Site icon Sanchika

పల్లవి

[dropcap]నీ[/dropcap] నవ్వులో పువ్వునై.. ఆ పువ్వులో ప్రాణమై
నువ్వు ప్రేమించినా.. పరిహసించినా
నీ పాటలో పల్లవిలా.. నీ ఆటలో చరణమ్ములా
నిను చేరనా.. నీ మదినేలనా.. ప్రియా.. ॥నీ నవ్వులో॥

మాఘ మాసమ్ములా మధుర గానమ్ములా
జన్మజన్మలో నీ బంధమే అనుబంధమై
సుమధుర సుస్వారాలు పలికించని
సరిగమ పదనిసల వినిపించని.. ॥నీ నవ్వులో॥

ఈ జీవితం
నీ దారిగా
ఆ దారిలో
నే నీడగా
ఇష్టంగా కష్టించి
కాలంతో కరాచాలనం చెయ్యనా..
కవిత కుసుమాలే పండించనా.. ॥నీ నవ్వులో॥

గోదారిలా
గాన మాధురిలా
నిండైన హృదయంలా
ఇంపైన గానంలా
నా పాటలో పల్లవిలా
నా ఆటలో చరణమ్ములా
నన్ను చేరుకో నా మదినేలుకో.. ప్రియా.. ॥నీ నవ్వులో॥

Exit mobile version