[dropcap]మ[/dropcap]నిషిని మనిషి మనసుతో పలకరించుడే
మహా ఔషధం
సానుభూతితో కాదు
సహానుభూతిచే స్నేహిస్తే చాలు
అన్ని బాధలూ, సకల వ్యాధులు కడు దూరం
అనారోగ్యం చెలిమిలో తిరుగాడే మనిషి
చికిత్స అనంతర కాలంలో రూపాంతమైన ఋషి
విశ్రాంతి పర్ణశాలలోనే మనిషికి స్వస్థత
మనిషంటే
కనబడే శరీరమే కాదు
కనిపించని గేహం కూడా మిత్రమా!
ప్రేమ పొంగే పరామర్శలో
స్నేహం కట్టలు తెంచుకుంటుంది
మనసు ఉల్లాసం నొంద
ఉద్వేగం, ఉద్రేకం శూన్యత చేరుతుంది
పరుషములన్నీ సరళములుగా మారిన
మాటా మంతీ గుండె గొంతుకే
తవ్విపోసుకున్న బతుకులో
పరామర్శ
ఓ దీప స్తంభపు వెలుగు
మరో కదిలే మైలురాయి