందేశమది! అక్కడే మనకు life transformation జరుగుతుంది. ఈ పరివర్తనలో every atom, every cell, every drop of blood, every nerve, every vein, every second.. మనమనుకున్నది సాధించడం కోసం పోరాడాలి, మరగాలి, తపించాలి!

ఇదే సందేశాన్ని సులభమైన పదాలతో,

‘ఇది సరిపోదంటూ.. ఏదో సాధించాలంటూ..
ఎదుటలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ’

అంటారు సిరివెన్నెల.. భవిష్యత్తు ఎప్పుడూ మన ఊహల్లో, మన ఆశల్లోనే ఉంటుంది. మన కలల కళ్ళతో దాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ కలలను సాకారం చేసుకోవడం కోసం మనం అలుపెరుగని పోరాటం చేయాలి. కలలు అందరికీ ఉంటాయి కానీ, వాటిని సాధించిన వారు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. Have you earned your tomorrow? అనే poemలో ఇదే అంశాన్ని చర్చిస్తారు Edgar A. Guest.. మనిషికి వచ్చిన ప్రతి కష్టం, ప్రతి సమస్య ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది. ఈనాడు, ఈ ఆధునిక యుగంలో, మనం అనుభవిస్తున్న ప్రతి అభివృద్ధి, ప్రతి మార్పు, ప్రతి సౌకర్యం, అలాంటి తపన నుండి పుట్టినవే! మనలో గుర్తించగలిగిన ఏదో లోటును భర్తీ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది భవిష్యత్తులో మన బలమవుతుంది.

చరణం:
అతడు: నీతో నువు కలహిస్తూ
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు..
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు
Now or Never! Now or Never! Now or Never! ॥ పద పద ॥

‘నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ’ అనే వాక్యాలతో ప్రారంభమయ్యే రెండవ చరణాన్ని చాలా లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. ‘నీతో నీవు కలహిస్తూ’.. అనడం ఆత్మ- అంతరాత్మల మధ్య నిత్యం జరిగే సంఘర్షణను, మనసులోనే మంచి చెడుల మధ్య జరిగే కలహాన్ని, ego- conscious mind మధ్య జరిగే ఘర్షణను.. సూచిస్తుంది. అభావము, అజ్ఞానము, అవిద్య, అనే అంతః శతృవులను అంతఃకరణాలైన.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము సహాయంతో కలహించి, జయించాలన్నది ఉపనిషత్తుల సారాంశం. వీటన్నిటి ద్వారా మనసు శుద్ధి చేయబడినప్పుడే, మనసులోని తపన తీరి, నివురు కప్పిన నిప్పులాంటి సహజ చైతన్యశక్తి వెలికి వచ్చి, చెలమలాగా అనంత శక్తిని మనకు నిరంతరంగా అందిస్తూ, మనల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది.

Shakespeare Hamlet లాగా To be or not to be, that is the question.. అన్నట్టు, ప్రతి విషయంలోనూ మనసులో నిత్యం ఈ మథనం జరుగుతూనే ఉంటుంది. అలా జరిగే ఘర్షణలో నకారాత్మక శక్తులను మనసులోనే అణిచి, positive mind కు బలాన్నిచ్చి, మనల్ని మనమే గెలిపించుకోవాలి కదా! మన శరీరమే కురుక్షేత్రమైతే, మనలో జరిగే ఈ సంఘర్షనే మహాభారతం! ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం అనే పాటలో కూడా మనకు ఇదే సందేశం కనిపిస్తుంది.

మానవ జీవితమే ఒక మహాభారతం

మానవ జీవితమే ఒక మహాభారతం

అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే..

ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే.. ధర్మయుద్ధమే.. ధర్మయుద్ధమే..

అలా మనకి మనం స్ఫూర్తినిచ్చుకుంటూ, మనల్ని మనం గెలిపించుకుంటూ ముందుకు వెళుతుంటే.. మన లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించవచ్చు. Don’t just be history reader.. be a history maker!! అన్నది మనకు motivating principle అవ్వాలి.

కాలోహి దేవః అనే ఉపనిషద్వాక్యంలా కాలాన్ని శాసించే శక్తి రావాలి. నిజానికి కాలం ఒక relative concept.. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే.. కాలంపై అదుపు సాధించడం.

చెరిగిపోని చరిత్రను సృష్టించుకోవడం ద్వారా.. మనం కాలాతీతంగా మారగలం.

ఈ విషయంలో సిరివెన్నెల గారే మనకు role model. తనకంటూ ఒక తిరుగులేని చరిత్రను సృష్టించుకొని, కాలంపై చెరిగిపోని సంతకాన్ని పెట్టి, మనందరికీ మరువలేని స్ఫూర్తిని పంచిన సిరివెన్నెల, చెప్పింది చేసి చూపిన ఒక practical philosopher!

‘సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు..
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ..
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు..’

అని ప్రతివారికి కావలసినంత ప్రేరణ ఇస్తున్నారు సిరివెన్నెల. మన వ్యక్తిత్వం, మన జీవితం, మన గమనం, కాలంపై శాశ్వతంగా చెరగని ముద్రవేయాలని సిరివెన్నెలగారు ప్రతి మనిషిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు.

సిరివెన్నెల గారి మాటలు మనల్ని వ్యక్తిత్వ వికాస దిశగా ignite చేస్తాయనడంలో ఏమైనా సందేహం ఉందా?

ఇక ఈ పాటకి మొత్తం punch line ఏంటంటే.. now or never.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు!!! కాబట్టి procrastination లేకుండా ఎప్పుడు తలుచుకున్న మంచి పనిని, ఆ క్షణమే చేయాలి! ఇది మరో గొప్ప దిశా నిర్దేశం.

ఈ పాటలో ఒక పల్లవి రెండు చరణాలు ఉన్నాయి కదా.. వీటికి Newton’s laws of motion అప్లై చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. పల్లవిలో.. పద పద పద నిన్ను నువ్వు తరుముతు పద.. First law ఏం చెప్తుంది నిశ్చల స్థితిలో ఉన్న పదార్థం నిశ్చలంగానే ఉంటుంది.. కాబట్టి దానికి కదలిక ఇవ్వాలి.. మనిషికైనా, ఆశ కైనా, ఆశయానికైనా! కదలిక ఇస్తే కదలితోనే ముందుకు వెళుతుంది. ఇలా మనల్ని మనం ఉత్తేజ పరచుకోవాలి.

ఇక మొదటి చరణంలో second law apply చేస్తే.. లోటు.. అనే objectకి తగినంత motivational force ఇవ్వడం ద్వారా.. దాన్ని అనుకున్నంత వేగంతో, అనుకున్న దిశలో ముందుకి తీసుకెళ్లవచ్చు.

ఇక రెండవ చరణంలో third law of motion, apply చేసి మంచి చెడుల మధ్య ఘర్షణలో, for every action there is equal and opposite reaction.. ఉంటుంది కాబట్టి, బలమైన సానుకూల శక్తితో.. మనలోని negative thoughts, negative energy ని suppress చేయాలని అర్థం చేసుకోవచ్చు.

ఈ పాట మనకు జీవితం పట్ల నూతనోత్సాహాన్ని, మన దృష్టి కోణంలో చెప్పలేనంత మార్పుని తీసుకువస్తుంది. ‘తోడుకున్న వారికి తోడుకున్నంత’, అన్నట్టు ఈ పాటతో ఎంత స్ఫూర్తిని ఎవరు పొందాలంటే అంత స్ఫూర్తిని పొందవచ్చు.

Life’s complexities are distilled into words that soothe the soul and offer a new perspective of life and living. Undoubtedly Sirivennela gari literature captures all our subtle, inherent emotions and experiences and exerts profound amount of motivational energy on our lives.

Images Source: Internet

సినిమా క్విజ్-118

0

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘బొబ్బిలి యుద్ధం’ (1964) సినిమాలో ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., భానుమతి, రాజనాల నటించారు. ఈ సినిమాలో ముక్కామల బుస్సీ దొరగా నటించగా, హైదర్ జంగ్ పాత్రలో నటించినదెవరు?
  2. మునిపల్లె రాజు గారి నవల ‘పూజారి’ ఆధారంగా బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పూజా ఫలం’ (1964). అక్కినేని, జమున, సావిత్రి, జగ్గయ్య నటించిన ఈ చిత్రానికి మాటలు వ్రాసిందెవరు?
  3. ఎన్.టి.ఆర్. తొలిసారిగా ద్విపాత్రిభినయం చేసిన ‘రాముడు – భీముడు’ (1964) చిత్రానికి తాపీ చాణక్య దర్శకులు. ఎన్.టి.ఆర్., జమున, రేలంగి, రాజనాల తదితరులు నటించిన ఈ చిత్రంలో లాయర్ పాత్రలో నటించినదెవరు?
  4. ఎన్.టి.ఆర్. ద్విపాత్రిభినయం చేసిన ‘శ్రీ సత్యనారాయణ మహత్మ్యం’ (1964) చిత్రానికి ఎస్.రజనీకాంత్ దర్శకులు. ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, చలం, కాంతారావు తదితరులు నటించిన ఈ చిత్రంలో భూదేవి పాత్రలో నటించినదెవరు?
  5. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి నటించిన ‘మనుషులు – మమతలు’ (1965) సినిమాకి సంగీతం టి. చలపతి రావు అందించారు. ఈ చిత్రానికి కథని అందించినదెవరు?
  6. ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి. సరోజా దేవి, ఛాయాదేవి నటించిన ‘ప్రమీలార్జునీయం’ (1965) సినిమాలో నారదునిగా నటించినదెవరు?
  7. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి. సరోజా దేవి, నాగయ్య నటించిన ‘శకుంతల’ (1966) సినిమాలో దూర్వాస మునిగా నటించినదెవరు?
  8. ఎవిఎమ్ వారు ఎ.సి.త్రిలోక్‍చందర్ దర్శకత్వంలో ‘అవే కళ్ళు’, ‘అదే కన్గళ్’ పేరుతో తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి సినిమాలు తీశారు. తెలుగు వెర్షన్ లో కృష్ణ, కాంచన, రాజనాల, రమణారెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించినదెవరు?
  9. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, జయలలిత, కృష్ణకుమారి నటించిన ‘చిక్కడు దొరకడు’ (1967) సినిమాలో ‘ధర్మపాల మహారాజు’గా నటించినదెవరు?
  10. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని, కాంతారావు, బి. సరోజా దేవి, కృష్ణకుమారి నటించిన ‘రహస్యం’ (1967) సినిమాలో నారదునిగా నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 118 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 15 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 116 జవాబులు:

1.కాంతారావు 2. లక్ష్మీనివాసం (1968) 3. నడమంత్రపు సిరి (1968) 4. కిషోర్ కుమార్ 5. ఎం. ఆజం 6. రామకృష్ణ 7. యద్దనపూడి సులోచనారాణి 8. ఎన్.టి.ఆర్. 9. చంద్రకళ 10. పూవై కృష్ణన్. స్క్రీన్‍ప్లే శాండో చిన్నప్పదేవర్

సినిమా క్విజ్ 116 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఆకుల కృష్ణప్రియ
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • పి.వి.రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి, తెనాలి
  • సునీతా ప్రకాశ్, బెంగుళూరు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

అలనాటి అపురూపాలు – 249

0

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అలనాటి ప్రముఖ దర్శకుడు డి. యోగానంద్:

యోగానంద్ గారు 16 ఏప్రిల్ 1922 న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి, వెంకట దాసు – బందర్ నవాబ్ అని పిలువబడే రజా అలీ ఖాన్ బహదూర్‌ గారి ఎస్టేట్ మేనేజర్. వారు మద్రాసులోని మైలాపూర్‌లోని శాంతోమ్ ప్రాంతంలో నివసించేవారు. వెంకట దాసు మృదంగం వాద్యకారుడు, చక్కని గాయకుడు. యోగానంద్ తల్లి లక్ష్మీబాయి ఉన్నత విద్యను పూర్తి చేశారు, సంస్కృతంలో పండితులు. ఆమె భారతదేశ ప్రాచీన చరిత్రను కూడా అధ్యయనం చేశారు. వివాహం తర్వాత ఆమె బందరులోనూ, బాపట్ల లోనూ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే యోగానంద్ పుట్టకముందే వారు మద్రాసులో స్థిరపడ్డారు. ఈ దంపతులకు 5 మంది పిల్లలు పుట్టారు, కానీ ముగ్గురు మాత్రమే జీవించారు. పెద్ద కుమారుడు కోటేశ్వర రావు భరణి స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా స్థిరపడ్డారు.

యోగానంద్ 2వ కుమారుడు. బాల్యంలో చాలా అల్లరి చేసేవారు. ఎవరూ అదుపు చేయలేకపోయేవారు. ఐదేళ్ల వయసులో, అమ్మగారు చనిపోయారు. తరువాత యోగానంద్‍ను దత్తత తీసుకున్న సుబ్బయ్య అనే వ్యక్తి వద్దకు తిరిగి బందరుకు పంపారు. సుబ్బయ్యకు బందరులో వాచ్ షాపు ఉండేది. ఆయన ధనవంతుడు, పైగా స్వంత ఫోటోస్టూడియో కూడా ఉండేది. ఫోటోగ్రఫీ కూడా చేసేవారు. యోగానంద్ తన 15 సంవత్సరాల వయస్సు వరకు బందరులో ఉన్నారు. అప్పటికి స్కూల్ ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించారు, ఆ తర్వాత రేడియోలో శిక్షణ పొందేందుకు బెంగళూరు వెళ్లారు. ఈ కోర్సు కోసం వెళ్ళేముందు కొన్నాళ్ళు ఫోటో స్టూడియోను నడిపారు. అద్భుతమైన ఫోటోలను, పోర్ట్రెయిట్‌లను ప్రింట్ చేసేవారు.

పాఠశాలలో ఆయన తన స్నేహితులను సమీకరించి ప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. ఆయన భయంకరమైన నరసింహ అవతారం వేసేవారు.  బెంగళూరులో కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగానంద్ తన తండ్రి వెంకట దాసు వద్దకు తిరిగి వెళ్ళారు. 1939లో, ఆయన జెమినీ స్టూడియోకి వెళ్లి సౌండ్ రికార్డిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జీతం తక్కువగా ఉందని, ఉద్యోగంలో చేరలేదు. పైగా తాను సినిమా రంగంలోకి వెళ్లడం తండ్రికి ఇష్టం లేదు, అందుకే తండ్రి జీవించి ఉన్నంత కాలం యోగానంద్ గారు సినిమా రంగంలోకి వెళ్లలేదు.

తన తండ్రి మరణం తరువాత, న్యూ టోన్ స్టూడియోలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా చేరారు. జీత్ బెనర్జీ, రెహమాన్, పురుషోత్తమ్‌లతో కలిసి పని చేశారు. 1943లో గూడవల్లి రామబ్రహ్మం గారు – యోగానంద్ గారి ప్రతిభ ఇక్కడ వృథా అవుతోందని భావించారు. తాము ‘మాయాలోకం’ సినిమా తీస్తున్నప్పుడు ఎడిటర్ మాణిక్యం దగ్గర అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. యోగానంద్‌కి మంచి జీతం కూడా ఇచ్చారు. సినిమా రంగంలో ఇది ఆయన మొదటి జీతం. షూటింగ్ ముగిసే సమయానికి యోగానంద్ మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, అందరిచే ప్రశంసలు పొందారు.

దీని తర్వాత, లంకా సత్యం, లంకా కామేశ్వర రావు గార్లు – ‘తులసిదాస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా యోగానంద్ గారిని సేలం తీసుకెళ్లారు. మూడు సంవత్సరాలు అక్కడే ఉండి వివిధ తెలుగు, తమిళ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఇంకా ఎడిటర్‌గా పనిచేశారు. 1947లో సేలం వదిలి మళ్లీ మద్రాసు వచ్చారు. రేణుక స్టూడియోలో కథా విభాగంలో చేరారు [ఫిల్మ్ మేకింగ్‌లోని వివిధ విభాగాలలో అద్భుతమైన కృషిని గమనించండి]. 1949 వరకు ఇక్కడ పనిచేశారు.

ఆ సమయంలోనే సాధన అనే నిర్మాణ సంస్థ వారు లింగమూర్తి దర్శకత్వంలో ‘సంసారం’ అనే సినిమా తీయాలని అనుకున్నారు. రేణుక స్టూడియో అనుమతి తీసుకుని, యోగానంద్ గారిని లింగమూర్తి దగ్గర అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. సినిమా నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయి, లింగమూర్తి స్థానంలో ఎల్.వి. ప్రసాద్ దర్శకుడిగా వచ్చారు. యోగానంద్‌కి ఎల్‌వి ప్రసాద్‌ బాగా తెలుసు. ‘సంసారం’ సినిమా కోసం పలు విభాగాల్లో చాలా సంతోషంగా పనిచేశారు యోగానంద్. ‘సంసారం’ 1950లో విడుదలై పెద్ద విజయం సాధించింది. దీని తర్వాత యోగానంద్ తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం ‘చంద్రిక’ కోసం అసోసియేట్ డైరెక్టర్‌గా; జగమణి వారి చిత్రాలలో ఎడిటర్‌గా బుక్ అయ్యారు. ‘సంసారం’ పెద్ద హిట్ అయి, దాని నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. అప్పటికి ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించబడింది. తనతో చేరమని ఎల్‌వి ప్రసాద్ యోగానంద్‌ని ఆహ్వానించారు. కృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌లో తమిళం, తెలుగు సినిమాకి పని చేయవలసి ఉన్నందున యోగానంద్ రెండు నెలల సమయం అడిగారు. ఈ చిత్రానికి తనని దర్శకుడిగా సిఫారసు చేయమని ఎల్‌వి ప్రసాద్‌ని అభ్యర్థించారు. ఎల్‌వి ప్రసాద్ వారి కెరీర్‌లో నిస్వార్థంగా చాలా మంది ప్రతిభావంతులను సిఫార్సు చేసారు. యోగానంద్ కోసం అదే చేశారు. దాంతో డి. యోగానంద్ – ఎన్. టి. రామారావు, పద్మిని నటించిన ‘అమ్మలక్కలు’ (తమిళంలో మరుమగల్) అనే తెలుగు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీనిని 1953లో లీనా చెట్టియార్ రూపొందించారు. ఆయన కృష్ణ పిక్చర్స్‌కు అంతరంగిక నిర్మాతగా మారారు. మదురై వీరన్ (1956)తో సహా అనేక బాక్సాఫీస్ హిట్స్ అందించారు, ఈ సినిమా ఎమ్. జి. రామచంద్రన్‌ను కేవలం – అందగాడిగా కనిపించే హీరో కన్నా – ఎక్కువగా అంచనా వేయడానికి బీజాలు వేసింది.

‘అమ్మలక్కలు’ సినిమాలో యోగానంద్ చేసిన పనిని ఇష్టపడి ఎన్టీఆర్ తన ‘తోడు దొంగలు’ సినిమాకు దర్శకుడిగా బుక్ చేసుకున్నారు. ఈ చిత్రంతో యోగానంద్ తక్కువ బడ్జెట్‌లో, చాలా తక్కువ సమయంలో ఒక చిత్రాన్ని ఎలా నిర్మించవచ్చో చూపించారు. భారత రాష్ట్రపతి నుండి మెరిట్ సర్టిఫికేట్, చైనా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్న ఈ చిత్రానికి ఆయన కథ కూడా రాశారు. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘జయసింహ’ లో యోగానంద్‌కి రెండవ అవకాశం ఇచ్చారు, అది బ్లాక్ బస్టర్ అయింది. దీనితో జనాలు వివిధ శాఖలలో యోగానంద్ పనిని గుర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత తమిళంలో కావేరిగా వచ్చిన విజయగౌరికి దర్శకుడిగా మారారు. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. అతను తెలుగు, తమిళ భాషలలో దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు; వాటిలో ఎన్. టి. రామారావు 17 చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. అతని చిత్రాలలో తోడు దొంగలు, ఇలవేల్పు, కోడలు దిద్దిన కాపురం, ఉమ్మడి కుటుంబం, మూగ నోము, జై జవాన్, వేములవాడ భీమ కవి, కథానాయకుని కథ, డబ్బుకు లోకం దాసోహం, జయసింహ, వాడే వీడు, తిక్క శంకరయ్య మొదలైనవి ఉన్నాయి.

యోగానంద్ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి వంటి కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యారు. అదే సంవత్సరం హనుమాయమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు.

డి. యోగానంద్ 28 నవంబర్ 2006 నాడు గుండెపోటుతో మద్రాసులో మరణించారు.

శ్రీవర తృతీయ రాజతరంగిణి-36

3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

ఉత్పన్నధ్వసినో భావాన్ కరిష్యాభ్యహమంజసా।
ఇతి జ్ఞాపయితు మేఘో బుద్బుదానసృజద్ ధృవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 6)

సమాజంలో ప్రతీదాన్ని ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నాయి, నీళ్లల్లో బుడగలు వచ్చేందుకు కారణమైన మేఘాలు.

ఇంతకు ముందు శ్లోకంలో బుడగలు సర్వం నాశనం చేసేందుకు పడగలెత్తిన పాముల్లా ఉన్నాయన్నాడు శ్రీవరుడు. ఈ శ్లోకంలో, ఆ బుడగలు వచ్చేందుకు కారణమయిన మేఘాలు, సమాజంలో ఉత్పన్నమయిన ప్రతీదాన్ని నాశనం చేస్తాయని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని అంటున్నాడు.

ప్రళయకాల మేఘాలన్నమాట. అప్పటికే కశ్మీరులో నదులు ఉగ్ర రూపం ధరించి సర్వం ముంచెత్తుతున్నాయి. ఇంతటితో ఆగము, ఇంకా విధ్వంసాన్ని కొనసాగిస్తామన్నట్టు బెదిరిస్తున్నట్టున్నాయన్నమాట మేఘాలు.

