2 మార్చి 2024 తారీఖున అనంతపురం నగరంలో, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులనుద్దేశించి, సంచిక రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ ప్రసంగించారు.
‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అన్నం అంశంపై మాట్లాడి, ఆయన, విద్యార్థులకు భారతీయ సంస్కృతిలోని వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించారు.
సంచిక మాసపత్రికలో పది నెలలపాటు ధారావాహికగా, పాణ్యం దత్తశర్మ గారి, పైన పేర్కొన శీర్షికతో, వ్యాస పరంపర ప్రచురితమైన విషయం విదితమే.
సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అది త్వరలో పుస్తక రూపంలో రానుంది. దాని అంశాలనీ, దత్తశర్మ, చైతన్య డిగ్రీ విద్యార్థులకు, వారి మానసిక, మేధో స్థాయికి తగినట్లుగా మలిచి, ప్రసంగించారు.
డా॥ గొల్లాపిన్ని సీతారామశాస్త్రి (విశ్రాంత పిన్సిపాల్, పెనుగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల) దత్తశర్మను సభకో పరిచయం చేశారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ రామ్ కుమార్, పిన్సిపాల్ ఆదినారాయణరెడ్డి, అధ్యాపకులు శ్రీ ఖాదర్, శంకరయ్య, మొ॥వారు సభకు హాజరైనారు.
ప్రసంగానంతరం దత్తశర్మను కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.