Site icon Sanchika

పండగ!

[dropcap]స[/dropcap]న్నజాజి పూవులనడిగా
చందురూడు ఏమన్నాడని
మొగలి పూరెక్కలనడిగా
పున్నమి ఎపుడొస్తుందని
మ్రోగే పిల్లనగ్రోవినడిగా
రాగం ఎంతవరకు పోతుందని
వణికే పెదవులనదిగా
నా మామ పేరేమిటని
బెదిరే కన్నులనడిగా
వాడి రాక తెలుపమని
గొంతులో దిగని ఆరాటం
మెలికలు తిరిగే వేళ్ళ కోలాటం
నా మామ వచ్చిన చిన్న సందేశం
నాలో పండగొచ్చిన సంతోషం!

Exit mobile version