ఈ విశ్వంలో ఏదీ ఒంటరిగా రాదు. ప్రతీ దానికీ మరొకటి కారణమవుతుంది. దానికి ఇంకోటి కారణమవుతుంది. కానీ మనుషులు పైపై కారణాలు చూసి తీర్మానించేస్తారు. తరచి చూస్తే కానీ గొలుసులా ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న కార్యకారణ సంబంధం బోధపడదు. మానవ జీవితం వంద సంవత్సరాలు మాత్రమే. కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాలది. సృష్ట్యారంభంలో వెలువడిన తరంగాలను ఇంకా శాస్త్రవేత్తలు కనుగొంటునే ఉన్నారు. వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడో ఒక సీతాకోకచిలుక రెక్కలు అల్లాడించటం వల్ల ఉత్పన్నమయిన వాయు తరంగాల ప్రభావం ఎంతో కాలం తరువాత జరిగే పరిణామాలకు కారణమవుతుందంటుంది విజ్ఞానశాస్త్రం. దీనిని Chaos theory లో butterfly effect గా వర్ణిస్తారు.

ఈ సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే తుఫానుకు ఈనాడు ఒక సీతాకోకచిలుక రెక్కలు అల్లార్చటం వల్ల చెలరేగే వాయు తరంగాలు కారణమవుతాయి. అంటే, ఆరంభంలో కలిగే ఒక చిన్న మార్పు భవిష్యత్తులో జరిగే అతి తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది. విజ్ఞానశాస్త్రవేత్తలు దీన్ని butterfly effect అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు కార్యకారణ సంబంధం అన్నారు. ఈ కార్యకారణ సంబంధం వివరించేందుకు పురాణాలు బోలెడన్ని ఉదాహరణలు చెప్తాయి.

ఓ మహర్షి దైవ గృహంలోకి వెళ్తుంటే అడ్డుపడ్డారని ద్వారపాలకులకు శాపం ఫలిస్తుంది. ఫలితంగా వారు అయిదు రాక్షస జన్మలు పొందుతారు. మనిషి జీవితం సృష్టి వైశాల్యంతో పోలిస్తే బహు అల్పం. దాంతో ఎప్పుడో పొందిన శాపం, ఫలితంగా పొందుతున్న జన్మల నడుమ సంబంధాన్ని గుర్తించలేకపోతాడు మనిషి. ఆ నిజాన్ని అతి సూక్ష్మంగా స్ఫురింప చేస్తున్నాడు శ్రీవరుడు.

నీటిలో బుడగలు వర్షం వల్ల ఉత్పన్నమవుతాయి. వర్షం మేఘాల వల్ల భువిని చేరుతుంది. మేఘాలు భూమిపై నీరు ఆవిరి కావటం వల్ల ఏర్పడతాయి. నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరి అవుతుంది. సూర్యుడి వేడి భూమిని చేరే పరిమాణం భూమిపై మానవుల కార్యకలాపాలపై, వాటికి ప్రకృతి ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. అంటే, ప్రత్యక్షంగా ప్రకృతి కారణంగా కనిపిస్తున్నా, పరోక్షంగా మనిషి తన చర్యల ప్రభావాన్ని తానే అనుభవిస్తున్నాడన్న మాట. కర్మ ఫలాన్ని అనుభవించటం అంటే ఇదే!

వృక్షాః సర్వత్ర పత్రాంతః పతద్వృస్వనచ్ఛలాత్।
అశ్రుబిందూనివాముంచన్ రూదన్తో జనచిత్తయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 7)

చెట్ల ఆకులపై చిందే నీటి బిందువుల శబ్దం ఎలా ఉందంటే, భవిష్యత్తులో మానవులు అనుభవించే నష్టాలకు తలచుకుని వృక్షాల పత్రాలు రోదిస్తున్నట్టుగా ఉంది.

అద్భుతమైన వర్ణన!

మానవ మనస్తత్వాన్ని చక్కగా చిత్రించే వర్ణన ఇది.

మనిషి మనస్తత్వంలో ఓ వైచిత్రి ఉంది.

ఎదురుగా ఏమైనా ఉండనీ, మనిషి తాను చూడాలనుకున్నది చూస్తాడు.

ఎదురుగా ఏమైనా ఉండనీ, అతని మనసు ఏమి ఆలోచిస్తుందో అదే కనిపిస్తుంది, చూపిస్తుంది. ఇక్కడ శ్రీవరుడు భవిష్యత్తులో కశ్మీరు అనుభవించే ఇక్కట్లును వర్ణిస్తున్నాడు. కాబట్టి చెట్ల ఆకులపై పడుతున్న వర్షపు నీటి బిందువుల ధ్వని, మానవుల ఇక్కట్లను తలచుకుని చెట్లు రోదిస్తున్నట్టుగా ఉందంటున్నాడు.

మనిషి మనసులో ఉన్న భావన ప్రకృతిని అతడు అర్ధం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది.

అదే, ఓ ప్రేయసి ప్రియుడి సమాగమం కోసం ఎదురుచూస్తుంటే, చెట్ల ఆకుల ప్రతి శబ్దం ప్రియుడి పద ధ్వనిలా వినిపించేది. ప్రియుడి గుసగుసలుగా అనిపించిది. ప్రియుడి రాకకు స్వాగత గీతంలో తోచేది.

ఔచితీవంతమైన వర్ణన ఇది.

ఇలాంటి వర్ణన రచన సంవిధానంలో ఒక పద్ధతి. ఈ వర్ణన వల్ల ప్రకృతికి జరగబోయేది తెలుస్తుందన్న భావన కలుగుతుంది. ప్రకృతి ఇలా రోదించటం వల్ల కశ్మీరు ప్రజలు పడే ఇక్కట్ల గురించిన గ్రహింపు వచ్చి పాఠకుడి హృదయం బరువెక్కుతుంది. ఉద్విగ్నత పెరుగుతుంది.

నిజానికి కథా రచన కానీ, నవల రచన కానీ పాశ్చాత్య ప్రక్రియలనీ, వాటిని రచించేందుకు నియమాలు, సూత్రాలు పాశ్చాత్యులు ఏర్పాటు చేసినవి పాటించాలని ఒక తప్పుడు ప్రచారం సాహిత్య ప్రపంచంలో సాగుతోంది. కానీ మౌలికంగా రచన అన్నది ఏ ఒక్కరి సృష్టి కాదు. అది ప్రాకృతికంగా సృష్టి రచనలో ఇమిడి ఉన్నది. ఈ రచన సంవిధానాన్ని అవగాహన చేసుకున్న భారతీయులు, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి రూపొందించిన లాక్షణిక సూత్రాలను మించిన రచన సంవిధాన నిర్దేశనా సూత్రాలు ప్రపంచంలో వేరేవి లేవు. మిగతా సూత్రాలన్నీ కృత్రిమమూ, కృతకమూ మాత్రమే. శ్రీవరుడు రచన చేసే సమయానికి భారతదేశంలో పాశ్చాత్య రచన సూత్రాలు ప్రచారంలోని రాలేదు. అందుకే ఔచితీవంతమైన వర్ణనలతో, అతి చక్కని రచన సంవిధానంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నతామయంగా, ఆలోచనా స్ఫోరకంగా ఉంది రచన. సృష్టి రచన ప్రణాళికపై అవగాహన కలిగించే రీతిలో సాగుతోంది.

వితస్తా లేదరీ సింధుక్షిప్తికాద్యాస్తదాపగాః।
అన్యోన్య స్వర్ధయేవోగ్రా గ్రామాంస్తీరేశ్వమజ్జాయన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 8)

ఆ సమయంతో కశ్మీరు లోని – వితస్త, లేదరీ, సింధు, క్షిప్తికా నదులు ఉగ్ర రూపం ధరించటంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా, తీర ప్రాంతంలలో ఉన్న గ్రామాలను ముంచెత్తాయి.

అతి చక్కటి వర్ణన.

వరదల్లో ఉన్నప్పుడు నదులు పొంగిపొర్లటం, ఊళ్ళకు ఊళ్ళను ముంచెత్తటం సర్వసాధారణంగా జరిగేదే. సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పటమే సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం.

చూసింది చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సృజనాత్మకత అన్నట్టు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి గురయిన సాహిత్య ప్రపంచంలో “ఆకాశం నల్లగా ఉంది, చంద్రుడు తెల్లగా ఉన్నాడు, నీళ్లు నీలంగా ఉన్నాయి” అనటమే ఉత్తమ సృజనాత్మకతగా చలామణీ అవుతోంది. ఇలాంటి కాలం కన్నా ముందు వాడు కాబట్టి శ్రీవరుడు నదులు పొంగిపొర్లటాన్ని, ఊళ్ళను ముంచెత్తటాన్ని – ఉగ్రరూప ప్రదర్శనలో నదులు పోటీ పడుతున్నట్లుగా వర్ణించాడు.

వితస్త నది ఝీలమ్ నదిగా తెలుసు. లేదరీ నది అసలు పేరు ‘లంబోదరి’. ‘లంబోదరి’ అనే పదం అపభ్రంశం ‘లేదరీ’! అనంతనాగ్, విజయేశ్వరిల నడుమ ఈ నది వితస్తతో కలుస్తుంది. ఈ నది ఒడ్డుననే ‘పహల్‌గాంవ్’ ఉంది. సింధు నదిని కశ్మీరీ సాహిత్యంలో ‘ఉత్తర గంగ’ అంటారు. ద్రాస్, హరముఖ పర్వతాల నుంచి ఈ నదికి నీళ్లు అందుతాయి. సోనామార్గ్, కంగన్, గాందార్ బల్‌ల గుండా ప్రవహిస్తూ వితస్తలో విలీనమవుతుంది. ఈ నదిది తీవ్ర గతి. క్షిప్తికా నది శ్రీనగర్ గుండా ప్రవహిస్తుంది.

ఈ నదులన్నీ తీవ్రరూపం దాల్చి ఒడ్డున ఉన్న గ్రామాలను పోటీపడి ముంచెత్తాయి.

సవిభ్రమా ధృతావర్తా వాహిన్యుత్థాః సహేపితాః।
జవాదధావన్నుతుంగా స్తతరంగ తురంగమాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 9)

ఈ నదుల అలలు ఆశ్వాల( వాహినిల) వేగంతో ఎగసిపడి పరుగులెత్తాయి. ఈ తరంగాల శబ్దాలు యుద్ధ సమయంలో పరుగులెత్తే అశ్వాల సకిలింపుల శబ్దాలకు మించింది.

నదులు ఉగ్రరూపం దాల్చాయి. కాబట్టి, ఆ నదుల్లో ఎగిసిపడే తరంగాల వేగాన్ని అశ్వాల వేగంతోనూ, తరంగాలు ఎగసిపడుతూంటే ఉత్పన్నమవుతున్న హోరును యుద్ధ సమయంలోని అశ్వాల అరుపులతోనూ పోల్చటం ఔచితీమంతం. యుద్ధ సమయంలో ‘వాహిని’ అనటంతో మరింత భీకరమైన దృశ్యం కళ్ళ ముందు నిలుస్తుంది.

‘వాహిని’లో అయిదు వందల ఏనుగులు, 500 రథాలు, 1500 అశ్వాలు, 2500 పదాతిదళాలు ఉంటాయి. ఇలాంటి దశ సేనలను ‘పృతన’ అంటారు. పది పృతనాలు కలిపి ఒక ‘వాహిని’ అవుతుంది. అలాంటి ‘వాహిని’ ఘోషలా ఉందట తరంగాల ఘోష!

కశ్మీరీయుల లెక్కకు భిన్నమయిన లెక్క మహాభారతంలో కనిపిస్తుంది. మౌలికమైన ‘పత్తి’ అంటే అయిదుగురు సైనికులు, ముగ్గురు అశ్వికులు, ఒక ఏనుగు, ఒక రథం. మూడు ‘పత్తి’లు కలిస్తే, ఒక ‘సేనాముఖ’. మూడు ‘సేనాముఖ’లు కలిస్తే, ఒక ‘గుల్మా’. మూడు ‘గుల్మా’లు ఒక ‘గణం’. మూడు గణాలు కలిస్తే ఒక ‘వాహిని’. మూడు వాహినులు కలిస్తే ఒక ‘పృతాన’ అయితే, లెక్కలేమయినా శ్రీవరుడు చెప్పదలచుకున్నది అర్థమవుతుంది. చూపదలచుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో, అతి వేగంగా దూసుకు వస్తున్న సైన్య శబ్దాలతో కూడి ఉన్న ఉగ్ర నదులు సర్వం ముంచెత్తుతున్నాయి..

(ఇంకా ఉంది)

అద్వైత్ ఇండియా-38

0

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[కలకత్తాలో ఇల్లు సర్దుతున్న చామంతికి ఓ తెలుగు దినపత్రికలో చుట్టి ఉన్న లక్ష్మీదేవి బంగారు విగ్రహం కనబడుతుంది. మూడు వారాల క్రితం తమ ఊరి నుంచి వచ్చిన తండ్రీ, మావయ్యలు చెప్పిన దాని ప్రకారం ఆ విగ్రహం తమ ఊరి గుడిలోనిదేనని తలుస్తుంది. ఆ దినపత్రిక రాజమండ్రి నుంచి ముద్రితమైనది కావడంతో, తన అనుమానం నిజమని భావిస్తుంది. మర్నాడు విగ్రహాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా రైలెక్కి, రాజమండ్రికి బయల్దేరుతుంది. శాస్త్రి గారు జైల్లో, సావిత్రి ఆసుపత్రిలో ఉండి మూడు రోజులు గడుస్తాయి. నాల్గవరోజు సావిత్రి చనిపోతుంది. రెడ్డిరామిరెడ్డి గారు జైలుకి వెళ్ళి, అధికారులతో మాట్లాడి శాస్త్రి గారికి ఈ వార్త తెలియజేసి ఆయనను బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అయితే రాబర్ట్ అనుమతిస్తేనే విడుదల చేస్తామని అధికారులు చెప్తారు. రాబర్ట్ ఒప్పుకోడు. సీత సుల్తాన్‍తో కలిసి వెళ్ళి శాస్త్రిగారిని విడుదల చేయమని, ఆయనకి బదులుగా రెండు వారాల తరువాత తానే వచ్చి జైల్లో కూర్చుంటానని అంటుంది. సరేనంటాడు. సిగరెట్ పాకెట్ మీద -శాస్త్రిగారిని విడుదల చేయమని రాసి సంతకం పెట్టి ఇస్తాడు. దాంతో శాస్త్రిగారు జైల్లోంచి బయటకు వస్తారు. అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతాయి. ఈలోపు అద్వైత్ అక్కడికి చేరుకుంటాడు. తన ఇంటి వైపు నడుస్తున్న అద్వైత్‌కి, వీధిలోని స్త్రీలు సావిత్రి చనిపోయిందన్న విషయం చెప్తారు. చేతిలో ఉన్న సంచులక్కడే పడేసి పరిగెత్తుతాడు. ఆ స్త్రీలు ఆ సంచుల్ని శాస్త్రి గారింటికి చేరుస్తారు. కొడుకుని చూసిన శాస్త్రిగారు దుఃఖిస్తారు. అద్వైత్ వేదనకి అంతుండదు. సీతని పలకరిస్తాడు, పాపను చూస్తాడు. చివరికి తల్లి అంత్యక్రియలు సజావుగా పూర్తి చేస్తాడు.]

అధ్యాయం 75:

[dropcap]చా[/dropcap]మంతి రాజమండ్రి చేరింది. తన పుట్టింటికి వెళ్లి తల్లీ తండ్రీ మామయ్యలకు తాను ఎంతో ప్రయాసతో తెచ్చిన శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని చూపించింది.

ఆమె చెప్పిన మాటలను విని వారు ఆశ్చర్యపోయారు. ఆమె చేసిన సాహసాన్ని మెచ్చుకొన్నారు.

బాలయ్యా.. రంగయ్యలు రామిరెడ్డిగారిని కలసి మాత విగ్రహాన్ని వారికి అప్పగించారు. తమకు చామంతి చెప్పిన మాటలను వారు రెడ్డిగారికి చెప్పారు. ఆ సమయంలో అక్కడ వున్న సుల్తాన్..

“అయ్యా!.. చూచారా!.. నా అనుమానం నిజం అయింది..” అన్నాడు.

“పద సుల్తాన్!.. విషయాన్ని శాస్త్రిగారికి చెబుదాం. పుట్టెడు దుఃఖంలో వున్న వారు యీ విషయాన్ని వింటే.. కొంత వరకూ సంతోషిస్తారు.” అన్నాడు రెడ్డిగారు.

నలుగురూ శాస్త్రిగారి ఇంటికి వెళ్ళారు. విషయాన్ని చెప్పారు. విగ్రహం దొరికినందుకు వారు ఎంతగానో సంతోషించారు. చామంతి ధైర్యసాహసాలను గొప్పగా మెచ్చుకొన్నారు.

ఆనాటి నుంచీ సుల్తాన్.. కరీమ్, చలమయ్యలను పట్టుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నుడైనాడు.

సుల్తాన్ కొడుకు అంజాద్.. అతని బృందం.. రాఘవ కోసం.. గాలిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

అద్వైత్.. తన తల్లి సావిత్రి కర్మ క్రతువులను ఎంతో శ్రద్ధా భక్తితో నిర్వహించాడు. అన్ని విషయాలకు ఆ తండ్రీ కొడుకులను రెడ్డిరామిరెడ్డి గారు అండగా నిలబడి ఎంతో సాయం చేశారు. అది వారికి ఆ కుటుంబం మీద వున్న ప్రేమాభిమానాలకు తార్కాణం.

సీత రాబర్ట్‌కు చెప్పిన పదిహేను రోజుల గడువు రేపటితో తీరిపోతుంది. అంటే రేపు వుదయం తొమ్మిది గంటలకు సీత రాబర్ట్ సమక్షంలో వుండాలి.

ఆ రాత్రి.. సీత అందరినీ హాల్లోకి రమ్మని పిలిచింది. అందరూ హాల్లో సమావేశం అయినారు. సీత ఏం చెప్పబోతుందోనని అందరూ ఆమె ముఖంలోకి ఆత్రుతగా చూస్తున్నారు. అందరి ముఖాల్లోకి ఒక్కసారి చూచి.. “మామయ్యా!.. నేను మిమ్మల్ని జైలు నుండి విడిపించేటందుకు రాబర్ట్‌ను కలిశాను. అతను ఒక కండిషన్ చెప్పాడు. మిమ్మల్ని విడిపించేటందుకుగాను, నేను ఆ కండిషన్‌కి అంగీకరించాను.”

“ఏమిటమ్మా ఆ నిబంధన!..” అడిగారు శాస్త్రిగారు.

“మిమ్మల్ని విడిపించాలంటే.. నన్ను జైల్లో కూర్చోమన్నాడు..” ఎంతో గంభీరంగా చెప్పింది సీత.

“సీతా! దానికి నీవు అంగీకరించావా!..”.

“అంగీకరించాను బావా!..”

“తప్పు చేశావమ్మా!..” విచారంగా చెప్పారు శాస్త్రిగారు.

“నేను అంగీకరించి వుండకపోతే.. వాడు మిమ్మల్ని ఒదిలేవాడు కాదు మామయ్యా..” మెల్లగా చెప్పింది సీత.

“మామయ్యా.. సీతకు బదులుగా.. నేను వెళతాను..” అన్నాడు పాండు.

అద్వైత్.. సుమతులు పాండు.. ముఖంలోకి చూచారు.

“నాకేం భయం లేదు బావా!..”

“పాండూ!..” పిలిచాడు అద్వైత్.

“చెప్పండి బావా!..”

“వెళ్ళవలసింది నీవు కాదు.. నేను!..” నిశ్చలంగా చెప్పాడు అద్వైత్.

సీత అతని ముఖంలోకి చూచింది. చిరునవ్వు నవ్వాడు అద్వైత్.

ఆ నవ్వులో సంతోషం లేదు, విరక్తి,

“నేను చెప్పే మాటను అందరూ వినండి. మీరు చిన్నపిల్లలు.. మీ భార్యా బిడ్డలకు దగ్గరగా వుండవలసిన సమయం. వారికి మీ అవసరం ఎంతో వుంది. కాబట్టి.. నేను వచ్చిన పని పూర్తయిందిగా!.. నేను వెళతాను. అదే న్యాయం..” చెప్పారు శాస్త్రిగారు.

“నాన్నగారూ!.. గడచిన సంవత్సరం రోజుల్లో మీ శరీర తత్వంలో ఎంతో మార్పు. మీరు బాగా తగ్గిపోయారు. పైగా మీకు వయస్సు అవుతూ వుందిగా!.. ప్రశాంతమైన వాతావరణంలో మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. రేవు నేను వెళ్ళి రాబర్ట్ గారితో మాట్లాడుతాను. గత పదిహేను రోజులుగా అందరి శరీరాలు ఎంతగానో అలసి వున్నాయి. వెళ్ళి ప్రశాంతంగా పడుకొండి” ఎంతో అనునయంగా చెప్పాడు అద్వైత్.

కొన్నిక్షణాలు అద్వైత్ ముఖంలోకి పరీక్షగా చూచి శాస్త్రిగారు తన గదికి వెళ్ళిపోయారు.

పాండు, సుమతి వారి గదికి చేరారు.

అద్వైత్.. సీత తమ గదిలోనికి నడిచారు.

అది మంచంపై కూర్చొని నిద్రపోతున్న పాప ముఖంలోకి చూచాడు. ఆమె తలపై తన చేతిని వుంచాడు. ‘అందరూ అంటున్నట్లు యీమె ముమ్మూర్తులా నా పోలికే!..’ ఆ భావన మదిలోకి రాగానే పెదవులపై చిరునవ్వు.. అతని ముఖంలోకి చూచింది సీత..

“మీ ముఖంలో ఆ చిరునవ్వును చూచి పదమూడు మాసాలయింది బావా!..” ప్రక్కన కూర్చొని ప్రీతిగా అతని కళ్ళల్లోకి చూచింది.

నవ్వుతూ సీత ముఖంలోకి చూచాడు అద్వైత్.

“మీ వియోగంతో గడచిన కాలంలో నేను చాలా నేర్చుకొన్నాను బావా!..”

“ఏం నేర్చుకొన్నావు?..”

“శాంతి.. సహనం.. సౌభ్రాత్రం..”.

“ఊఁ.. పాపకు పేరేం పెట్టారు?..”.

“ఇంకా బాలసారె జరగలేదు. మీరు వచ్చాక బాలసారె జరుపుకొందాం అని మామయ్యతో చెప్పాను.”

“మా అమ్మ ‘భవానీ’ పుట్టిందని సంబరపడిపోయారు” నవ్వుతూ చెప్పింది సీత.

అద్వైత్ పాపను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఆ చిన్నారి మేలుకొని బోసినవ్వులతో అది ముఖంలోకి చూచింది.

“అమ్మా!.. నిద్ర లేచావా.. పద నీకు పేరు పెడతాను. సీతా రా?..” పాపతో ఇరువురూ పూజ గదికి వెళ్ళారు. “ఈ గదిలోనే మనం నమ్మిన దైవల ముందు నీ మెడలో నేను మాంగల్యాన్ని కట్టాను. అలాగే యీనాడు.. నా చిట్టి తల్లికి నామకరణాన్ని చేస్తున్నాను.”

పాప చెవి దగ్గరకు తన నోటిని చేర్చి.. “భవానీ.. భవానీ.. భవానీ..” నవ్వుతూ మూడు సార్లు చెప్పాడు.

“బావా!.. ఆ పేరు నాకు ఎంతో యిష్టం” నవ్వింది సీత.

“నాక్కూడా సీత..” చిరునవ్వుతో పాప నొసటన ముద్దు పెట్టాడు అద్వైత్

అధ్యాయం 76

మరుదినం వుదయం తండ్రికి.. సీతకు చెప్పి అద్వైత్ రాబర్ట్ కార్యాలయానికి వెళ్ళాడు. రాబర్ట్‌ను కలిశాడు.

“ఓ ఆదీ!.. ఎప్పుడొచ్చావ్ లండన్ నుంచి..”

“వచ్చి రెండు వారాలయింది సార్!..”

“పాపం.. మీ అమ్మగారు.. చచ్చిపోయారటగా!..”

“అవును..”

“నీ వైఫ్ పేరు.. పేరు..”

“సీత..”

“ఆ సీత!..” నవ్వాడు రాబర్ట్.. “వెరీ డైనమిక్ లేడీ!..” మరలా నవ్వాడు.

“యస్..” అన్నాడు అద్వైత్ ముక్తసరిగా.

“వేర్ ఈజ్ షీ.. షీ ఈజ్ సపోస్డ్ టు కమ్ అండ్ రిపోర్టు టు మీ!..”

“ఆమెకు బదులుగా నేను వచ్చాను..” ఆంగ్లంలో చెప్పాడు అద్వైత్.

“మీన్.. యు విల్ సిట్ ఇన్ ద జైల్..”

అద్వైత్ కొన్నిక్షణాలు మౌనంగా వుండిపోయాడు.

“ఆన్సర్ మీ.. ఆర్.. టెల్ మీ వేర్ ఈజ్ యువర్ బ్రదర్-ఇన్-లా రాఘవ?..”

“ఐ డోంట్ నో అబౌట్ హిం..”

“బట్.. హీనోస్ అబౌట్ యు నో!..”

“అఫ్‌కోర్స్”

“ఏయ్ !.. ఆదీ.. యు గో టుడే.. ఎంజాయ్ విత్ వువర్ వైఫ్. కం టుమారో బై ద సేమ్ టైమ్!..”

“థాంక్యూ!..” చెప్పి అద్వైత్ ఇంటికి వెళ్ళిపోయాడు.

జరిగిన సంభాషణను తండ్రికి సీతకు చెప్పాడు. వారు మౌనంగా విన్నారు.

ఆ రాత్రి సీత.. లండన్ విశేషాలను అడుగుతూ, “బావా!.. ఇండియా ఎలా వుంది?..” అంది.

ఇండియా జ్ఞప్తికి రాగానే..

ఆ పేరు వినగానే.. అద్వైత్ ఆలోచన ఇండియా వైపుకు మరలింది.

“ఏంటి బావా ఆలోచిస్తున్నారు?..”

“మరచిపోయాను సీతా..” మంచంపై నుంచి వేగంగా లేచి తన లగేజ్‌లో ఒక బ్యాగ్‌ను తెరచి తాను షిప్ ఎక్కే ముందు ఇండియా ఇచ్చిన చిన్న బాక్సును సీతకు అందించాడు అద్వైత్.

“బావా!.. ఏమిటిది?..”

“లోపల ఏముందో నాకూ తెలీదు. విప్పి చూడు. నీవు గర్భవతివన్న మాట విన్నాక.. నేను బయలుదేరే ముందు ‘నా సిస్టర్ బిడ్డకు నా చిన్న కానుక’ అని చెప్పి నాకు యిచ్చింది ఇండియా..”

సీత పాకెట్ విప్పి చూచింది. బంగారు గొలుసు, చేతికి తీసుకొంది పరిశీలనగా చూచింది.

“చాలా బాగుంది బావా!..”.

“నిజంగానా!..”

“అవును.. ఇండియా మనస్సు స్వచ్ఛమైన బంగారం..”

“ఇండియా మనస్సు అంత స్వచ్ఛమా..”.

“అవును..” క్షణం తర్వాత.. “సంవత్సరం రోజులు ఆమెతో కలసి వున్నావు కదా.. ఆమె మనస్తత్వం నీకు అర్ధం కాలేదా!..” అడిగింది సీత.

నవ్వాడు. అద్వైత్..

“ఏమిటా నవ్వు!..”

“అలాంటి ఆలోచనలు చేసే దానికి నాకు అక్కడ సమయం దొరకలేదు సీతా!..”

“యీ మాటను నేను నమ్మాలా!..”.

“ఇప్పుడు నీలో నాకు ఎవరు కనిపిస్తున్నారో తెలుసా!..”.

“ఇండియానా!..” నవ్వింది సీత.

“కాదు.. సంవత్సరం క్రిందటి నా మరదలు సీత..”

సీత మనస్సులో రాబర్ట్ ప్రవేశించాడు.

“బావా!.. రేపు నిన్ను రాబర్ట్ ఏమడుగుతాడు?..”

“ఏమైనా అడగవచ్చు. వాడు ఎన్ని రకాలుగా అడిగినా రాఘవను గురించే కదా!..”

“అవును. అన్నయ్య ఎక్కడున్నాడో.. ఎలా వున్నాడో!..” సీత ముఖంలోని ఆనందం స్థానంలో ఆవేదన నిండుకొంది.

“నేను ఎన్నో విధాల వాడికి చెప్పాను.. ఆవేశాన్ని తగ్గించుకోరా అని.. నా మాటలను లెక్క పెట్టలేదు” విచారంగా చెప్పాడు అద్వైత్.

“బావా!.. మా అన్నయ్య మంచివాడా చెడ్డవాడా!..”.

“చాలా మంచివాడు సీత.. వాడిలో వున్న చెడ్డ గుణం.. ఆవేశం..”.

“అన్నయ్య మీద నీకు కోపం లేదా!..”.

“లేదు సీతా!.. వాడి మీద నాకు కోపం ఎన్నటికీ రాదు”

రాఘవ ఆలోచనలు.. ఆ ఇరువురి మనస్సులను కలచి వేశాయి. మౌనంగా పడుకున్నారు.

పూచే పూల లోన-79

0

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍తో మాట్లాడుకునేందుకు, జుహు బీచ్‌లో ఎవరికి దొరకని చోట రహస్యంగా బుక్ చేయిస్తుంది సారిక. ఆ పూట డబ్బు గురించి, బంధాలు అనుబంధాల గురించి మాట్లాడుతుంది. అవి సముద్రంలోని అలల్లా వస్తాయి, పోతాయని అంటుంది. మరి ఏది ముఖ్యమని సమీర్ అడిగితే, ఇవేవీ కావు, ముఖ్యమైనది కాలం అని చెబుతుంది. ఎందుకని అడిగితే, ఈ క్షణంలోనే జీవించెయ్యాలనీ, మన సమయం అయిపోయిన తరువాత కూడా మన పని లోకంలో మిగిలిపోవాలని అంటుంది. తమ గురించి పేపర్లలో వస్తున్న వార్తలని ప్రస్తావిస్తాడు సమీర్. అవి వార్తలు కాదు, మనం నిజంగానే దగ్గరగా ఉంటున్నాం అంటుంది సారిక. ఎంత దగ్గర అని సమీర్ అడిగితే, మాట మార్చి, ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. ఓపిక ఉన్నంత వరకూ అని చెప్తాడు. తాను అన్ని చేయలేనని, ఒక్క ఏడాది వయసు పెరిగినా, అమ్మాయిలను ఒప్పుకోరని అంటుంది. తాను కాకుండా వేరే హీరోయిన్‍లతో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతుంది. చాలా బావుంటుందని అంటాడు. పబ్లిక్ గురించి మాట్లాడుతుంది సారిక. తాను ఈ ప్రపంచానికి ఎన్నడూ అలవాటు కానని అనిపిస్తుందంటాడు సమీర్. దూరంగా వెళ్తున్న షిప్‌ని చూస్తూ – అందులో తన తండ్రి ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. మరి అమ్మ అని సారిక అడిగితే, అమ్మ ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుందంటాడు. వెళ్ళి చూడవచ్చు కదా అని సారిక అడిగితే, నాన్నని తలచుకుంటే వెళ్ళబుద్ధి కాదని చెప్తాడు సమీర్. తర్వాత మాట మారుస్తాడు. – ఇక చదవండి.]

చాలా రోజుల తరువాత జో ఫోన్ చేసాడు.

“అడక్కూడదు, అయినా ఆడుగుతున్నాను”, అన్నాడు.

వాస్తవానికి నాజూ జో కీ మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు, ఉండదు. కానీ ఎందుకైనా మంచిదనుకున్నాడో ఏమో, ఓ మాట అలా ఉంచాడు.

“అడుగు.”

“అడుగుల గురించే”

“అడుగు.”

“జాగ్రత్తగా పడుతున్నాయా?”

“పడటం లేదా?”

“రజనీశ్‌తో బాగానే ఉంటోందా?”

“ఎందుకని అలా అడిగావు? ఏదైనా విన్నావా?”

“సూటిగా చెబుతాను.”

“యస్?”

“సారిక మూలంగా మీ ఇద్దరూ దూరమైనారనీ, ఇక మీద సినిమాలు కలిసి చెయ్యరని విన్నాను. నిజమా?”

“కాదు.”

“మరి ఏది నిజం?”

“ఏదీ నిజం కాదు. రజనీశ్ పెద్దమనిషి. పూర్తి ప్రొఫెషనల్. సారికకు, నాకూ దోస్తీ మటుకే. రజనీశ్ ఏ రోజూ ఈ విషయం ప్రస్తావించలేదు.”

“నువ్వు ఈ రోజు సారికను వెంట వెట్టుకుని తిరిగినట్లు రజనీశ్ చాలా సార్లు తిరిగాడు. తెలుసు కదా?”

“తెలుసు.”

“మరి రేపు..”

“జో!”

“తప్ప్పుగా అనుకోకు పార్ట్‌నర్. అన్ని వేళలూ ఒకలాగ ఉండవు, అన్ని వ్రేళ్ళూ ఒకలాగా ఉండవు. ఇది వేళాకోళం కాదు.”

“నువ్వు కాబట్టి నన్ను ఎలర్ట్ చేసావు. అయినా చాలాసార్లు ఈ ఆలోచనలు నా బుర్ర పాడు చేసాయి. కానీ ఒక్క విషయం అడుగుతాను.”

“అడుగు.”

“నీ ఆరోగ్యం ఎలా ఉంది?”

వింతగా నవ్వాడు జో.

“నా ఆరోగ్యానికేం? దర్జాగా ఉన్నాను. నువ్వు సెలెబ్రిటీవి. నేను – నువ్వు నాకు తెలిసిన సెలెబ్రిటీని. అదేంటో ఏ బార్‍కెళ్ళినా, నన్ను ఎవరూ బిల్ కట్టనీరు. ఎన్నికలలో నిలబెట్టాలనుకుంటున్నారు.”

“నువ్వు అలాంటి పనులు చెయ్యవని నాకు తెలుసు. నాకు అక్కడికి వచ్చేయాలనుంది జో.”

“ఎందుకు?”

“చల్లగాలికి సాయంత్రం చక్కగా ఏదో గిటార్ వాయించుకుంటూ పాడుకుంటూ ఉంటే ఆ ఆనందం వేరు.”

“నిజమే. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడు నువ్వు గోవా ప్రజలకు ఓ గొప్ప ప్రతినిధివి. అది మరచిపోకూడదు. నీ మీద చాలా బాధ్యతలున్నాయి మరి.”

“అది నిజమని నమ్మాలనే ఆశ ఉంది జో. ఒక జీవితంలో, ఒకే జీవితకాలంలో ఇద్దరు హీరోలను చూసిన వారమవుతాను.”

“అది నిజం.”

“ఇంతకీ సారిక, రజనీశ్, నా గురించి ఈ సందర్భం ఈ రోజే ఎందుకు ముందుకు వచ్చింది?”

“సారిక తండ్రి మలేసియాలో పెద్ద వ్యాపారస్థుడు. చెప్పిందా?”

“లేదు.”

“ఇండియా వదిలి చాలా కాలం అయింది.”

“ఇక్కడికి రాడా?”

“రాడు. ఇప్పుడు వస్తాడు.”

“ఎందుకు?”

“నీతో మాట్లాడాలి కదా?”

ఆశ్చర్యం వేసింది. జో కి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నాతో మాట్లాడడానికి సారిక తండ్రి రాబోతున్నాడా? అంటే సారిక ఏదో పెద్ద అడుగే ముందుకు వేసిందన్న మాట!

“ఏం మాట్లాడాలి?”

“సారిక సంగతి.”

“నో..”

“అదేంటి?”

“మేము అలాంటిదేమీ అనుకోలేదు.”

“పిచ్చివాడా! సారిక తన తండ్రితో పది సంవత్సరాల తరువాత మాట్లాడింది.”

“ఇవన్నీ నీకెలా తెలుసు?”

“పిచ్చివాడా! పంచుకున్న దానినే ప్రపంచం అన్నారు. తిన్నావా?”

“తిన్నాను.”

“పడుకో. గుడ్ నైట్.”

***

తలుపు తోసి ఆ అపార్ట్‌మెంట్ హాల్లోకి అడుగుపెట్టాను. నా వెనుకనున్న తలుపు మూసేసి గడియ పెట్టేసాను. సోఫాలో ఒంటరిగా కూర్చున్న సారిక విస్తుపోయి నిలబడిపోయింది. పెదాలు కొరుక్కుంది. నేను కదలలేదు, మాట్లాడలేదు. తనూ ఏమీ మాట్లాడలేదు. టీపాయ్ మీద ఏవో పుస్తకాలున్నాయి. రెండు మేగజైన్లున్నయి. వాటి మధ్యలో తన మొబైల్ అంది. దాన్ని తీసుకోబోయి ఎందుకో అక్కడే ఉంచేసింది. మరల దాని వైపు ఎందుకో భయంగా చూసింది.

జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి ఒక సిగరెట్ ఇవతలకి తీసాను. డోర్‌కి ప్రక్కగా ఉన్న ఒక స్టూల్ మీదనున్న ఆష్ ట్రేను జాగ్రత్తగా చూసాను. దాని ప్రక్కన ఓ అగ్గిపెట్టె ఉంది. దానిని తీసుకోబోయి ఆగాను. సారిక నన్ను పరీక్షగా చూస్తోంది.

ఎందుకైనా మంచిదని జేబు లోంచి లైటర్ తీసాను. నా కుడికాలు కొద్దిగా మడిచి వెనుకనున్న తలుపు మీద పాదం ఆన్చాను. సిగరెట్ ముట్టించాను. ఏం చేస్తావన్నట్టు సారికను చూసాను. ఏమీ చేయకన్నట్లు చూసింది.

మా ఇద్దరికి అవతల ఉన్న గోడకి ఓ పెద్ద కిటికీ ఉంది. దానికి అవతల బాల్కనీ ఉంది. గాలికి ఆ కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. ఆ చప్పుడికి అటు వెళ్లబోయి ఎందుకో ఆగి మరల ఇటు తిరిగింది. మేగజైన్ కాగితాలు గాలికి ఎగురుతున్నాయి.

ఏదో అనబోయి ఆగిపోయింది సారిక. పరీక్షగా చూసి మూతి బిగించాను. సిగరెట్ తన పని అది చేసుకుంటుంది – లోలోన కాలిపోతోంది!

ఆ పొగ పోతున్న దారిని భయంగా చూస్తోంది.

గబుక్కున మొబైల్ తీసుకోబోయి రిమోట్ తీసుకుని నంబర్లు నొక్కింది. నేను కళ్ళు పెద్దవి చేసి వ్యంగ్యపు ధోరణిలో చిరునవ్వు నవ్వి ఊర్కున్నాను.

ఆ రిమోట్ అక్కడ పరేసి రెండు చేతులూ చెవుల మీద పెట్టుకుంది. ఏదో పెద్ద మోత తట్టుకోలేకుండా ఉన్నట్లు కళ్ళు మూసుకుని గింజుకుంది.

కళ్ళు తెరచింది. గుటకలు మింగింది. దీర్ఘమైన శ్వాస తీసుకుంది.

“న..”

ఏంటి అన్నట్లు చూసాను.

“నన్ను..”

“….”

“నన్ను వదిలేయ్ ప్లీజ్!”

గోడ మీద చెయ్యి పెట్టాను. ఏమి మాట్లాడలేదు. సిగరెట్ పీలుస్తూనే ఉన్నాను.

“నేను ఏమేమో అనుకున్నాను.”

సిగరెట్ పీక నలిపి ఆష్ ట్రే లో వెయ్యబోయి ఆగాను. దానిని నా దగ్గరే ఉంచుకున్నాను. నిజమా అన్నట్లు తల ఊపాను.

“నాకు ఊహలే తప్ప నిజ జీవితం గురించి తెలియిదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నన్ను ఏమీ చెయ్యకు.. ప్లీజ్!”

నేను ఏమీ మాట్లారలేదు. రెండు చేతులూ నా వెనుక పెట్టి క్రిందకి చూస్తూ నిలబడ్డాను.

“మగవాళ్ల మీద దురుసుగా మాట్లాడాను..” అంటోంది, “..నిన్ను ఎన్నో సార్లు పరీక్షించి చూసాను. నువ్వు బాధ పడతావని తెలుసు. వింత వింతగా మాట్లాడాను. నన్ను వదిలెయ్.. ప్లీజ్”

వెనక్కు తిరిగాను. ఏదో గుర్తుకొచ్చి మరల తన వైపు తిరిగాను. చాలా భయపడుతోంది. రెండడుగులు ముందుకు వేసి ఆగాను. కిటికీ రెక్క ఈసారి గాలికి మూసుకొని బిగుసుకుంది. కదలటం లేదు. కర్టెన్ ఒకటే ఊగిపోతుంది. ఆ కిటికీ వైపు రెండడుగులు వేసి ఆగిపోయింది సారిక. పైట పూర్తిగా కప్పుకుంది. నా వైపు తిరిగి బేలగా మొహం పెట్టుంది.

టీపాయ్ మీద ఉన్న మాగజైన్లలోని పేజీలు అటూ ఇటూ తిరిగి ఒక చోట ఎందుకు నా కోసమే.. కాదు మా ఇద్దరి కోసమే ఆగిపోయినట్లు ఆగాయి. ఎడమ ప్రక్కనున్న పేజీ మీద తన ఫోటో, కుడి ప్రక్కన పేజీ మీద నా ఫొటో కనిపిస్తున్నాయి.

ఆ మేగజైన్‍ను మూసేసింది. అడ్డదిడ్దంగా పెట్టింది.

“నన్ను క్షమించు.” అంది.

దీర్ఘమైన శ్వాస తీసుకుని, వదిలి అలాగే అన్నట్లు తల ఊపి వెనక్కు తిరిగాను. తలుపు గడియ తీసి బయటకు వచ్చి తిరిగి గబుక్కున లోపలికి వెళ్ళి గడియ వేసుకోమని సైగ చేసి, చిలిపిగా, చిరునవ్వు నవ్వి వచ్చేసాను..

“కట్”, గట్టిగా అరిచాడు డైరక్టర్ రజనీశ్.

(ఇంకా ఉంది)

వసంత లోగిలి-6

0

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన భర్తకి నిత్య గతం గురించి చెబుతూంటుంది శారద. నిత్య మామూలు మనిషి కాదని, నిత్య అంటే ఓ ఆశయమని, పడి లేచే కెరటమని చెప్తుంది. వైజాగ్‍లో తను ఆరో క్లాసు చదువుతున్నప్పుడు తమ బడిలోనే, తమ క్లాసులోనే నిత్య కొత్తగా వచ్చి చేరిందని చెప్తుంది. తమ క్లాసులోని అందరూ పిల్లలు ఆ కొత్తమ్మాయితో స్నేహం చేయడానికి ఉత్సాహం చూపించారనీ, కానీ తాను మాత్రం ఓ వారం రోజులు నిత్యని పట్టించుకోలేదని చెప్తుంది. నిత్య – చందమామ కథలు, రామాయణ, మహాభారత కథలు.. పెద్ద బాలశిక్ష లాంటి పుస్తకాలు తప్ప ఏ రోజు క్లాస్ పుస్తకాలు చదివేది కాదనీ, అయినా క్లాస్‍లో ఏ ప్రశ్న అడిగినా టకీమని సమాధానం చెప్పేదని చెప్తుంది శారద. దాన్ని బట్టి నిత్య ఏకసంథాగ్రహి అనే టీచర్లు అనేవారని అంటుంది. మెల్లిగా నిత్య అంటే ఇష్టం పెరిగి, తనకి దగ్గరయ్యాననీ, తమ స్నేహం రోజురోజుకీ పెరిగిందనీ, ఇంటర్‍లో ఒకే గ్రూప్ తీసుకునేలా చేసిందని చెబుతుంది. అలాగే డిగ్రీ కూడా ఒకే కాలేజీలో చదివామనీ, నిత్య మంచి వక్త అనీ, తన మాటలతో అందరినీ ఆకట్టుకునేదని చెప్తుంది. డిగ్రీలో చివరి పరీక్ష వ్రాసిన తరువాత, నిత్య మాయమై పోయిందనీ, మళ్ళీ ఎన్నడూ కలవలేదని, ఈ లోపు తమ వివాహం జరిగిపోయిందని భర్తకి చెబుతుంది శారద. నిత్య వాళ్ళింటికి వెళ్ళి బోగట్టా చేసినా, ఏ సమాచారమూ లభించలేదని, ఓరోజున నిత్య వాళ్ళింటికి వెళితే, ఎదురింటావిడ – ఏదో కారు వచ్చిందనీ, అందరూ దానిలో వెళ్ళిపోయారనీ చెప్తుంది. కొన్ని రోజుల తరువాత, పేపర్లో నిత్య, ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని చదివి బాధపడ్డానని చెప్తుంది శారద. అయితే పేపర్లో నిత్య తల్లి పేరు స్వప్నిక బహుదూర్ అని ఉండడం శారదకి ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకి తెలిసినంత వరకు నిత్య తల్లి పేరు సుమిత్ర. మర్నాడు వారు చనిపోయారన్న వార్త వస్తుంది. మంచి స్నేహితురాలిని పోగొట్టుకున్నానని బాధపడుతుంది శారద. ఆ తర్వాత టీవీలో చూపించిన వివరాల ప్రకారం నిత్య వాళ్ళది రాజవంశమనీ, నిత్య బహుదూర్ వంశపు యువరాణి స్వప్నికా బహుదూర్ కూతురనీ, తిలక్ నందిని బహుదూర్‌ల ముద్దుల మనవరాలని తెలిసిందని చెప్తుంది శారద. స్నప్నిక బహాదూర్ – హోదాని, ఆస్తులని అంతస్తులని  వదిలేసి తాను ప్రేమించిన సుధీర్ వర్మను పెళ్ళి చేసుకుని వచ్చేసిందని తెలిసిందని చెప్తుంది. తమ పెళ్ళయ్యాక, 8 ఏళ్ళ తరువాత, తాను పుట్టింటికి వచ్చాననీ, ఓ రోజు అనుకోకుండా తనకు ఓ ఫోన్ వచ్చందని చెప్తుంది. అవతలి వైపు నుంచి నిత్య మాట్లాడిందని, తాను చనిపోలేదని బతికే ఉన్నానని చెప్పిందని అంటుంది శారద. తరువాత తాను నిత్యని వాళ్ళింట్లో కలిసాననీ, నిత్య తన అమ్మానాన్నల గురించి చాలా వివరాలు చెప్పిందని అంటుంది. తన తల్లి స్వప్నిక గురించి, తన తండ్రి సుధీర్ వర్మ చెప్పిన విషయాలను తన నేస్తం శారదకి చెబుతుంది నిత్య. పరీక్షలు రాసి తాను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏడుస్తుంటే, నాన్న ఓదారుస్తున్నారని – విషయం ఏంటని అడిగితే, తన అమ్మమ్మ, తాతయ్యలు చనిపోయారని తెలిసిందనీ, తాము బయల్దేరి వెళ్ళాలని అంటారు. నిత్య అమ్మమ్మ, తాతయ్యల గురించి సుధీర్ వర్మ నిత్యకి చెప్పిన విషయాలని – నిత్య తనకి చెప్తే, ఆ వివరాలని తన భర్తకి చెబుతుంది శారద. ఇక చదవండి.]

[dropcap]“నే[/dropcap]ను ఐదో క్లాస్ చదువుతున్న రోజులవి. మా నాన్నని తిలక్ బహుదూర్ గారి కోటలో లెక్కలు రాసే పనికి మా తాత కుదిర్చాడు. అలా నాన్నతో నేను రోజు వెళ్ళేవాడిని. ఆ కోటలో పిల్లలతో ఆడుకునే వాడిని.

ఆ ఆస్థానంలో తిలక్ బహుదూర్ గారి సవతి సోదరి భర్తని కోల్పోయిన బాధతో తన పదేళ్ళ బిడ్డతో తిలక్ బహుదూర్ వద్దకు చేరింది. ఆమె పేరు అంజన.. ఆమె బిడ్డ పేరు ధనుంజయ్.

అంజన గారిని, ఆమె బిడ్డని ఎంతో ఆదరంగా చూసేవారు తిలక్ బహుదూర్, నందిని గార్లు.

కాని సవతి తల్లి బిడ్డ కావడంతో తిలక్, నందినిల మద్య సయోద్యని దెబ్బ కొట్టాలని అంజన విశ్వ ప్రయత్నం చేసేవారు. ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉండే తిలక్ నందినల మద్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలైనప్పటికీ అవి తాత్కాలికమే అయ్యేవి.

నేను, ధనుంజయ్ ఒకే వయసువాళ్ళం సుమారుగా. అమ్మ మాకంటే ఒక ఏడాది చిన్నది. నేను ఆ కోటలో నా వయసు పిల్లలతో ఆడుకునే వాడిని. అలాగే ధనుంజయ్ వచ్చాక తనతో కూడా ఆడుకునే వాడిని. చదువు సంద్యలు గాని, పెద్ద వాళ్ళ పట్ల మర్యాద కాని కొరవడిన ధనుంజయ్‌ని కాస్తా అప్పుడప్పుడు తిలక్ గారు గమనిస్తుండేవారు. కాని అంజన గారి ముఖం చూసి.. తండ్రి లేని బిడ్డ కదా! అని పెద్దగా దెబ్బలాడలేకపోయేవారు.

ఒక రోజు మేమంతా ఆడుకుంటున్నాం. ఆ ఆటలో ధనుంజయ్ ఓడిపోయాడు. ఆ కసితో, కోపంతో మమ్మల్ని చితకబాదేసాడు. ‘సుదీర్ వర్మా నిన్ను చంపేస్తా!’ అని నా మీద మీదకి వచ్చాడు. అది చూసి మా నాన్న ధనుంజయ్‌ని రెండు చేతులతో ఆపి, ఇది మర్యాద కాదని, ఓడిపోయినప్పుడు ఒప్పుకోవాలని చెప్పడానికి ప్రయత్నం చేసిన నాన్న మీద చెయ్యి చేసుకున్నాడు. అది చూసిన తిలక్ బహుదూర్.. తన తీక్షణమైన చూపులతో ధనుంజయ్‌ని హెచ్చరించటం అంజన గారికి నచ్చలేదు. కాని కాస్తా కొడుకుని అదుపులో ఉంచమని ఆమెకి తిలక్ గారు చెప్పారు. ఆ రోజు నుంచి నేను వెళ్ళిన ప్రతీసారి నన్ను ఆడుకోనీకుండా అడ్డుకునే ప్రయత్నం చేసేది. రానివ్వకుండా అడ్డుపడేది. అయినా నాన్న నన్ను తీసుకుని వెళ్ళేవాడు.

నా వయసు పిల్లలందరికీ కోటలో రాజగురువు మార్తాండ వచ్చి అప్పుడప్పుడు కథలు చెపుతూ ఉండేవారు. అలా ఓ రోజు కథలు చెబుతుండగా.. అక్కడికి స్వప్నికని తీసుకుని వచ్చారు నందిని గారు.

ఆ తరువాత నుంచి నేను పిల్లలందరితో పాటు కథలు వింటాను అని మారాం చేసి మా వద్దకి స్వప్నిక రోజూ వచ్చేది. వస్తూనే నా పక్కన కూర్చుని మార్తాండ గారి కథలు వినేది స్వప్నిక.

స్వప్నికకి చాలా సందేహాలు వచ్చేవి. రాజగురువు మార్తాండ గారిని అడిగి తన సందేహాలు తీర్చుకునేది. తెలివైన స్వప్నికని మార్తాండ గారు చాలా పొగిడేవారు. ఆ గుంపులో ఉన్న ఇద్దరి ముగ్గురితో పాటు నన్ను కూడా అప్పుడప్పుడు పొగిడేవారు. కాని అది ధనుంజయ్‌కి నచ్చేది కాదు.

మార్తాండ గారి పాఠాలను, కథలను శ్రద్దగా వినే స్వప్నిక చాలా మొండిది.

ఒక రోజు, ‘నేను ధనుంజయ్ దగ్గర కూర్చోను’ అని తెగేసి చెప్పింది. అది చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు ధనుంజయ్. అలా వారి మద్య వైరం చిలికి చిలికి గాలి వాన అయింది. వాళ్ళిద్దరి మద్య వైరం ముదిరింది. నా పక్కన కూర్చుంటావా! లేదా అని కళ్ళు ఉరిమి చూసేవాడు.. భయపడుతూ నా పక్కన వచ్చి కూర్చునేది.. అది తనకు నచ్చేది కాదు.. కొన్నిసార్లు మా గ్రూప్‌లో ధనుంజయ్ ఉంటే వచ్చేది కాదు. ఇలా వాళ్ళిద్దరి మద్య దూరం ఉండేది.

పిల్లలందరూ పెద్దవాళ్ళమైపోయి యుక్త వయస్సుకి వచ్చాం. స్వప్నిక ధనుంజయ్‌ల మద్య వైరం కూడా పెరుగుతూ వచ్చింది. నేను మార్తాండ గారు చెప్పిన వేదాలు వల్లె వెయ్యటం బాగానే నేర్చుకున్నాను. నాతో పాటు స్వప్నిక పోటీ పడేది. అది ధనుంజయ్‌కి నచ్చేది కాదు. ‘వాడితో ఎందుకు పోటీ, నాతో పోటీ పడు’ అని చెప్పిన ధనుంజయ్‌తో ‘నువ్వు నాకు పోటీనే కాదు’ అని తీసి పారేసింది స్వప్నిక. ‘నాతో పోటీ పడకపోయినా పరవాలేదు కాని, వాడితో నీకు పోటీ ఏంటి?’ అన్నాడు ధనుంజయ్. ‘సుదీర్ వర్మ తో పోటీ పడటం నాకు ఇష్టం’ అంది స్వప్నిక. దానితో ధనుంజయ్ కోపం నషాళానికి ఎక్కింది.

‘చూస్తూ ఉండు స్వప్నిక.. నేను నీకు మొగుడినవుతా.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా వశం చేసుకుంటా’ అంటూ కోటలో పెద్దగా అరుస్తూ విర్రవీగాడు. అది విన్న నందిని అమ్మగారు చాల భయపడ్డారు. అప్పటి నుంచి స్వప్నికని మాతో పాటు మార్తాండ గురువు గారి వద్దకు కూడా రానిచ్చేవారు కాదు. స్వప్నిక ఎంత అల్లరి పెట్టినా నందిని అమ్మగారు పంపేవారు కాదు.

‘చూసావా! ఒక్క మాటతో స్వప్నికని కోటలో నుంచి బయటకు రాకుండా చేసాను’ అని విర్రవీగేవాడు ధనుంజయ్.

స్వప్నికకి చాలా పట్టుదల ఎక్కువ. ‘నాన్నగారూ! అమ్మ నన్ను బయటకు పోనీయటం లేదు. పిల్లలందరితో కలసి ఉండనీయటం లేదు. ఇది నాకు నచ్చటం లేదు’ అని వాదించేది.

‘పిల్లను అలా బంధించి ఉంచటం మంచిది కాదు. రాచరికపు ఛాయల నుంచి మనం బయటపడాలి నందిని. అందులోనే మనం ఉండిపోకూడదు. అందులోనే మగ్గిపోకూడదు. మన బిడ్డనైనా ఈ అర్థం లేని రాచరికపు ఆంక్షల నుంచి బయటపడేయాలి. ఇలా పెరగటం నాకు ఇష్టం లేదు. సామాన్యులతో సమానంగా నా బిడ్డ పెరగాలి. ఈ రాజరికపు ఆంక్షలు మనతో పాటు బిడ్డ భవిష్యత్తుని నాశనం చెయ్యకూడదు నందిని’ అనేవారు తిలక్ బహుదూర్.

‘దానికి చాలా సమయం పడుతుంది. మనమే మన హోదాని, మన రాచరికపు సంప్రదాయాలని ఇంకా పెంచి పోషిస్తున్నాం. రాచరిక వ్యవస్థ పోయి చాలా ఏళ్ళు అయింది. కాని, ఇంకా ఈ కోటలోనే మగ్గిపోతున్నాం.. వీటిని వదిలి ఉండలేక, అనుభవించలేక, జీవితాన్ని గెలవలేకపోతున్నాం. కాని మనం ప్రయత్నమైతే చెయ్యాలి’ అంది నందిని.

‘ఇలా స్వేచ్ఛాపథంలో మన బిడ్డ నడవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలి. త్వరలో తీసుకుంటాను నందిని. మన బిడ్డ స్వేచ్చకి, తన భవిష్యత్తుకి ఆటంకం కలిగించే ఏ రాజరికపు గుర్తులు ఉండకూడదు, ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు’ అన్నారు తిలక్ బహుదూర్.

‘మీరు ఏమి చెయ్యబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? ఆ నిర్ణయం వల్ల మన స్వప్నిక ఆనందంగా ఉండగలదా!.. అసలు మీరు ఏం చెయ్యబోతున్నారు.. కాస్త నాతో చెప్పండి’ అని ఆత్రుతగా అడిగింది నందిని.

‘ఇప్పుడు కాదు నందిని, తన పద్దెనిమిది వత్సరాల పుట్టిన రోజు త్వరలో వస్తోంది. ఆ రోజు ఒక నిర్ణయాన్ని చెబుతాను’ అని లోపలకి వెళ్ళిపోయారు తిలక్ బహుదూర్.

‘పద్దెనిమిదివ వత్సరమా!.. అప్పుడేనా!.. నా కూతురు స్వప్నికకి అప్పుడే పదిహేడు నిండిపోయాయా!’ అని ఆందోళన పడింది నందిని. ఆ ఆందోళన వెనుక మనకు తెలియని విచారంతో కూడిన విషాదం కూడా ఉందని ఎవరికి తెలుసు?.

***

ఎదురు చూసిన పుట్టిన రోజు వచ్చింది..

భళ్ళున తెల్లారింది.. స్వప్నిక పుట్టిన రోజు వేడుక అంటే కోటలో అందరికి అదొక పండగ లాంటిదే.. పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఇలాంటి కార్యక్రమాలతో మొదలవుతుంది, విందులు, వినోదాలతో ముగుస్తుంది.

‘అమ్మా! స్వప్నికా! స్వప్నికా.. తెల్లవారింది లేమ్మా! పుట్టిన రోజు పూట ఇంత నిద్రా!.. లేమ్మా.. లేచి స్నానం చేసి రెడీ అయి హాల్ లోకి రా’ అంటూ కేకేసింది నందిని.

లోపల నుంచి సమాధానం లేదు.

‘ఏంటి వదినా ఇంకా స్వప్నిక లేవలేదా!.. నేను రెడీ చేసి తీసుకువస్తా!.. మీరు వెళ్ళండి వదినా..’ అంటూ స్వప్నిక తలుపు వద్ద నిల్చొని, ‘స్వప్నికా! స్వప్నికా! లేమ్మా! పంతులు గారు వచ్చినట్టున్నారు.. రా తల్లీ’ అని కేకేసింది అంజన ముద్దుగా.

‘నీకు గుర్తుందిగా! ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో’ అంటూ తల్లి చెవిలో ధనుంజయ్ గొణుగుతూ బయటకు పోయాడు. ఏదో ఒకటి చెప్పి అన్నయ్య వదినలను ఒప్పించి స్వప్నికని తన కొడుక్కి భార్యని చెయ్యాలని మనసులో గట్టిగా అనుకుంది అంజన.

కొడుకు ధనుంజయ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది అంజన.

‘అమ్మా! స్వప్నిక నాది.. నేను పెళ్లి చేసుకోవాలి, ఎలా ఒప్పిస్తావో! ఏమో! నీ ఇష్టం.. నాకు నాకు.. చాలా చాలా ఇష్టం స్వప్నిక అంటే.. తనని ఎలాగైనా ఒప్పించాలి. అలాగే మామయ్య, అత్తతో కూడా మాట్లాడు ఈ విషయం. ఎందుకంటే, ఈ రోజుతో 17 సంవత్సరాలు నిండిపోయి 18వ సంవత్సరం వస్తుంది.. బహుశా మామయ్యా అత్తయ్యకు కూడా నన్ను అల్లుడుని చేసుకోవడం ఇష్టమే. ఎందుకంటే, ఆ రోజు.. ఆ రోజు… నీకు మొగుడినవుతా, నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా వశం చేసుకుంటా అని స్వప్నికతో అన్న రోజు నుంచి స్వప్నికని కోట బయటకు కూడా పంపడం లేదు గమనించావా! అంటే, నా మాటకు విలువ ఇచ్చినట్టే కదా!.. అందుకే చెబుతున్నా.. బహుదూర్ తిలక్ వంశానికి నేనే వారసుడను’ అంటూ మీసం మేలేస్తున్న కొడుకుని చూసి ఉబ్బి తబ్బిబ్బైంది అంజన.

కొడుకు తెలివి తేటలకు మురిసిపోయిన ఆ తల్లి స్వప్నికని స్వప్ని, స్వప్ని అంటూ మరింత ముద్దుగా పిలుస్తోంది కాని లోపల నుంచి సమాధానం మాత్రం రావటం లేదు.

హాల్లో పంతుళ్ళతో పూజలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘స్వప్నిక రెడీ అయిందా!’ అంటూ అటుగా వెళ్లే బహుదూర్ తిలక్ గారి మాటకి బదులుగా ‘లేదన్నయ్యా! గంట నుంచి పిలుస్తున్నా లోపల నుంచి సమాధానం లేదు.. లోపల ఏదైనా అఘాయిత్యం?’ అన్నఅంజన మాట పూర్తి కాకుండానే,

‘ఛ.. నోరు మూసుకో అంజనా’ అంటూ తలుపుల్ని తెరిపించి చూసి హతాశులైపోయారు ఎందుకంటే, ..చిత్రంగా ఆ గదిలో స్వప్నిక లేదు.

మంచం మీద ఒక ఉత్తరం.. దర్శనం ఇచ్చింది.

‘ప్రియమైన అమ్మానాన్నలకు మీ ముద్దుల తనయ స్వప్నికా బహుదూర్ నమస్కరించి రాయునది..

నాన్నగారూ.. ఇది నా పద్దెనిమిదవ పుట్టిన రోజు.. ఈ రోజు మీకు అమ్మకి ఎంత ప్రత్యేకమో నాకు తెలుసు. రెండు తరాల తరువాత మూడో తరంలో పుట్టిన ఏకైక వారసురాలిని. బహుదూర్ వంశపు ముద్దు బిడ్డని. మీ ఒడిలో ఓలలాడాలని, అమ్మ ఒడిలో సేద దీరాలని ఎంత అనిపించినా!.. మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి నాది. బహుశా ఇప్పుడు గాని నేను బయటపడని పక్షంలో ఎన్నటికీ నేను బయట పడలేను. ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా ఎగరాలని ఉంది, చెరువులో చేపలా బలంగా నా కాళ్ళతో నేను ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకి ఈదాలని ఉంది నాన్నగారూ. రాచరికపు ముసుగు తీసి బయట తిరగలేని పరిస్థితి మీది. మీ ఆలోచనలలోను, మీ మనసుల్లోను ఆధునికత కనిపిస్తోంది, కాని మీ ఆచరణలో నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఈ కోటలో ఉంటే నా ఆశల సౌధం కూలిపోయి నన్ను నేను పోగొట్టుకుంటానేమో! అని భయం వేస్తోంది. బహుదూర్ వంశపు వాసనలతో పెరిగి, నాది అనే ఉనికిని నాకు లేకుండా, ఈ అస్తిత్వంలో బతకడం నాకు బొత్తిగా నచ్చటం లేదు నాన్నగారూ.

ఈ కోటలో ప్రతి మూల రాచరికపు ఆనవాళ్ళే. ఎటు చూసినా డాబు, దర్పమే దర్శనమిస్తున్నాయి. ప్రపంచం పరిగెడుతోంది నాన్నగారూ.. రాచరికపు ఇనుప ఊచల్లో ఇరుక్కుపోయి మీ ఆశయాలను చంపుకుని బతికేస్తున్న మీ ప్రేమకి, మీకు నేను ఎక్కడ బందీ అయిపోతానో అని నాలో భయం పుట్టుకొచ్చింది. ఎంత కాదనుకున్నా.. నా ప్రతి పుట్టినరోజు కోటలో ఘనంగా జరుపాలని మీరు, అమ్మ ఎంతగా కోరుకుంటారో నాకు తెలుసు. నాకు స్వేచ్ఛ ఇవ్వాలి, రాచరికపు నీడలు నాపై పడకూడదు – అంటూనే అందులో కూరుకుపోతున్న మీ పరిస్థితి చూసి బాధగా కూడా ఉంది నాన్నగారూ. కోట బురుజులు నా ఆశలపై నీళ్ళు జల్లుతున్నాయి, నిలువెత్తు రాజప్రాకారాలు నన్ను నా భవిష్యత్తుని శాసిస్తున్నాయి. నాకు అందమైన, ఆనందమైన జీవితం ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, మీ దుస్థితి నాకు అర్థం అవుతోంది. మీ పూర్వీకుల బంధనాలు మిమ్మల్ని వీడటం లేదు, మీ రాచరికపు దర్పం అక్కడ నుంచి మిమ్మల్ని కదలనివ్వటం లేదు అని ఈ మద్యనే నాకు అర్థం అయింది.

ఈ మధ్య ప్రతి విషయంలో అమ్మని తప్పు పడుతున్నారు, చిన్న విషయానికే అమ్మపై కోపగించుకుంటున్నారు. మీరు ఇదివరకులా అమ్మతో ఉండటం లేదు నాన్నగారూ. అది నాకు ఆసలు నచ్చలేదు. అమ్మని ప్రేమించని మీరు నా ఆశలను, ఆశయాలను ప్రేమిస్తారని ఎలా అనుకోను? నా అభిప్రాయాలను గౌరవిస్తారని ఎలా అనుకోను? వీటి వెనుక ఏదో సంఘర్షణ ఉంది అని నాకు అర్థమైంది. మరేదో అభద్రతాభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. గత కొంత కాలంగా మీలో మీరు మథనపడుతున్నారు, కనిపించని శత్రువు ఏదో మీపై దాడి చేస్తోంది. మీతో మీరే పోరాటం చేస్తున్నారు. బయటకు వ్యక్తపరచలేని దుస్థితిలో ఉన్నారు. అలా అక్కడ ఉండి మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. ఏమీ చెయ్యలేక పోతున్నాను. అలాగని నా మనసుకి ముసుగేసుకొని ఉండలేకపోతున్నా. స్వేచ్ఛా వాయువులను మనసారా పీల్చాలని ఉన్న తృష్ణను చంపుకోలేకున్నా! మీరు అడుగడుగునా వేసే పూల పానుపుపై నడిస్తే ఎత్తుపల్లాలు తెలియడం లేదు నాకు. మీరు అమ్మ నాపై చూపించే వాత్సల్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, నా జీవితంలో ప్రేమ రాహిత్యంతో పరిచయమే లేకుండా అయిపోతోందేమో నాన్నగారూ. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా! మీరు నా కోసం వెతికి మీ కాలాన్ని వృథా చేసుకోవద్దు. మిమ్మల్ని వదిలి, మీ కోటను వదిలి వెళ్ళిపోయిన నేను మీ రాచరికానికి మచ్చ తెచ్చాను అనుకుంటే మీరిద్దరూ నన్ను క్షమించండి.

ఇట్లు ప్రేమతో

స్వప్నికా బహుదూర్’

ఉత్తరం చదివిన తిలక్ బహుదూర్ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఛాతిని ఎవరో నొక్కి పెడుతున్నట్లు బాధతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తిలక్ బహుదూర్.

‘వదినా! ఎంత పని జరిగిపోయింది.. దానికి మనసెలా వచ్చింది’ అంటూ హాల్‌లో ఉన్న వదిన దగ్గరకి వచ్చి లబోదిబోమన్న అంజనని చూసి ‘ఏమైంది?’.. అని అడిగింది నందిని.

సమాధానంగా ఉత్తరం చూపిస్తూ.. అందులో విషయాన్ని వివరించింది అంజన.

రాజగురువు మార్తాండ గారికి తిలక్ బహుదూర్ గారి పరిస్థితి చెప్పడంతో అందరూ అటుగా పరుగులు తీసారు.

పరిస్థితి చూసి నోట మాట రాని నందిని కూలబడిపోయింది. ‘ఏంటి ఇలా జరిగింది, ఎందుకిలా జరుగుతోంది, రెండు తరాల తరువాత పుట్టిన ఆడబిడ్డ.. ఇలా చేసిందేంటి?’ అని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. మౌనంగా రోదించింది.

స్వప్నిక కోట వదిలిపోయింది అన్న వార్త ఊరు, వాడ, ఏకమై కోడై కూస్తోంది.

‘నా వలలో చిక్కల్సిన చేప చేజారిపోయి౦దే!’ అని ఉగ్రుడైపోయి ఎగిరెగిరి పడుతున్నాడు ధనుంజయ్.. అంతే కాదు.. కోటలో ఉన్న కొంతమందికి ‘స్వప్నికని వెతికి తీసుకురండి’ అని పురమాయిస్తున్నాడు.. అక్కడికేదో రాజ ప్రసాదాన్ని రక్షించాల్సిన యువరాజు తానే అన్నట్టుగా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు.

రాచరికం పోయి రెండున్నర తరాలు దాటింది.. రాజులు పోయి, రోజులు మారిపోయి గత చరిత్ర ఆనవాళ్ళు మెల్లిగా కాలచక్రంలో పడి నలిగిపోయాయి.

‘అలా ఉండేదట, అని పెద్ద వాళ్ళు చెబితే వినటమే కాని, చూడడానికి ఏమి మిగిలింది? కోట బురుజులు.. విశాలమైన ఈ ప్రాంగణాలు, గోడలకు వేళ్ళాడుతున్నన ఫోటోలలో బంధించిన పూర్వీకుల వైభోగం తప్ప ఏమి మిగిలింది ఈ తరానికి?.. మనసు పాడు చేసుకోకండి తిలక్ బహుదూర్ గారు’ అని ఛందోబద్ధంగా ఊరడిస్తున్న పెద్దాయన రాజగురువు మార్తాండ గారి మాటలకు అదోలా చూసాడు తిలక్ బహుదూర్.”

(సశేషం)

చంద్రునికో నూలుపోగు-9

0

[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భూగ్రహవాసులని ఓ గాజుగదిలో బందీలుగా ఉంచి సాల్మోనియన్‍లకు ప్రదర్శనగా ఉంచుతారు. తమని అలా బంధించి ఉంచినందుకు, వింత జంతువులను చూడడానికి వచ్చినట్టు సాల్మోనియన్‍లు వచ్చి చూస్తున్నందుకు రాబర్ట్ బాధపడతాడు. ఇంతలో కొందరు ఆ గాజు గదిపై రాళ్ళతో దాడి చేయగా, సందర్శకుల గుంపుని అజమాయిషీ చేస్తున్న సైనికులు వాళ్ళని గుర్తించి, లాక్కెళ్ళి పోతారు. తమని శత్రువులుగా ఎందుకు బావిస్తున్నారో అర్థం కావడం లేదని రాబర్ట్ అంటే, అది గుంపు మనస్తత్వమని చెప్తాడు అయాన్ష్. లేజర్ గన్స్ సంగతి వాళ్ళు అడగకుండానే చెప్పి ఉండాల్సిందని సకూరా అంటే, వాళ్ళు నమ్మరని అంటాడు అయాన్ష్. అడవిలో గాలిస్తున్న సైనికులకు ఓ గుబురు పొద చుట్టూ ఉన్న చెట్ల కాండాల మీద అయాన్ష్ వాళ్ళు ఆంగ్లంలో రాసిన అక్షరాలు కనబడతాయి. అవేంటే వాళ్ళకి అర్థం కాక సైన్యాధ్యక్షుడికి సమాచారం అందిస్తారు. అతను అక్కడికి వెళ్ళి ఆ రహస్య లిపిని జాగ్రత్తగా పరిశీలించినా, అతనికేమీ అర్థం కాదు. వెంటనే కారాగారానికి వెళ్ళి ప్రదర్శనని నిలిపి వేయించి, ఏలియన్స్‌ని పిలిపించి, ఆ రహస్య లిపి గురించి అడిగితే, అవి ఇంగ్లీష్ భాషలో రాసిన అక్షరాలని చెప్తాడు అయాన్ష్. ఆ కోడ్‌ లోని రహస్యమేమిటో చెప్పమంటాడు సైన్యాధ్యక్షుడు. అవి తమ పేర్లలోని మొదటి అక్షరాలని, వాటిలో ఏ రహస్యమూ లేదని చెప్తాడు అయాన్ష్. సైన్యాధ్యక్షుడు వెళ్ళి గ్రహాధిపతిని కలుస్తాడు. జరిగినదంతా చెప్తాడు. నేల కింద వెతికించమని గ్రహాధిపతి చేసిన సూచనతో, తొందరగానే గొయ్యిలోపల దాచిపెట్టిన స్టీల్ కంటెయినర్‌ని బైటికి తీయిస్తాడు సైనికాధికారి. నిపుణులను పిలిపించి, దానిలో ఉన్న లేజర్ గన్స్‌ని పరీక్షింపచేయిస్తాడు. గ్రహాధిపతి ఏలియన్స్‌ని తన వద్దకు పిలిపించుకుని సంజాయిషీ అడుగుతాడు. జరిగినదంతా దాచకుండా చెప్తాడు అయాన్ష్. ఆ వివరాలని నమ్మని గ్రహాధిపతి వారికి మరణశిక్ష విధిస్తాడు. తమ గ్రహంలో తమ అన్నగారి మూడు రోజుల పర్యటన ఉన్న దృష్ట్యా, ఆయన వెళ్ళాకా, శిక్షని అమలు చేయమని చెప్తాడు. ఇక చదవండి.]

[dropcap]ని[/dropcap]క్స్ గ్రహంలో సిసిరస్ నివాసగృహం.. సమయం ఉదయం ఏడు గంటలు..

“మనం ఈ రోజు సాల్మోనియస్ గ్రహానికి వెళ్ళక తప్పదంటారా?” అల్పాహారం తింటున్న సమయంలో సిసిరస్‌ని అడిగింది అతని భార్య.

“ఓసిరస్ అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బావుంటుందా చెప్పు? నిక్స్‌కి సాల్మోనియస్‌కి మధ్య ఉన్న స్నేహబంధం ఈనాటిదా? మా తాతల నాటిది. ఐనా ఎందుకు నీకక్కడికి రావడం ఇష్టం ఉండదు?” నవ్వుతూ అడిగాడు సిసిరస్.

“స్నేహబంధమే అయితే నాకూ అభ్యంతరం ఉండేది కాదు. రక్త సంబంధం కూడా ఉందిగా. అందుకే నాకు రావడం ఇష్టం ఉండదు. ఓసిరస్ మిమ్మల్ని అన్నా అని పిలుస్తుంటే కంపరంగా ఉంటుంది. ఆరున్నర అడుగుల ఎత్తుండే మీకు మూడున్నర అడుగుల మరుగుజ్జు తమ్ముడుండటం ఏమిటి? నా మనసొప్పుకోదు.”

“తప్పు. అలా అనకూడదు. ఆ గ్రహంలో గురుత్వాకర్షణశక్తి అధికంగా ఉండటం వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల అక్కడి మనుషులు మూడున్నర అడుగులు మించి ఎదగరు. మనతో పోలిస్తే తక్కువ ఎత్తున్నారనే కారణంతో వాళ్ళను తక్కువ చేయడం, చులకనగా మాట్లాడటం తప్పు కదా. నువ్వు గ్రహాధిపతికి భార్యవి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనమే సంస్కారం మర్చిపోయి మాట్లాడటం భావ్యమా?” కించిత్ బాధ పడుతూ అన్నాడు.

ఆమెకు తను చేసిన తప్పేమిటో అర్థమైంది. “క్షమించండి. ఉత్తమురాలైన మీ తల్లిగారిని తల్చుకున్నప్పుడల్లా మీ తండ్రిగారు చేసిన పని సక్రమమనిపించదు. ఆ కోపంలో నోరు జారాను.”

“ఏది సక్రమం? ఏది అక్రమం? నా చిన్నప్పుడు మా తండ్రిగారు ఆ గ్రహంలో పర్యటించడానికి వెళ్ళారట. అక్కడున్న వారం రోజులు ఓ సాల్మోనియన్ స్త్రీ వారికి పరిచర్యలు చేసిందట. ఉదాత్తమైన ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితులై మా తండ్రిగారు ఆమెను పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళకు ఓసిరస్ జన్మించాడు. తల్లిదండ్రుల ఉన్నతమైన లక్షణాలన్నీ ఓసిరస్‌కి అబ్బాయి. చాలా మంచివాడు. ఉన్నత సంస్కారం కలవాడు. నేనంటే అతనికి ప్రాణం. యింకెప్పుడూ అతని గురించి తప్పుగా మాట్లాడకు. నేను బాధపడ్తాను” అన్నాడు సిసిరస్.

వాళ్ళిద్దరూ సాల్మోనియస్ గ్రహాన్ని చేరుకోగానే, అధికారలాంఛనాలతో స్వాగతం పలికాడు ఓసిరస్. వాళ్ళు విడిది చేసిన భవనంలో సమస్త సౌకర్యాలూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను చేసిన అతిథి మర్యాదలకు సిసిరస్, అతని భార్య చాలా సంతుష్టులైనారు.

మూడు రోజుల వినోద, విహారాల తర్వాత వాళ్ళు తిరిగి తమ గ్రహానికి వెళ్ళాల్సిన సమయం దగ్గరపడింది.

ఓసిరస్ తన సోదరునితో చేస్తున్న ఆత్మీయ సంభాషణ మధ్యలో తమ గ్రహానికి నలుగురు ఏలియన్స్ రావడం గురించి, వాళ్ళ దగ్గరున్న లేజర్ గన్స్ గురించి వివరంగా చెప్పాడు.

“ఎక్కడో ఉన్న భూగ్రహం నుంచి ఏలియన్స్ ఇక్కడికొచ్చారా? ఆశ్చర్యంగా ఉందే. ఎందుకొచ్చారని అడిగావా? వాళ్ళేం సమాధానం చెప్పారు?” అని అడిగాడు సిసిరస్.

“చాలా విచిత్రమైన కట్టు కథలాంటిదేదో చెప్పారు అన్నగారూ. వాళ్ళ గ్రహానికున్న చంద్రుణ్ణి ఎవరో దొంగిలించబోతున్నారట. ఆ ప్రయత్నాన్ని భంగం చేయడం కోసమే లేజర్ ఆయుధాల్ని తయారుచేసుకున్నారట. చంద్రుడి మీదకి ప్రయాణమైనారట. కానీ స్పేస్‌షిప్‌లో కంట్రోల్ బోర్డ్ పని చేయకపోవడం వల్ల, పొరపాటున మన గ్రహాన్ని చేరుకున్నారట. ఇందులో ఏదైనా నమ్మేలా ఉందా చెప్పండి. వాళ్ళు మా గ్రహాన్ని ధ్వంసం చేయడానికొచ్చిన శత్రువులని మంత్రి మండలి తీర్మానించింది. ప్రస్తుతం వాళ్ళని కారా గారంలో బంధించి ఉంచాం” అన్నాడు ఓసిరస్.

సిసిరస్‌కి వెంటనే తమ నిక్స్ గ్రహానికున్న చంద్రుళ్ళలో ఒక చంద్రుణ్ణి బహుమతిగా ఇవ్వమని అడిగిన అజుపస్ గుర్తొచ్చాడు. తమ గ్రహాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధితో చేసిన యుద్ధం గుర్తొచ్చింది. దాంతో పాటు ఈ మధ్య తమ గూఢచారులు అందించిన రహస్య సమాచారం కూడా గుర్తొచ్చింది.

“వాళ్ళు చెప్తున్నది నిజమే. వాళ్ళు నిరపరాధులు. వెంటనే వాళ్ళను విడుదల చేయించి, మా ముందు ప్రవేశ పెట్టించు” అన్నాడు సిసిరస్.

“చంద్రుణ్ణి దొంగిలించడమేమిటి అన్నగారూ.. మీరెలా నమ్ముతున్నారు?” ఆశ్చర్య పోతూ అడిగాడు.

అజుపస్ చేసిన దుర్మార్గాల గురించి సిసిరస్ తన తమ్ముడికి వివరంగా చెప్పాడు. తమ గూఢచారులు అందించిన రహస్య సమాచారం ప్రకారం ఏదో గ్రహానికున్న చంద్రుణ్ణి వాళ్ళ గ్రహానికి లాక్కురావడానికి అజుపస్ ప్రయత్నిస్తున్న విషయం కూడా చెప్పాడు.

“మరి స్పేస్‌షిప్ కంట్రోల్ బోర్డ్ పనిచేయకపోవడం కూడా నిజమేనా?” అని అడిగాడు ఓసిరస్.

“నిజమే. అది కూడా అజుపస్ నిర్వాకమే. స్పేస్‌షిప్‌లో ఉన్న లేజర్ గన్స్‌తో పాటు స్పేస్‌షిప్‌ని, అందులో ప్రయాణిస్తున్న శాస్త్రవేత్తల్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో కంట్రోల్ ప్యానెల్ని హ్యాక్ చేశారు. అదృష్టం కొద్దీ స్పేస్‌షిప్ మీ గ్రహానికున్న గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై మీ నేల మీద పడింది. ఆ నలుగురూ తెలివిగా కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు” అన్నాడు సిసిరస్.

“నాక్కూడా వాళ్ళు నిరపరాధులనే అన్పించింది. దానిక్కారణం వాళ్ళ వద్ద ఉన్న లేజర్ ఆయుధాలు.. వాటినుంచి వెలువడే కిరణాలు మిస్సైల్స్‌లా విధ్వంసం సృష్టించకుండా టార్గెట్‌ని ముక్కలు చేస్తాయని తెలిసినపుడే నా అనుమానం బలపడింది. వాళ్ళు మా గ్రహానికి నష్టం చేసే ఉద్దేశంతో వస్తే, అటువంటి ఆయుధాలు ఎందుకు తెచ్చుకుంటారు? ఆ కిరణాల ప్రయోజనం వేరే ఉండొచ్చనిపించింది. ఈ విషయం మీతో సంప్రదించడం కోసమే శిక్షను వాయిదా వేశాను. మీ వల్ల నిజమేమిటో వెల్లడైంది. నిరపరాధుల్ని శిక్షించానన్న అపవాదు నుంచి నన్ను రక్షించారు” అన్నాడు ఓసిరస్.

అదే సమయంలో కారాగారంలో ఉన్న నలుగురు భూగ్రహవాసులు మాట్లాడుకుంటున్నారు.

“ఈ రోజే మన జీవితాల్లో ఆఖరి రోజు. రేపు శిక్ష అమలు చేస్తారు. మనం తెచ్చిన లేజర్ గన్స్‌ని మన మీదే ప్రయోగించడం దారుణం కదా. ఇంతకూ మనల్ని ఎన్ని ముక్కలు చేస్తారంటావు?” అన్నాడు రాబర్ట్.

“రెండు ముక్కలు కాగానే ప్రాణం పోతుంది. ఆ తర్వాత ఎన్ని ముక్కలు చేస్తే మనకేంటి? నేను రేపు రాబోతున్న చావుని గురించి ఆలోచించడం లేదు. చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతున్నందుకు బాధపడ్తున్నాను” అన్నాడు అయాన్ష్.

“నువ్వు ఆశావాదివి కదా. అద్భుతాలేవో జరగొచ్చని అన్నావుగా. ఏమీ జరగలేదేం” అంది సకూరా.

“అద్భుతమేదైనా జరగడానికి ఓ క్షణం చాలు. రేపు కదా శిక్ష అమలు చేసేది. చాలా సమయం ఉంది. ఈ లోపల ఏమైనా జరగొచ్చు. గుర్రం ఎగురా వచ్చు” అంటూ నవ్వాడు అయాన్ష్.

“గుర్రం ఎగురుతుందో లేదో తర్వాత సంగతి. రేపు గుర్రం గుండెల్లోకి లేజర్ కిరణాలు దూరి, ప్రాణాల్నే హరించబోతున్నాయి. యింకెక్కడి గుర్రం? ఎక్కడికి ఎగరడం మిత్రమా” అన్నాడు రాబర్ట్.

అప్పుడే కారాగారం లోపలికి సైన్యాధ్యక్షుడు వస్తూ కన్పించాడు. ఎప్పుడూ శత్రువుని చూసినట్టు చూసే అతని క్రూరమైన చూపులో ఇప్పుడు మార్పుండటాన్ని అయాన్ష్ గమనించాడు.

అతను వాళ్ళ ముందుకొచ్చి నిలబడి స్నేహపూర్వకంగా నవ్వాడు. “మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు క్షమించండి. మీరు నిరపరాధులని రుజువైంది. మిమ్మల్ని విడుదల చేయవల్సిందిగా గ్రహాధిపతి గారి ఆజ్ఞ” అన్నాడు.

నమ్మలేనట్లు నలుగురూ మొహామొహాలు చూసుకున్నారు. అప్పటివరకు చావు ముంచుకొస్తుందని ఆందోళన పడ్తున్న రాబర్ట్ మొహం ప్రసన్నంగా మారింది. సకూరా అయాన్ష్ వైపు మెచ్చుకోలుగా చూసింది. అయాన్ష్ హాయిగా నవ్వుతూ “చూశారా అద్భుతం జరిగింది. ఆశ మనిషిని బతికిస్తుంది” అన్నాడు.

“బయల్దేరండి. మిమ్మల్ని పిల్చుకు రమ్మని గ్రహాధిపతిగారు, వారి అన్నగారైన సిసిరస్ గారు ఆదేశించారు. వారు మీ కోసం ఎదురుచూస్తున్నారు” అన్నాడు సైన్యాధ్యక్షుడు.

ఓసిరస్ వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు.

“నిజం తెల్సుకుని మమ్మల్ని విడుదల చేసినందుకు మీకు ధన్యవాదాలు” అన్నాడు అయాన్ష్.

“మీరు ధన్యవాదాలు తెలపాల్సింది నాక్కాదు. మా అన్నగారైన వీరికి” సిసిరస్ వైపు చూపిస్తూ అన్నాడతను. “వీరివల్లనే మాకు మీరు చెప్పిందంతా నిజమని అర్థమైంది” అన్నాడు.

“విశ్వ చరిత్రలో కనీవిని ఎరుగని ఇటువంటి దుర్మార్గానికి పూనుకుంది మా పొరుగు గ్రహం వాళ్ళే కాబట్టి నాకైనా నిజం తెలిసింది. లేకపోతే మీరు చెప్పేది నేను కూడా నమ్మేవాణ్ణి కాదు” అన్నాడు సిసిరస్.

“మా చంద్రుణ్ణి కాజేయాలని వాళ్ళు ఎందుకనుకున్నారు?” అని అడిగాడు అయాన్ష్.

“నిఫిలిక్స్ గ్రహానికి చంద్రుడు లేడు. మా గ్రహానికి రెండు చంద్రుళ్ళు ఉండటంతో మా గ్రహాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంతో అజుపస్ మాతో యుద్ధం చేసి, ఓడిపోయాడు. అతని కన్ను మీ భూగ్రహానికున్న చంద్రుడిమీద పడింది. దాన్ని పొందే మార్గాలకోసం ఎన్నో పరిశోధనలు చేసి, చివరికి ఆస్టిరాయిడ్ లాంటిదాన్ని తయారుచేసి, ప్రయోగించారని మా గూఢచారుల ద్వారా తెల్సింది. మీరా ఆస్టిరాయిడ్‌ని పోలిన ఉపకరణాన్ని ధ్వంసం చేయబోతున్నారని తెల్సుకుని, మీ స్పేస్‌షిప్ లోని కంట్రోల్ ప్యానెల్‌ని హ్యాక్ చేసి మిమ్మల్ని చంపడానికి పన్నాగం పన్నాడని కూడా వేగుల ద్వారా మాకు సమాచారం అందింది. మీరు చాలా అదృష్టవంతులు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని, ప్రాణాల్తో బైటపడ్డారు” అన్నాడు సిసిరస్.

“బతికున్నందుకు మాకేమీ సంతోషంగా లేదు. మా చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతే మేము బతికుండి ఏమిటీ ప్రయోజనం?” బాధగా అన్నాడు అయాన్ష్.

“ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రయాణానికి సిద్ధం కండి. మిమ్మల్ని మీ చంద్రుడి మీదికి చేర్చే బాధ్యత మాది” అన్నాడు సిసిరస్.

“ప్రయోజనం లేదు. అంత సమయం ఎక్కడుంది? చంద్రుణ్ణి కాపాడుకోడానికి కేవలం రెండు రోజులే మిగిలున్నాయి. స్పేస్‌షిప్‌లో మేము చంద్రుణ్ణి చేరుకోడానికి అంత కన్నా చాలా ఎక్కువ సమయం పడ్తుందిగా” నిస్పృహగా అన్నాడు అయాన్ష్.

“మీరు వెళ్ళడానికి స్పేస్‌షిప్‌ని ఏర్పాటు చేస్తామనుకుంటున్నారా?” అంటూ సిసిరస్ మెత్తగా నవ్వాడు. “మేము శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిని సాధించాం. వాటిలో టెలీపోర్టింగ్ కూడా ఒకటి. మిమ్మల్ని మీ లేజర్ ఆయుధాలతో పాటు చంద్రుడి మీదికి టెలీపోర్ట్ చేస్తాం. మిగిలిన సమయం చాలనుకుంటాను అజుపస్ ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి” అన్నాడు.

అప్పటివరకు నిరాశలో మునిగి ఉన్న భూగ్రహవాసుల మొహాల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పెనలా పొంగింది.

“మీ మాటలు వింటుంటే మా ప్రాణాలు లేచొస్తున్నాయి. మీకూ, ఓసిరస్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మాతోపాటు మా భూగ్రహవాసులందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారు” చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు అయాన్ష్.

మొదట నలుగురినీ టెలీపోర్ట్ యంత్రం లోపల నిల్చోబెట్టి, గమ్యస్థానం ఏమిటో, ఎంత దూరంలో ఉందో ఫీడ్ చేసి, నీలం రంగులో కన్పిస్తున్న మీటను నొక్కారు. వెంటనే వాళ్ళు అదృశ్యమైపోయారు. తర్వాత లేజర్ ఆయుధాలున్న స్టీల్ కంటెయినర్‌ని యంత్రం లోపల పెట్టి మీటను నొక్కారు.

చంద్రుడి మీదున్న ఇండియన్ స్పేస్ ఏజన్సీ భవనంలో నలుగురూ మళ్ళా తమ రూపును సంతరించుకున్నారు.

“అద్భుతం! టెలీపోర్టేషన్ ప్రక్రియని మన శాస్త్రవేత్తలు ఎప్పుడు సాధించారు?” అంటూ స్పేస్ ఏజన్సీలో ఉన్న మిగతా సైంటిస్ట్‌లు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబట్టి అడుగుతున్నా పట్టించుకోకుండా అయాన్ష్, మహిక బిగ్‌మాస్ చంద్రుడికి ఎంత దూరంలో ఉందో గమనించడంలో నిమగ్నమైపోయారు. రాబర్ట్, సకూరాలు స్టీల్ కంటెయినర్ లోంచి లేజర్ గన్స్‌ని తీసుకుని, షూట్ చేయడానికి తయారుగా నిలబడ్డారు.

“బిగ్‌మాస్ మన లేజర్ గన్స్ రేంజ్ లోకి ప్రవేశించింది. ఇంక ఆలస్యం చేయకూడదు” అంటూ అయాన్ష్, మహిక కూడా లేజర్ గన్స్‌ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

నలుగురూ తమ గన్స్‌ని బిగ్‌మాస్ మీదికి ఎక్కుపెట్టి, లేజర్ బీమ్స్‌ని ఆపకుండా వదలసాగారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే బిగ్‌మాస్ పెద్ద పెద్ద ముక్కలుగా తెగిపోయింది. ఆ శకలాల్ని కూడా వదలకుండా నిరంతరాయంగా షూట్ చేశారు. అవి మరింత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయాయి.

“మన చంద్రుడికి ప్రమాదం తప్పింది. మనం చంద్రుణ్ణి కాపాడుకున్నాం” సంతోషాతిరేకంతో అరిచింది మహిక.

“సక్సెస్.. ఆపరేషన్ సేవ్ ద మూన్ ఈజ్ ఏ గ్రాండ్ సక్సెస్” అంటూ పెద్దగా అరిచాడు అయాన్ష్.

రాబర్ట్, సకూరా అతనితో గొంతు కలిపారు.

భారతదేశ స్పేస్ ఏజన్సీలోని అందరి మొహాల్లో ఆనందం పున్నమి వెన్నెల్లా విచ్చుకుంది.

‘చంద్రుణ్ణి కాపాడుకున్నందు చాలా తృప్తిగా ఉంది. ఈ సమస్త మానవాళి కోసం చంద్రుడు చాలానే ఇచ్చాడు. దాంతో పోలిస్తే ఇప్పుడు తమ టీం సాధించిన విజయం పెద్ద విషయమేమీ కాదు. చంద్రుడిమీది ఇష్టంతో, గౌరవంతో, భక్తితో సమర్పించుకున్న ఓ నూలు పోగుతో సమానం’ అని అయాన్ష్ మనసులో అనుకున్నాడు.

తన ప్రయోగశాలలో ఉన్న శక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా బిగ్‌మాస్ గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఆర్యమిహిర, అది వేల వేల ముక్కలుగా విడిపోవడం గమనించిన వెంటనే, తన టీం సాధించిన విజయానికి గర్వపడుతూ ‘నా దేశం, మా భూగ్రహం, మా చంద్రుడు.. వీటి జోలికి ఏ ఏలియన్స్ దండెత్తి వచ్చినా వాళ్ళకు ఇదే గతి పడ్తుంది’ అని అనుకున్నాడు.

(సమాప్తం)

శ్రీమద్రమారమణ-4

0

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[హార్మోనిస్టు రాకపోవడంతో, అతని కోసం ఎదురు చూసే సమయంలో వైనతేయని కొన్ని పాటలు, పద్యాలు పాడమని అడుగుతారు హరిదాసు ఆంజనేయశర్మగారు. దస్తగిరిసారు అనుమతితో వైనతేయ ఒక పాట పాడతాడు. వాడి ప్రతిభని గుర్తించిన ఆంజనేయశర్మగారు, కార్యక్రమం పూర్తయ్యాకా వెంతనే వెళ్ళవద్దనీ, మీతో మాట్లాడే పని ఉందని దస్తగిరితో అంటారు. హార్మీనిస్టు రాలేదని ఆయన ఆందోళన చెందుతుంటే, మా సారు హార్మోనియం బాగా వాయిస్తాడని వైనతేయ ఆయనకి చెప్తాడు. స్థానికంగా ఒకరి ఇంటి నుంచి హార్మోనియం తెప్పించి, దస్తగిరిసారుతో వాయింపజేసి, హరికథను అద్భుతమైన రీతిలో ముగిస్తారు ఆంజనేయశర్మ. వైనతేయకు అదంతా ఒక కలలా ఉంటుంది. హరికథకుని ఆహార్యం, పద్యాలు పాడే విధానం, పాటలు ఆలపించే తీరు, సందర్భానుగుణంగా ఆయన చేసే నాట్యం, పాత్రల హావభావాల కనుగుణంగా ఆయన చేసే అభినయం, వాడిని మంత్రముగ్ధుడిని చేశాయి. హరికథ పూర్తవగానే ఉద్వేగానికి లోనై, వెళ్ళి ఆంజనేయశర్మగారి పాదాలకు నమస్కరిస్తాడు. స్వామీ అంటుంటాడు కాని ఏమీ చెప్పలేకపోతున్నాడు. వైనతేయకి రసస్ఫూర్తి కలిగిందని గ్రహించిన ఆయన, భోజనాలు చేసి వచ్చాకా, పిల్లవాడితో సహా తనని కలవమని దస్తగిరికి చెప్తారు. – ఇక చదవండి.]

గురుశిష్యులిద్దరూ ఇంటి ముఖం పట్టారు. వైనతేయ ఇంకా ఆ ట్రాన్స్ నుండి తేరుకోలేదు. దస్తగిరి సారు వాటిని పలుకరించలేదు. మౌనంగా ఉండిపోయినాడు. వాడికి సంగీతం పట్ల అభినివేశం ఉందని తెలుసుగాని, వాడింత భావావేశానికి లోనవుతాడని ఆయన ఊహించలేదు. ఆయనకు తన హైస్కూలులో తెలుగు పండితులు యాజ్ఞవల్క్య శాస్త్రి గారు చెప్పిన కాళిదాసుల వారి శ్లోకం గుర్తుకు వచ్చింది. ఆయన హైస్కూలు చదువంతా డోన్ వాసవి కన్యకా పరమేశ్వరి హైస్కూలులో జరిగింది. అది ఒక ఎయిడెడ్ స్కూలు. ఆ శ్లోకం ఇది.

“రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః

త చ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం

భావస్థిరాణి జననాంతర సౌహృదాని”

(అందమైన దృశ్యాలను వస్తువులను చూసినపుడు మధురమైన ధ్వనులను విన్నపుడు, ఏ కారణం లేకుండానే, సుఖంగా ఉన్న ప్రాణి మనసు ఒకానొక అలజడికి లోనవుతుంది. దేన్నో చేరుకోవాలనే తపనను అనుభవిస్తుంది. ఆ వ్యక్తి తాను ఇంతకు పూర్వం లోనవని ఒకానొక అనుభూతికి లోనవుతాడు. బహుశా పూర్వజన్మ వాసనల వల్ల ఏర్పడిన స్నేహసంబంధాలే దీనికి కారణం) అని తెలుగు సారు చెప్పిన వివరణ దస్తగిరికి గుర్తొచ్చింది. అప్పుడు విని ఊరుకోన్నాడు. ఇప్పుడా శ్లోకం లోని గొప్పదనాన్ని ప్రత్యక్షంగా తన శిష్యునిలో దర్శించాడు.

సారు భార్య ఇద్దరికీ బియ్యపు నూక ఉప్మా వడ్డించింది. దానిలోకి పుట్నాల పొడి వేసి, నెయ్యి వేసింది. ఒకమారు తిన్న తర్వా త రెండోమారు వడ్డించి, చిక్కని మజ్జిగ పోసింది.

ఇద్దరూ సావకాశంగా కూర్చున్నారు. గురువు నవారు మంచం మీద, శిష్యుడు నేల మీద!

“సార్, హరికథ ఎంత బాగుంది కద సార్!” అన్నాడు. వాడి గొంతులో ఒక తన్మయత్వాన్ని సారు గమనించాడు. వాడి తల నిమిరి, ఇలా అన్నాడు –

“ఒరేయ్ వైనా, నీవు అదృష్టవంతుడివిరా. దేవుడు నీకు పాడగల విద్యతో బాటు, ఆనందించగల సున్నితమైన మనస్సును కూడా ఇచ్చినాడు. స్వామి చూశావా, ఎంత పండితుడో? పద్యాలు చదివే విధానం గమనించావా? ఎక్కడ వాక్యాన్ని విరచాలి, ఎక్కడ రెండోసారి అనాలి, అబ్బ! మహానుభావుడు రా!”

“అవును సారు.”

“హరికథా కాలక్షేపం అనేది విభిన్నమైన ప్రక్రియ రా. సంగీతం, సాహిత్యం, అభినయం, నృత్యం, ఇలా ఎన్నో కళల సమాహారమే హరికథ. అవన్నీ ఆంజనేయ శర్మగారిలో మేళవించినాయి. ఈరోజు నిన్ను రమ్మనడం మంచిదయింది వైనా” అన్నాడు సారు.

“మీరు రమ్మన్నాక రాకుండా ఉంటానా సార్” అన్నాడు ఆ బాల రసికుడు.

“స్వామి అనుష్ఠానం, భోజనం ముగించి ఉంటారు. మనలను ఎందుకో రమ్మన్నారు. వెళ్లి కలిసి వద్దాం పద.”

ఒక టార్చి లైటు తీసుకొన్నాడు. ఆంజనేయ శర్మగారికి ఇవ్వడానికి నాలుగు అరటిపళ్ల కవర్లో వేసి, పట్టుకొమ్మని శిష్యునిచ్చినాడు. గుడి లోనే ఆయనకు యాభై రూపాయలు సంభావన చదివించి ఉన్నాడు.

వీళ్లు వెళ్లేసరికి పూజారిగారు, శర్మగారు, కంబడి పరచిన పట్టి మంచం మీద కూర్చుని తాంబూల సేవనం చేస్తున్నారు. హర్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్యాంసుడు ఓబులేశయ్య, క్రింద అరుగు మీద కూర్చున్నారు.

శర్మగారు లేచి, సంతోషంగా, వారిని ఆహ్వానించారు.

“రండి, రండి, దస్తగిరిగారు! పొద్దుపోయింది కదా, వస్తారో రారో అనుకున్నాను” అన్నారు.

“అయ్యో, స్వామి మీరు అంతగా చెప్పిన తర్వాత రాకుండా ఉంటామా?” అన్నాడు సారు.

శర్మగారు వారి పట్ల చూపుతున్న ఆదరణను చూసి, నీలకంఠ దీక్షితులుగారి ముఖం అప్రసన్నంగా మారింది. ఆయన నిరంతరం చెన్నకేశవుని సేవతో ఉన్నా, పరమాత్మ ప్రవచించిన ‘సర్వత్ర సమ దర్శన యోగం’ ఆయనకు వంటబట్టలేదు.

‘యానాదుల పిల్లవానికి దూదేకుల వాడు గురువు! సరిపోయింది. వాళ్లేదో మహా విద్వాంసులైనట్లు ఈయన వాళ్ల అడుగులకు మడుగులొత్తడం!’ అనుకున్నాడు.

“మీరు ఒక్కసారి లేస్తే, మంచం లేపి గోడకు అనిద్దాము. అప్పుడు అందరం అరుగు మీద సరిపోతాము. నాయనా ఓబులేశయ్యా, ఆ కంబడి తీసి, మడతలు విప్పి, విశాలంగా పరుచు” అన్నారు ఆంజనేయ శర్మ గారు.

దీక్షితులుగారు లేచి, “సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను” అని లోపలికి వెళ్లిపోయారు. శర్మగారికి చూచాయగా అర్థమైంది. నవ్వుకున్నారు. కౌశికుడంతటి తపశ్శాలి, ధర్మవ్యాధుడి వద్ద ధర్మసూత్రాలు నేర్చుకున్నాడు. ‘జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః’ అన్న ఆర్ష వాక్యమెంత గొప్పది? ప్రతి మానవుడూ జన్మ చేత శూద్రుడే కాని, తాను అనుసరించు సత్కర్మల చేత బ్రాహ్మణుడగుచున్నాడు. అంతేగాని, బ్రాహ్మణ కులములో పుట్టిన ప్రతివాడూ, నిజంగా బ్రాహ్మణుడనడానికి లేదు. దానికి నిదర్శనం, ఇదిగో, ఈ నీలకంఠ దీక్షితులే! శర్మగారి మనస్సు ఈ భావనతో తేలికైంది.

అందరూ కంబడి మీద కూర్చున్నారు. హార్మోనిస్టు ఉరుకుందప్పకు శర్మగారు చెప్పినట్లున్నారు. అతడు దస్తగిరి చేతులు పట్టుకోని కళ్ల కద్దుకొని, ఇలా అన్నాడు –

“సార్. ఈ రోజు మా గురువుగారి పరువు కాపాడినావు నీవు. నేను వస్తున్న బస్సు ఉడుములపాడు కాడ చెడిపాయ. అది ఆర్డినరీ బస్సు. ఇంకో బస్సు ఎక్కించనీకె కండక్టరు చూసెగానీ, ఎక్స్‌ప్రెస్సులు పనికి రావంట. వాటిల్లో ఛార్జి ఎక్కువగదా! గంటన్నర రోడ్డు మినే ఉంటిమి. ఆకరికి ఒక షేర్ వ్యానులో డోన్‌కు వచ్చి, చూస్తే ప్యాపిలికి బస్సు లేదు. అనంతపురము ఎక్స్‌ప్రెస్ ఒకటి వచ్చెగాని అది ప్యాపిలి ఊర్లోకి రాదంట. ఇంతా చేసి నేను వచ్చేటి యాలకు హరికథ అయ్యేపాయ.”

శర్మగారు నవ్వుతూ “ఈ రికార్డు ఎన్నిసార్లు వినిపిస్తావురా?” అన్నారు. ఉరుకుందప్ప మళ్లీ అన్నాడు “లేదు స్వామి, ఈ యప్ప గిన ల్యాకపోతే, ఎంత పని అయ్యేది? సారూ, మీ విద్యను గురించి స్వామి చెప్పినాడు. ఎక్కడా తడుముకోలేదంట నీవు. సొంత హార్మోనిస్టునైన నా కంటె, స్వామి గాత్రాన్ని, సలీసుగ అనుసరించి నావంట. నీ రునం తీర్చుకోలేను” అని కళ్లనీళ్ల పర్యంతమయినాడు ఉరుకుందప్ప. ‘విద్యానేవ విజానాతి విద్వజ్జనా పరిశ్రమమ్’ అన్న ఆర్యోక్తి వీరిద్దరి పట్ల నిజమైంది – అనుకోన్నారు శర్మగారు.

“సరే, నీవు కొంచెం గమ్మునుంటే, వారితో మాట్లాడదాము” అన్నారాయన.

వైనతేయను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు.

“నాయనా, దస్తగిరీ, వీడు సామాన్యుడు కాదు. భగవద్దత్తమైన కళతో బాటు అద్భుతమైన రసగ్రాహి. వీడిని తీర్చిదిద్దితే చక్కని సంగీత విద్వాంసుడవుతాడు. నా హరికథాగానం విని వాడు పొందిన తన్మయత్వం గమనించాను. వాడిని ఒక హరికథా విద్యాంసునిగా తయారు చేద్దాము. ఏమంటారు?”

దస్తగిరిసారు నోట మాట రాలేదు. గొంతు పెగుల్చుకుని, “మహాభాగ్యం, స్వామీ” అన్నాడు.

“తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల రెండేళ్ల సరిఫికెట్ కోర్సు ఉంది. హరికథలో దానికి పది సంవత్సరాలు నిండిన ఐదవ తరగతి పాసయిన పిల్లలు అర్హులు. అది పార్ట్ టైం కోర్సు. వీడిప్పుడు ఏమి చదువుతున్నాడు?”

“మూడో తరగతి ఈ మార్చికి అయిపోతుంది స్వామీ. నాలుగో తరగతికి వస్తాడు.”

“మీరు వీడి తల్లిదండ్రులతో మాట్లాడండి. నేను వీడిని నాతో కౌతాళం తీసుకుని వెళతాను. స్కూల్లో టి.సి. మీరే ఎలాగూ ఇస్తారు. నాలుగు, ఐదు తరగతులు, కౌతాళం ఎలిమెంటరీ స్కూల్లో చదివిస్తాను. ఈ రెండేళ్ళూ నా దగ్గర సంగీతంలో, హరికథాగానంలో శిక్షణ ఇస్తాను. మా ఇంట్లోనే ఉంటాడు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్యకళాశాలలో నా షడ్డకుడు కైప సదాశివశర్మగారు ఆచార్యులుగా పని చేస్తున్నారు. ఆయన సాయంతో వీడిని అక్కడ చేర్పిద్దాము. ఒక సర్టిఫికెట్, అందునా, తిరుపతి వారిది ఉండటం మంచిది కదా! అక్కడే హైస్కూలులో చేర్పిద్దాము. ఏడవ తరగతి పూర్తయ్యే సరికి హరికథ కోర్సు కూడా పూర్తవుతుంది.

తర్వాత మళ్లీ మీ దగ్గరకే వస్తాడు. ఒక ముఖ్య విషయం. కేవలం హరికథలనీ వృత్తిగా స్వీకరిస్తే, జీవనం జరుగదు. లౌకిక విద్య కూడా అవసరమే. ఏదైనా ఉద్యోగం చేస్తూ, ప్రవృత్తిగా దీనిని కొనసాగించాలి. మా తరం వారికి చెల్లింది కాని, ఇప్పుడు కుదరదు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత, చదువును ఎలా కొనసాగించాలో మీరు ప్రణాళిక వేద్దురు గాని.”

వైనతేయకు ఆయన చెప్పినది అర్థమైంది. తనను కేవలం మెచ్చుకోవడంతో సరిపెట్టకుండా, తన జీవితాన్ని తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో అంజనేయ శర్మగారున్నారని ఆ పిల్లవాడికి అర్థమైంది. కన్నీళ్లతో ఆయన పాదాలతో నమస్కరించాడు.

“మరి వీడి తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో?” అన్నారు శర్మగారు.

“నేను వారితో మాట్లాడి, నచ్చ చెప్పి, ఒప్పిస్తాను స్వామి. వారు నా మాట కాదనరు లెండి.”

“ఇంకా రెండేళ్లుంది కదా! ఐదవ తరగతి పరీక్షలు అవగానే తిరుపతిలో చేర్చుదాము. ఈ మూడవ తరగతి పరీక్షలు రాసిన వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి.”

దస్తగిరిసారు ఆయనకు పాదాభివందనం చేశాడు. గురుశిష్యులిరువురూ ఇంటికి బయలుదేరారు. దారిలో సారు అడిగాడు.

“వైనా, మరి శర్మగారి దగ్గర విద్య నేర్చుకుంటావా?”

“తప్పకుండా సారు. ఆయన హరికథ చెపుతూ ఉంటే, ఏనాడైనా నేను అట్లా చెప్పాలనిపించింది.”

“వెరీ గుడ్. భగవంతుడు ఆయన రూపంలో నీకు తారసిల్లాడు. నీ జీవితం మలుపు తిరగబోతుంది.”

వైనతీయ కళ్ళు వెలుగుతున్నాయి, ఆ చీకట్లో కూడా!

“నిజము సార్! దేవుడే ఆయన” అన్నాడు భక్తిగా.

***

మర్నాడు ఆదివారమే కాబట్టి, దస్తగిరిసారు కూడా వైనతేయతో యానాదుల దిబ్బకు బయలుదేరాడు, తన సైకిలు వెనక వాడిని కూర్చోబెట్టుకొని.

సారును చూసి కోనేటయ్య దంపతులు ఆశ్చర్యపోయి, నులకమంచం వాల్చి, దాని మీద షోలాపూరు దుప్పటి పరిచి, కూర్చోబెట్టారు, ఇంటి బయటే, చెట్టు కింద.

“మావాడు బడిలో బాగా సదువుకుంటున్నాడా సారు?” అనడిగింది తిరుపాలమ్మ ఆందోళనగా.

సారే స్వయంగా తమ యింటికి వచ్చినాడంటే వీడేమయినా అల్లరి పని చేసినాడేమో అని ఆమె అనుమానం.

“వానికేమమ్మా! బాగా చదువుతాడు. మాణిక్యం పుట్టింది తల్లీ నీ కడుపున!” అన్నాడు దస్తగిరిసారు.

అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం! మగని సైగను అర్థం చేసుకొని, కొంచెం దూరం లోని కిరాణా షాపుకు వెళ్లిందామె. ఒక బ్రూ పాకెట్టు చిన్నది, రెండు రూపాయల చక్కెర తెచ్చుకుంది. ఇంట్లో పాలు కొద్దిగా ఉన్నాయి. పొయ్యిలో ఎండుపుల్లలు వెలిగించి, సత్తు గిన్నెలో పాలు మరిగించి, వాటిలో బ్రూ పౌడరు, చక్కెర కలిపింది.

వాళ్లింట్లో ఒకే ఒక స్టీలు గ్లాసుంది. అదీ కొంచెం సొట్ట పడింది. దానిలో కాఫీ పోసింది. ఇంకో సత్తుగ్లాసులో మగనికి కొంచెం పోసుకుని, బయటకు వచ్చి ముందు దస్తగిరి సారుకో గ్లాసునందించింది.

“ఎందుకమ్మా, ఇప్పుడివన్నీ అవసరమా?” అన్నాడాయన గ్లాసందుకుంటూ.

“అయ్యో. సారు!” అని నొచ్చుకుంది తిరుపాలమ్మ. “నీవు మా యింటికి రావడమే శాన. కాపీ అయిన ఇచ్చుకోకుంటే ఎట్ల?” అన్నది. మగనికి ఇస్తే “నాకెందుకే? పిల్లోనికి ఇయ్యి” అన్నాడు.

“నా కొద్దు నాయినా, నీవే తాగు” అన్నాడు వైనతేయ. “సారమ్మ నాకు పొద్దున టీ ఇచ్చినాదిలే” చెప్పాడు.

“జొన్న రొట్టెలు కాలుస్త! రెండు తినిపో సారు! కాని రొట్టెలోకి గొడ్డు కారం నూరినా. నేతిసుక్క లేదు సారు” అన్నదామె.

“ఏం పరవాలేదు. చెయ్యమ్మా! గొడ్డు కారం, జొన్నరొట్టె, అంటే నాకిష్టం!” అన్నాడు దస్తగిరిసారు.

యానాదుల యింట్ల తాను తినడేమో అన్న, వారి న్యూనతా భావాన్ని అలా పోగొట్టాడు ఆ గురువర్యుడు. ఆమె లేచి వెళ్లబోతుంటే,

“అమ్మా, కొంచెంసేపు తాళు. మీ ఇద్దరితో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చినా, అదే పనిగా” అన్నాడు సారు.

“చెప్పు సారు” అన్నాడు కోనేటయ్య వినయంగా.

వైనతేయ ఉత్కంఠగా చూస్తున్నాడు

“నేను మన వైనాకు పాటలు, పద్యాలు నేర్పిస్తున్నా గదా! నిన్న వాడిని ప్యాపిలి లోని చెన్నకేశవుల దేవళంతో జరిగిన హరికథకు తీసుకుపోయినా. అక్కడ వాడు ఒక శ్లోకం, ఒక పాట పాడినాడు. హరికథ చెప్పే స్వామి పెద్ద పండితుడు. ఆయన పేరు ఆంజనేయ శర్మ గారు. ఆయనది ఆదోని దగ్గర కౌతాళం.

మన వాని గాత్రం చానా బాగుందని స్వామి మెచ్చుకున్నాడు. సంగీతంలో తరిఫీదు ఇప్పిస్తే, గొప్ప గాయకుడైతాడనీ, హరికథా విద్వాంసుడవుతాడని స్వామి చెప్పినాడు.  వాడిని వచ్చే రెండేళ్లు, తన దగ్గర, కౌతాళంలో పెట్టుకుని నాలుగు, ఐదు తరగతులు అక్కడే చదివిస్తాడంట స్వామి. తర్వాత మన వైనతేయను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సంగీత పాఠశాలలో చేర్పించి, హరికథ కోర్సు చదివిస్తాడు. ఏడవ తరగతి తర్వాత, వాని పైచదువులు నేను చూసుకుంటాను. నా మాట విని వాడిని పంపండి. మీకూ, నాకూ, మంచి పేరు తెస్తాడు” చెప్పాడు సారు.

కోనేటయ్య, తిరుపాలమ్మ అవాక్కై చూడసాగారు. సారు మాటలు వారి మెదళ్లలోకి చేరడానికి కొన్ని క్షణాలు పట్టింది.

“అయితే, మా పిల్లోడు మమ్మల్ని విడిచిపెట్టి నాలుగేండ్లు ఉంటాడా?” అన్నాడు కోనేటయ్య. “ఒకే కొడుకు సారు! మా రమణమ్మకు మనువు వేసి పంపిస్తే, మాకు వాడు తప్ప దిక్కెవరు? మేము వాడిని విడిచిపెట్టి ఉండలేము సారు!” అన్నాడు.

వైనతేయకు కూడా, అమ్మను, నాన్నను వదిలిపెట్టి పోవాలంటే బాధగానే ఉంది.

కాని, తిరుపాలమ్మ ఇలా అనింది – “సారు, ఆయప్ప మాటలకేంగాని, మా వాన్ని పంపిస్తాము. మాకాడ ఉంటే ఏమొస్తాది? వాండ్ల నాయిన లెక్క ఏ రెడ్డి గారింట్లోనో వంటలు చెయ్యాల. దేవుడు వానికి పాడే వరం ఇచ్చినాడు. నీవు వాడికి అండగా ఉంటివి. ఆ కౌతాళం స్వామి ఎవరో, మానుబావుడు! (చేతులెత్తి కనబడని ఆంజనేయ శర్మగారికి మొక్కిందా తల్లి) బ్రేమ్మలు మా యానాదోల్లను ఇండ్ల ఛాయలకే రానియ్యరు. అసుమంటిది, ఆ స్వామి, మన పిల్లోన్ని చేరదీసి విద్దె నేర్పిస్తానంటుంటే, అంత బాగ్గిం వదులుకుంటామా?”

కోనేటయ్య భార్య వైపు చూసినాడు. తర్వాత దస్తగిరి సారు వైపు చూసినాడు. వైనతేయను రమ్మని మీద కూర్చోబెట్టుకున్నాడు.

“ఒరేయ్, అమ్మ చెప్పింది ఇన్నావు కదా! సారొల్ల ఎంబడి పోయి విద్య నేర్చుకుంటావా?” అని అడిగాడు.

“మా సారు ఎట్ల చెపితే అట్ల జేస్తా నాయిన” అన్నాడు వాడు.

తిరుపాలమ్మ ఆలోచనా విధానం, పరిస్థితిని ఆమె సమీక్షించిన తీరు, దస్తగిరిసారుకు అబ్బురం కలిగించాయి. ‘మగనికి, ఆమెకూ ఎంత తేడా?’ అనుకున్నాడాయన. కొడుకు భవిష్యత్తు పట్ల ఆ తల్లికున్న అవగాహన గొప్పది అని సారు ఆమెను లోలోపల మెచ్చుకున్నాడు.

“అయితే ఇంకేం? శుభం” అన్నాడాయన. “పెద్ద పరీక్షలు మరో మాడు నెలలే ఉన్నాయి. అవి రాసిన తర్వాత మా బళ్ళో నేనే టి.సి. ఇస్తాను. వీన్ని తీసుకుపోయి కౌతాళంలో స్వామి దగ్గర వదిలి వస్తా. ఆయన చూసుకుంటాడు.”

తిరుపాలమ్మ పెట్టిన జొన్నరొట్టెలు, గొడ్డు కారం తిని, దస్తగిరిసారు ప్యాపిలికి ఎలబారినాడు, తన సైకిలు మీద! వెళ్లే ముందు వారిని అనునయించినాడు ఇలా –

“మధ్యలో అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడులే. మీరు ఎదారు (బెంగ) పడవాకండి!”

ప్రతిభను గుర్తించడం వేరు, ప్రశంసించడం వేరు, దానిని పూనికతో పెంపొందింప చేయడం పూర్తిగా వేరు! దస్తగిరిసారు, ఆంజనేయశర్మ గారు మూడో కోవకు చెందినవారు!

(ఇంకా ఉంది)

జీవితమొక పయనం-15

0

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[మర్నాడు ఉదయం ప్రధానాచార్యులు రాఘవని పిలిపిస్తారు. గబగబా ఆయన గదిలోకెళ్తాడు రాఘవ. అతన్ని చూడగానే, ఆందోళనగా, మనం అనుకున్నంత పనీ అయ్యిందంటారాయన. ఏమైందని కంగారుగా అడుగుతాడు రాఘవ. ఈ వార్త చదవండంటూ, దినపత్రికని రాఘవ ముందు పెడతారాయన. ఓ పేరు మోసిన భూస్వామిని తీవ్రవాదులు హత్య చేశారనీ ఉంటుంది అందులో. నిన్న తమ వద్దకు వచ్చి అన్నం వడ్డించుకు తీసుకువెళ్ళిన వారి పనే ఇదని, పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తూ వస్తే, తాము దొరికిపోతామని, ఇక తమని ఆ భగవంతుడే కాపాడాలని ఆయన అంటారు. రాఘవ ఆయనకు ధైర్యం చెప్పి – వంటాయన వెంకటప్పయ్యని పిలిపించి – ఎవరైనా వచ్చి విచారణ జరిపితే – తమ వద్దకు ఎవరూ రాలేదనీ, తామెవరికి భోజనం పెట్టలేదని చెప్పాలని గట్టిగా చెప్తాడు. అదే మాట చాకలాయనకూ, అతని భార్యకు కూడా చెప్పమంటాడు. తరువాత రాజారావుని కలిసి జరిగినది చెప్పి, అతన్ని జాగ్రత్తగా ఉండమంటాడు. తాను అన్నలని కలిసిన సంగతి ఇద్దరు ముగ్గురు మిత్రులకి చెప్పానని రాజారావు చెబితే, రాఘవ వారందరినీ వ్యక్తిగతంగా కలిసి – నోరు జారవద్దని చెప్తాడు. అయితే ఆ సాయంత్రం వరకూ ఎవరూ ఎంక్వయరీకంటూ రాకపోయేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారందరూ. ఆ రాత్రి 2.20 ని॥ లకి తలుపు గట్టిగా చప్పుడైతే లేచి వెళ్ళి తీస్తాడు రాఘవ. తుపాకులతో గదిలోకి ప్రవేశించిన వాళ్ళని చూసి బిత్తరపోతాడు రాఘవ. వాళ్ళేదో హిందీలో అడుగుతుంటే హిందీ రాదంటాడు. ఇంతలో ఓ తెలుగు వ్యక్తి లోపలికి వచ్చి ప్రశ్నలు వేస్తాడు. రాఘవ వాళ్ళు అడిగిన వాటికి జవాబులు చెప్తాడు. వాళ్ళు పోలీసులని అర్థం చేసుకుంటాడు.  ఈ లోపు ప్రధానాచార్యులు కూడా అక్కడికి వస్తారు. ఆయన్నీ ప్రశ్నిస్తారు. సమీప గ్రామంలోని ఓ మోతుబరి రైతును తీవ్రవాదులు హత్య చేశారని, మీరు వాళ్ళకి భోజనం పెట్టారని తెలిసింది, నిజమేనా అని అడుగుతారు. కాదంటాడు రాఘవ. వాళ్ళు పదవ తరగతి పిల్లల్లో ఒడ్డూ పొడుగు బాగుండి, బలిష్టంగా పిల్లల్ని గుచ్చి గుచ్చి చూస్తారు. గంటన్నరసేపు వాళ్లు అక్కడే మకాం వేస్తారు. టీచర్లందరినీ విచారించారు, కానీ పిల్లలెవరినీ డిస్టర్బ్‌చెయ్యలేదు. వాళ్ళు తీవ్రవాదులు మళ్ళీ వస్తే పోలీసులకి చెప్పమనీ, భోజనాలు పెట్టడం వంటివి చేయద్దని హెచ్చరించి వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]

29. మిణుగురులు

[dropcap]రా[/dropcap]ఘవ ఆ ఆవాస విద్యాలయంలో చేరి మూడు నెలలకు పైగానే అయ్యాయి. బాబాయ్‌ను కలిసి కూడా చాలా రోజులయ్యాయి.

గత నెలలో సెకండ్‌ సాటర్డే రోజున బాబాయ్‌ ఇంటికి వెళ్లటమే! ఆ తర్వాత మళ్లీ వెళ్లే సమయమే చిక్కలేదు.

మరునాడు ఆదివారం. ‘బాబాయ్‌ వాళ్లింటికి వెళ్లొస్తే ఎలా ఉంటుంది?’ అని ఆలోచిస్తున్నాడు రాఘవ.

వెళ్లి వెంటనే తిరిగొచ్చెయ్యకుండా.. ఈసారి అటే ఏదైనా సినిమాకు వెళ్లొస్తే బావుణ్ణనిపించింది.

తాను సినిమాకు వెళుతున్నానని తెలిస్తే సుందరంగారు కూడా తయారవుతారు. అప్పుడు అతణ్ణీ వెంటబెట్టుకుని బాబాయ్‌ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అది తనకిష్టం లేదు. వాళ్లను ఇబ్బంది పెట్టటమూ భావ్యం కాదు. అందుకని తాను సినిమాకు వెళ్లే విషయాన్ని దాచిపెట్టి బాబాయ్‌ ఇంటికి వెళుతున్నట్టు మాత్రమే చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్టే ఆదివారం ఉదయమే త్వరగా స్నానం పూర్తిచేసి ప్రధానాచార్యుల గదికెళ్లి తాను మాధవరెడ్డిగారిని కలవటానికి హనుమకొండకు వెళ్లి రావటానికి అనుమతి కోరాడు. ఆయన అందుకు సంతోషంగా వెళ్లి రమ్మని చెప్పాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వంటశాలకెళ్లి గబగబ అల్పాహారం తిన్నాడు.

సరిగ్గా ఎనిమిది గంటలకు ఊళ్లో నుండి వరంగల్‌కు బస్సు బయలుదేరుతుంది. ఆ సమయానికి హరిజనవాడ బస్టాప్‌ దగ్గరుంటే బస్సును అందుకోవచ్చు, అనుకుంటూ.. రాఘవ వడివడిగా హరిజనవాడ వైపు నడక మొదలుపెట్టాడు.

ఆ సమయానికే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు వరంగల్‌ బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.

వాళ్లు రాఘవను చూసి పలకరింపుగా నవ్వారు. అందులో సుందరంగారు కూడా ఉన్నాడు. బహుశా సినిమాకే అయ్యుండొచ్చు! వారంవారం అతను సినిమా చూడకుండా ఉండలేడు. ఆఖరికి చూసిన సినిమానైనా రెండోసారి చూడ్డానికైనా వెనకాడడు. అంత పిచ్చి! ‘ప్రస్తుత యాంత్రికమైన జీవితంలో అదొక్కటే తనకు రిలీఫ్‌నిచ్చే విషయమని’ అతను పదేపదే చెబుతుంటాడు. ఏమిటో ఎవరి పిచ్చి వారికి ఆనందం!

ఈలోపు బస్సు రానే వచ్చింది. అందరూ గబగబా ఎక్కారు. బస్సు ఆ మట్టిరోడమీద మెల్లగా బయలుదేరింది.

గుంతల్లో దిగి లేస్తూ, మలుపుల్లో వాలుతూ, ఊగుతూ గంట తర్వాత హనుమకొండ స్టాపులో దిగాడు రాఘవ.

ఆ గంట ప్రయాణంతో అతని ఒళ్లంతా హూనమైపొయ్యింది. దిగి ఫుట్‌పాత్‌మీద కాళ్లూ చేతులూ విదిలించుకున్నాడు. కొంతసేపు అక్కడే ఆ స్టాపులోనే నిలబడ్డాడు. రెండు మూడు రిక్షాలు ఖాళీగా వెళుతూ అతణ్ణి చూసి “ఎక్కడికీ..? వొత్తారా..” అంటూ అడిగారు. రాఘవ రానని చెప్పాడు.

‘అయినా రిక్షాలో వెళ్లి మాత్రం తాను చెయ్యగలిగింది ఏముందనీ? అందుకే నడుద్దాం’ అని నిర్ణయించుకున్నాడు. ‘పైగా ఊరునీ చూసినట్టుంటుంది!’ అనుకుని నడవటం మొదలుపెట్టాడు.

ఒఠి చేతులతో బాబాయ్‌ ఇంటికి వెళ్లటం ఇష్టంలేక ఏం కొని తీసుకెళదామా అని ఆలోచిస్తుంటే దార్లో ఒకచోట అనాసపండ్లు అమ్మటం కనిపించింది. బేరమాడి రెండు పండ్లు కొన్నాడు.

అర్ధగంటకు పైగా నడిచి బాబాయ్‌ ఇంటికి చేరుకున్నాడు. రాఘవను చూడగానే నవ్వుతూ ఆహ్వానించాడు మాధవరెడ్డి. “ఏం బాబూ, ఇన్నాళ్లకు గానీ ఇక్కడికి రావాలనిపించలేదా?” అంటూ నిష్ఠూరపొయ్యింది పిన్ని.

“అదేం లేదు పిన్నీ, పని సరిగ్గా ఉంటోంది. ఆదివారమైతే పిల్లల తల్లిదండ్రుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. కానీ ఇవ్వాళ ఎలాగైనా మిమ్మల్ని కలవాలనే వచ్చాను.” అంటూ తన చేతిలోని అనాసపళ్ల బ్యాగుని ఆమె చేతికిచ్చి “అనాస పళ్లు బాబాయ్‌, ఈ వయసులో మీరు తప్పక వీటిని రుచి చూడాలి.” అన్నాడు.

“ఎందుకు బాబూ ఇవన్నీనూ.. అనవసర ఖర్చు. రోజూ ఏదో ఒక పండు తింటూనే ఉంటాము.” అంది ఆమె.

ఆ తర్వాత బాబాయ్‌, రాఘవ మాటల్లో పడిపోయారు.

రాఘవ వచ్చాడని ఆ పూట వడా పాయసం చేసింది పిన్ని. తింటున్నప్పుడు వాళ్లు కనబరచిన ఆప్యాయతకు ఎంతగానో కరిగిపోయాడు రాఘవ. తర్వాత సినిమా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కణ్ణించి త్వరగా బయటపడ్డాడు.

తాను చూడాలనుకున్న సినిమాకు వెళ్లాలంటే వరంగల్‌కు వెళ్లక తప్పదనుకుంటూ..

టౌన్‌బస్సును పట్టుకుని థియేటర్‌కు చేరుకున్నాడు. కాసేపటికే సినిమా మొదలైంది. అది పాత పౌరాణిక సినిమా, పెద్ద సినిమా! క్రమంగా సినిమాలో లీనమైపొయ్యాడు.

సినిమా పూర్తయ్యేసరికి బాగా పొద్దుపోయింది. అక్కణ్ణించి సిటీబస్సు ఎక్కి తాను దిగాల్సిన బస్టాపు దగ్గర దిగాడు. తామరగుంట వెళ్లే బస్సుకోసం ఎదురుచూడసాగాడు.

ఐదుగంటల బస్సు వెళ్లిపోయినట్టుంది. దాని తర్వాత ఆరున్నరకు ఇంకో బస్సుంది. దాన్ని అందుకుంటే సరిపోతుంది, అనుకుంటూ ఆ బస్సుకోసం ఎదురుచూడసాగాడు.

అతను దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. కొంత దూరంలో ఒక తోపుడు బండిమీద మొక్కజొన్న పొత్తులు పేర్చుకుని ఒకావిడ నిప్పుల కుంపటిమీద వాటిని కాలుస్తూ అమ్ముకుంటోంది. కొనుక్కున్నవాళ్లు మొక్కజొన్న గింజల్ని కొరికి తింటూ వెళుతున్నారు. అవి కొనాలనుకున్నవాళ్లు అక్కడే ఆగి ఆమె కాల్చి ఇచ్చాక తీసుకొని వెళుతున్నారు. ఒక్కో మొక్కజొన్న పొత్తు రెండురూపాయలకు అమ్ముతోంది.

రాఘవకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మొక్కజొన్నలు తమవైపు కోళ్లకు, కుందేళ్లకు ఆహారంగా వేస్తారు. అంతే తప్ప, ఇలా మనుషులు కూడా దాన్ని తింటారని అతనికి అప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా ఆమెనే చూడసాగాడు.

ఆరున్నర కూడా దాటిపోతోంది. కానీ బస్సు జాడేలేదు. బాగా చీకటి పడిపోయింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఆదివారం కావటంతో జనసంచారం తక్కువగా ఉంది. అప్పుడప్పుడూ ఒక టూ వీలర్‌, ఆటో వెళుతోంది, అంతే!

సమయం ఏడయ్యింది. ఎవరో అంటున్నారు.. ‘ఒక్కోసారి కొన్ని బస్సుల్ని ఏదో కారణంచేత క్యాన్సిల్‌ చేస్తారట’. దాంతో ఎవరికి తోచినట్టుగా వాళ్లు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతున్నారు.

కొందరు రిక్షాలమీద, కొందరు ఆటోరిక్షాలమీద వెళ్లిపోతున్నారు. రాఘవ వెళ్లాల్సిన ఊరికి అప్పుడప్పుడూ ఆటోరిక్షాలు వెళ్తుంటాయి. కానీ ఆ సౌకర్యం చాలా తక్కువే. అక్కడికి బస్సులో మాత్రమే వెళ్లాలి. ‘ఛ, మరేదైనా బస్సు వేస్తే బాగుండేది.’ అని మనసులో విసుక్కున్నాడు.

కొంతసేపటికి ఆ దారిన ఒక ట్రాక్టర్‌ వెళ్తూ కనిపించింది. అందులో వెళదామా అనుకున్నాడు. అయితే అది ఎక్కడికి వెళుతుందో ఎలా తెలుస్తుంది. అయినా అతను ఆపలేదు. ట్రాక్టర్‌ సర్రుమంటూ వెళ్లిపొయ్యింది. రాఘవకేం చెయ్యాలో తోచలేదు.

ఇంతలో..

ఎవరో తన వెనక నిలబడినట్టుగా అనుమానం కలిగింది. ఠక్కున వెనక్కు తిరిగి చూశాడు. మొరటుగా ఉన్న వ్యక్తి నిలబడున్నాడు. అతను రాఘవకేసే చూస్తూన్నాడు. కాస్త తూలుతున్నట్టుగా కూడా ఉన్నాడు. అతడి వాలకం చూస్తుంటే ఏ డెకాయిట్‌లాగానో అనిపిస్తున్నాడు.

ఇంతకీ అతను తాగుబోతా? తిరుగుబోతా? లేదూ దొంగా? అయినా తనదగ్గర విలువైన వస్తువులేవీ లేవే. అంటే బంగారంలాంటివేమీ లేవు. పోనీ డబ్బులైనా ఉన్నాయా అంటే.. అదీ ఎక్కువేమీ లేదు. రెండు వందలుంటాయేమో అంతే!

రాఘవ రెండడుగులు ముందుకేశాడు. ఆ అపరిచితుడూ అతని వెనకే నడిచాడు.

‘అనుమానం లేదు. వాడు దొంగే. తన దగ్గరనుండి ఏదో తస్కరించాలని చూస్తున్నాడు. దొంగతనం చేస్తే పర్వాలేదు. ఆ ప్రయత్నంలో తనను హత్య చేస్తే?..’ అన్న అనుమానం పట్టుకుంది.

అతణ్ణి పరీక్షించాలని రాఘవ మళ్లీ ముందుకు రెండడుగులు వేశాడు. అతనూ వెనకే వచ్చాడు.

రాఘవకు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆ బస్టాపులో మనుషులు పెద్దగా లేరు. తనలా బస్సుకోసం ఎదురు చూసేవాళ్లు ఎవరూ లేరు. ఆ మొక్కజొన్నలు అమ్మే ఆమె, దూరంగా ఒక రిక్షావాడూ ఉన్నారంతే.

మళ్లీ వెనకున్న వాణ్ణి ఓరకంటితో చూశాడు. క్రూరంగా వున్న అతడి ముఖం చూసి రాఘవలో వణుకు మొదలైంది.

సరిగ్గా అప్పుడు ఒక షేర్‌ ఆటో వచ్చి రాఘవ ముందు ఆగింది. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఆటో డ్రైవరు అతనివైపు చూస్తూ.. ఎక్కడికెళ్లాలి? అన్నట్టు సైగచేశాడు. ‘తామరగుంట’ అన్నాడు రాఘవ.

“ఊళ్లోకెళ్లదు. రోడ్డుమీదే దిగి పోవాలి.” అన్నాడు ఆటోడ్రైవరు.

మరో దారిలేదు.. ఠక్కుమని అందులోకి ఎక్కి కూర్చున్నాడు. ఆటో వేగంగా కదిలి ముందుకెళ్లిపోయింది.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సీట్లో వెనక్కు వాలి కూర్చున్నాడు రాఘవ.

కొంతసేపటికి తామరగుంటకు వెళ్లే రోడ్డు దగ్గర ఆటో ఆపి “దిగండి..” అన్నాడు డ్రైవరు.

రాఘవ కిందికి దిగి “ఎంత?” అన్నాడు

“వంద!” అన్నాడు డ్రైవరు. “ఎక్కువే, తగ్గించు.” అన్నాడు రాఘవ.

“ఊహూ గిట్టదు. నా బండే గనక లేకపోతే మీరిక్కడి దాకా కూడా వచ్చుండలేరు” అన్నాడు డ్రైవరు.

“పోనీ, వంద తీసుకుంటున్నావు, నన్ను ఊళ్లో దింపొచ్చుగా!” అన్నాడు వంద నోటు ఇస్తూ.

“ఊళ్లోకి ఎళ్లనని అక్కడే చెప్పాను.” అంటూ వందను తీసుకుని చక్కా పోయాడు డ్రైవరు.

ఆటో కనుమరుగయ్యేంతవరకూ అక్కడే నిలబడ్డాడు రాఘవ. కొంతసేపటికి ఆ ఆటో శబ్దమూ పలచబడిపోయి నిశ్శబ్దం ఆవరించింది. ఎవరైనా టూవీలర్‌పై ఇటు తిరిగితే వాళ్లను లిఫ్ట్‌ అడిగి హరిజనవాడ దగ్గర దిగుదామని ఆగాడు.

ఎంతసేపైనా ఒక్క వాహనమూ రాలేదు. పగటిపూట ఎన్నో వాహనాలు సర్రుసర్రుమని వెళ్లే ఆ దారిమీద ఇప్పుడు ఒక్క వాహనమూ కనిపించలేదు. ఎంతసేపు నిలబడ్డా తన పరిస్థితి ఇంతే కాబోలనుకున్నాడు.

అక్కడే ఆగేదానికన్నా మెల్లగా నడుచుకుంటూ వెళుతుంటే ఏదైనా వాహనమొస్తే సాయం అడిగి ఎక్కుదాం అని నిర్ణయించుకున్నాడు.

కానీ ఆ కటిక చీకటిలో ఒంటరిగా నడవటానికీ అతనికి భయమేస్తోంది. అమావాస్య రోజులు. ‘గీయ్‌..’ మన్న కీచురాళ్ల రొద తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకు తనకు బాగా నచ్చిన ఒక సినిమా పాటను పాడుతూ.. అడుగులు ముందుకు వెయ్యసాగాడు. పాట తర్వాత పాట. అలా పాడుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.

ఒకచోట ఆగి తను వచ్చిన దిక్కుగా వెనక్కు తిరిగి చూశాడు. చీకట్లో ఏ దారీ కనిపించలేదు. ఎంత దూరం వచ్చాడో, ఇక ఎంత దూరం వెళ్లాలో కూడా తెలియటం లేదు. సరే ఏదైతే అదవుతుందని మళ్లీ నడక మొదలుపెట్టాడు.

అంతలో ఉన్నట్టుండి ఏదో ఆకారం తనకేసి దూసుకొస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది. అదేమిటో పసిగట్టలేకపోయాడు. మనిషా, జంతువా, వాహనమా? ఏమీ అర్థం కాలేదు. పక్కకు తప్పుకుందామనుకునేంతలో అది తన దగ్గరకు రానే వచ్చేసింది.

ఎటు కదిలితే ఏమవుతుందోనన్న కంగారుతో కళ్లు మూసుకుని ఉన్నచోటే నిలబడిపొయ్యాడు. దూసుకొచ్చిన ‘అది’ కూడా తన ముందు నిలబడిపోయినట్టుంది. అడుగుల శబ్దం ఆగిపోయింది. కానీ తన ముఖంలోకి బుస్సు బుస్సుమని గాలి వదులుతోంది. అదేమిటా అని కళ్లు తెరిచి చూశాడు. తనకు దగ్గరగా రెండు కళ్లు కనిపించాయి.

దేనివవి? పులివా? ఏనుగువా? ఎలుగుబంటివా?.. ఏదీ కాదు, ఎద్దువి. ఒక నల్లెద్దు ఎక్కడో చేలోపడి మేసి ఇంటికి తిరుక్కున్నట్టుంది. ఎవరి అదిలింపుకో బెదిరి ఇలా పరుగెత్తుకొచ్చి తనముందు నిలబడిపొయ్యింది. గుండె చిక్కబట్టుకుని మెల్లగా పక్కకు తప్పుకుని ముందుకు నడిచాడు. అది కూడా అతణ్ణి ఏమీ చెయ్యకుండా తన దారిన తను వెళ్లిపోయింది.

క్రమంగా గుండె దడ తగ్గి మామూలు స్థితికొచ్చింది.

నడవటం ఆపి రోడ్డు పక్కన ఒక పెద్ద బండరాయి కనిపిస్తే కాసేపు దానిమీద కూర్చుందామనుకుని దగ్గరికెళ్లాడు.

చదునుగా ఉన్నచోట కూర్చున్నాడు. తల పైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడక్కడా నక్షత్రాలు మినుక్కు మినుక్కు మంటున్నాయి. వాటిపైనే దృష్టిని నిలిపి అలాగే చూస్తుంటే ఒక నక్షత్రం వెలుగుతూ ఆరుతూ ఎగురుతూ.. అతని సమీపానికి వచ్చినట్టుగా అనిపించింది. చెయ్యి చాచి దాన్ని అందుకోబోయాడు. కానీ అది తప్పుకుని దూరంగా ఎటో ఎగిరిపోయింది.

అంతలో ఇంకో నక్షత్రం అతనికి సమీపంగా వచ్చింది. దాన్నైనా పట్టుకుందామని ప్రయత్నించేంతలో అదికూడా అతని నుండి దూరంగా వెళ్లిపోయింది. ఈసారి చటుక్కున తన దగ్గరికొచ్చిన ఒక నక్షత్రాన్ని అందిపుచ్చుకున్నాడు.

మెల్లగా పిడికిలి తెరుస్తూ.. కానీ పూర్తిగా తెరవకుండా చేతిలోనిది ఏమిటో పరిశీలించాడు. అది నక్షత్రం కాదు, మిణుగురు పురుగు. తన అరచేతిలో చిక్కుకుని వెలుగుతూ ఆరుతూ.. నక్షత్రంలా మినుక్కు మినుక్కు మంటోంది.

పూర్తిగా అరిచేతిని తెరిచాడు. అది వెలుగుతూ ఆరుతూ.. ఎటో ఎగిరిపోతోంది..

ఆ బండమీదికెక్కి నిలబడ్డాడు. వెనకున్న పొలాలకేసి చూసి ఆశ్చర్యపోయాడు.

అక్కడ.. ఒకటి కాదు రెండు కాదు.. వందలాది మిణుగురులు.. గుంపులు గుంపులుగా ఎగురుతూ.. తన సమీపానికొచ్చి.. చుట్టూ తిరుగుతూ.. మెల్లగా ఎటో ఎగిరిపోతున్నాయి. పైపైకి అలా అలా వంకర టింకరగా ఎగురుతూ.. మెలికలు తిరుగుతూ.. చెట్లమీదా, కొమ్మలమీదా, ఏది కనిపిస్తే దానిమీద క్షణమాత్రం వాలి విశ్రాంతి తీసుకుని మళ్లీ పైకి ఎగురుతూ.. చూడటానికి ఆదెంతో రమణీయంగా అనిపించింది!

కటిక చీకట్లో వెలుతురు పువ్వుల్లా.. ఆ మిణుగురులు ఏం చెబుతున్నాయి?

ఇందాకా అతను ఒంటరినని భయపడ్డాడు. కానీ, ఆ మిణుగురులు ‘తాము అతనికి తోడున్నామని ధైర్యం చెబుతున్నట్టుగా’ అనిపించింది. వాటిమధ్య అతను ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు.

బండరాయి మీదనుండి కిందికి దిగాడు. నడక మొదలుపెట్టాడు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు పడుతుంటే కాసేపటికంతా పాఠశాలకు చేరుకున్నాడు.

హాల్లోకి అడుగుపెడుతుంటే “ఆచార్జీ అచ్చేశారా? ఇయ్యాలదాకా మీరు రాకపోయేసరికి మీకేమైందో, ఏమోనని ఎంత భయపడ్డానో తెలుశాండీ.” అంటున్న చల్లా రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వాడి తల నిమురుతూ ఉండిపొయ్యాడు రాఘవ.

30. మనసులోని మాట

పాఠశాలకు దసరా సెలవులు ప్రకటించారు.

రాఘవ తన సొంతూరుకు వెళుతున్నాడు. రైల్లో బెర్తుమీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు.

ఐదునెలల క్రితం కన్యాకుమారి నుండి చిత్తూరుకు తిరుగు ప్రయాణమై వెళుతుంటే అసంతృప్తితో వేగిపోయాడు. అప్పుడతనికి తన ఊరికి తిరిగి వెళ్లటం ఎంత మాత్రమూ ఇష్టంలేదు. కానీ అదే రాఘవ, ఇప్పుడు వరంగల్‌ నుండి చిత్తూరుకు వెళుతుంటే ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఆనాడు అతను విధిలేక, వేరే మార్గం తెలియక చిత్తూరుకు తిరుగు ప్రయాణం కావలసి వచ్చింది. కానీ బాబాయ్‌ పుణ్యమా అంటూ.. ఇవ్వాళ అతనికంటూ ఒక ఉద్యోగం ఉంది. ఆ సంతోషంతో అతను తమ సొంత ఊరికి వెళుతున్నాడు.

‘తామరగుంటకొచ్చిన ఈ ఐదు నెలల్లో తన జీవితంలో ఏనాడూ పొందని ఆనందాన్ని చవిచూశాడు. ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. మనిషికి అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? ఖాళీ సమయం అంటూ దొరికితే ఏవేవో పిచ్చిపిచ్చి ఆలోచనలు మనిషిని చుట్టుముడతాయి. కానీ దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకూ ఏదో ఒక పనిమీద నిమగ్నమై ఉండటానికి మించిన ఆనందం మరొకటి ఉండదు కదా?!

ఉద్యోగం తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, మనోవికాసాన్ని కలిగించాయి. ఇప్పుడు తాను సిగ్గుతో కుంచించుకుపోవలసిన పనిలేదు. గర్వంగా తలెత్తుకుని తిరగవచ్చు. అందరితోనూ తలెత్తుకుని మాట్లాడొచ్చు.’ ..ఇలాగంతా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటిరోజు.. ఇంట్లోకి అడుగుపెడుతుంటే ఏదో తెలియని ఆనందం అతణ్ణి నిలువెల్లా ముంచెత్తింది. ఎదురొచ్చిన తల్లిదండ్రుల్ని నవ్వుతూ పలకరించి స్నానానికి వెళ్లాడు. అటు తర్వాత అక్కడి విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాడు.

చిన్నా గ్రూపు 1 పరీక్షలో ప్యాసై ఇంటర్వ్యూకు ప్రిపేర్‌ అవుతున్నట్టు రాఘవతో చెప్పాడు. “నువ్వు తప్పకుండా గెజిటెడ్‌ ఆఫీసరువు అవుతావు.” అని ఆనందంగా చెప్పాడు రాఘవ. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు మురళి.

ఆ మరునాడు రాఘవ తన ఆత్మీయ స్నేహితుడు శ్రీకర్‌ను కలుసుకున్నాడు. చాలాకాలం తర్వాత కలిసినందుకు ఇద్దరూ ఎంతో సంతోషించారు.

కొంతసేపయ్యాక – “రాఘవా, నిజంగా నీకు అక్కడ సంతృప్తికరంగా ఉందా?”అని సూటిగా ప్రశ్నించాడు శ్రీకర్‌.

“ఆ.. అక్కడ నాకేం తక్కువ. చక్కటి ఉద్యోగం, ఉండటానికి చోటు, భోజన సౌకర్యం, ఖర్చుకు డబ్బులు, ఎప్పుడైనా సినిమాకు వెళ్లాలనుకుంటే వెళతాను. ఇంకేం కావాలి?” భుజాలెగరేస్తూ అన్నాడు రాఘవ.

అతని చేష్టలకు శ్రీకర్‌ నిట్టూర్చాడు. “అయితే సంతృప్తిగానే ఉన్నానంటావు?” అన్నాడు చివరగా.

“అవును, సంతృప్తిగానే ఉన్నాను.” తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు రాఘవ.

“ఎంత అల్ప సంతోషివై పొయ్యావు రాఘవా?” స్నేహితుడి కళ్లల్లోకి చూస్తూ అన్నాడు శ్రీకర్‌.

“అల్పమో, స్వల్పమో.. ఆ మాత్రం సంతోషాన్నైనా దక్కించుకోగలగటం నా అదృష్టంగానే భావిస్తున్నాను.”

“ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నావు?” నిర్లిప్తంగా అన్నాడు శ్రీకర్‌.

“ఆత్మవంచన కాదు శ్రీకర్‌, ఆత్మపరిశీలన! ఏం చెయ్యమంటావు? నేను కన్న కలల్ని సాధించుకోవటం నాకు అసాధ్యం అయినపుడు అడ్జెస్ట్‌ కావటం తప్ప మరో మార్గం లేదు. నీకు తెలియనిదేం కాదు, మనది మధ్య తరగతి కుటుంబం! ఈ తరగతిలోని వాళ్లకు కోరికలు, ఆశలు అస్సలు ఉండకూడదు. ఉంటే దాన్ని సాధించుకునేందుకు చాలా కష్టపడాలి. అందుకు చదువే చక్కటి పునాది. కానీ, ఆ చదువునే నేను సాధించలేకపొయ్యాను. చదువులో నేనేమంత బ్రిలియంట్‌ను కానని నీకూ తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను టెన్త్‌ ఫెయిలయ్యి, ప్యాసయ్యాను. ఇంటర్‌లో తీసుకున్న ఇంగ్లీషు మీడియం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి పడేసింది. కానీ ఎలాగో కస్టపడి ప్యాసయ్యాను. బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలన్నది నా బలమైన కోరిక. అందుకే డిగ్రీలో బి.కాం.తీసుకున్నాను. కానీ ఆ బి.కాం డిగ్రీని ప్రాపర్‌ గైడెన్స్‌ లేక దాన్ని ఐదేళ్లలో పూర్తిచెయ్యవలసి వచ్చింది. ఈలోపు ఇంగ్లీషు, తెలుగు టైపురైటింగ్‌ కూడా ప్యాసయ్యాను. కానీ ఏం లాభం, ఏ శిక్షణా తీసుకునే స్థోమత లేనప్పుడు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలమా? అందుకే ఎందులోనూ ఉత్తీర్ణత సాధించలేకపొయ్యాను. ప్రభుత్వ ఉద్యోగాలపై ఏమాత్రం నమ్మకం ఉంచలేకపోయిన నేను.. చివరకు మానాన్న వాలంటరీ రిటైర్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నాను. కానీ ఈనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అది కూడా అడియాశలయ్యాయి. అప్పుడు ఒక నిరుద్యోగిగా నేనెంతటి మానసిక క్షోభను అనుభవించానో మాటల్లో చెప్పలేను.

ఈ పరిస్థితుల్లో నేనిలాగే ఉండిపోతే ఎందుకూ కొరగానివానిగా తయారవటం ఖాయం. అందుకే మార్గాలు అన్వేషించాను. నాకు చేతనైన పనిని చేజిక్కించుకున్నాను. ఇప్పుడు చెప్పు శ్రీకర్‌, ఇది ఆత్మవంచన ఎలా అవుతుంది?”

“మనలాంటి నిరుద్యోగులకు స్వయం ఉపాథి పథకాలంటూ ఉన్నాయిగా, వాటిని ఉపయోగించుకుని ఉండొచ్చుగా?!”

“శ్రీకర్‌, ఒక్క విషయం గుర్తుంచుకో. నాది వ్యాపార మనస్తత్వం కాదు. నాకు ఆ దక్షత లేదు. ప్రభుత్వమిచ్చే లక్షరూపాయల లోను తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాలి. వ్యాపారం జరిగినా జరగకపోయినా బ్యాంకు వాళ్లకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కట్టాలి. షాపుకు అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అబ్బో.. ఇంకా ఎన్నో.. వాటిని ఊహించుకోవాలంటేనే భయమేసింది. అందుకే దాని జోలికి నేను వెళ్లలేదు.. చివరికి, నాకు తెలిసిన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. ముందుకు వెళుతున్నాను. కొన్నాళ్లయినా ఈ వాతావరణానికి దూరంగా ఉందామని నిర్ణయించుకున్నాను, అంతే!” తన మాటల్ని పూర్తిచేసి గోడకు జారగిలబడి కూర్చున్నాడు రాఘవ.

దీర్ఘంగా నిట్టూరుస్తూ తనూ గోడకు జారగిలబడి కూర్చున్నాడు శ్రీకర్‌.

(ఇంకా ఉంది)