Site icon Sanchika

పాట్లాడుకుందాం…

[box type=’note’ fontsize=’16’] తమ మధ్య మాటల్లేని ఓ జంట- పాటలతో జుగల్‌బందీ నిర్వహించిన వైనాన్ని వివరిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్ “పాట్లాడుకుందాం” రచనలో. [/box]

[dropcap]అం[/dropcap]దరు దంపతుల్లానే మా మధ్యా వాదోపవాదాలు జరుగుతాయి, మేమూ పోట్లాడుకుంటాం. ఏదో విషయంలో శుక్రవారం ఉదయం మాటామాటా అనుకున్నాం. అంతే మాటలు బంద్! శుక్రవారం గడిచిపోయింది, శనివారం సాయంత్రమయింది, రాత్రవుతోంది.. ఇంకా మాట్లాడుకోడం లేదు. మా మధ్య ఈ మౌనం ఎప్పటికన్నా ఎక్కువ సేపు కొనసాగడంతో, నేనే ఐస్‌ని బ్రేక్ చేయాలనుకున్నాను. ఏడున్నర అవుతోంది. “పలుకే బంగారమాయనా…” అని పాడుతూ, “టీ తాగుదామా?” అని తనని అడిగాను.

నాకేసి అదోలా చూసింది, “అన్నం తినే టయిమవుతోందిగా… ఇప్పుడెందుకు?” అంది.

“చెప్పాలనుకున్నది చెప్పేయడానికి, మాట్లాడేందుకు మంచి సమయం ఆ కంపెనీ వాళ్ళ టీ తాగే సమయం… ఈ యాడ్ గుర్తు లేదా?” అన్నాను.

ఇంతలో నా సెల్ మ్రోగింది. “మాటల్లేవ్…. మాట్లాడుకోడాల్లేవ్…” అంటూ రింగ్ టోన్ గర్జించింది.

“మాటల్లేనప్పుడు టీ ఎందుకట?” అంటూ మా ఆవిడ మూతి విరిచి వంటింట్లోకి నడిచింది.

మనం పాట్లాడుకుందాం….” అని అరిచా తనకి వినబడాలని. మొబైల్‌ని సైలంట్ మోడ్‌లో ఉంచాను.

టీ తీసుకొచ్చి అందిస్తూ, తనేదో మాట్లాడబోయింది.

“ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి” అన్నాను పిఎస్‌పికె గబ్బర్ సింగ్ స్టయిల్లో.

ఒకటి రెండు నిమిషాలు ఆలోచించి, “होंठों में ऐसी बात मैं दबाके चली आई खुल जाये वोही बात तो दुहाई है दुहाई” అంది.

“ఆహాఁ…” అన్నాను.

“ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి” అంటూ రిటార్ట్ ఇచ్చింది.

మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది… మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది… అంతులేని అనుభూతులు గొంతు దాటగా….” అని నేను పాడుతుండగా… అడ్డొస్తూ

ఇది పాట కానే కాదూ….” అంటూ రాగం తీసింది.

“సినిమా పాట కాదులే… కానీ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమానికి బ్యాక్‍గ్రౌండ్ సాంగ్…”

“కుదరదు…”

“ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావ్…” అన్నాను.

ఏమని పాడెదనో ఈ వేళ… మానసవీణ మౌనముగా నిదిరించిన వేళ…

మనసా వాచా నిన్నే వలచా… నిన్నే ప్రేమించా… నిన్నే తలచా నన్నే మరిచా…” పాడాను.

మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా…. మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా…”

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది” అన్నాను చిరంజీవిలా.

सुबह और शाम काम ही काम क्यों नहीं लेते पिया प्यार का नाम…. काम से किस को मिलेना छुट्टी…

बात-बात में रूठो नअपने आप को लूटो न

किताबे बहुत सी पढ़ी होंगी तुमने मगर कोई चेहरा भी तुमने पढ़ा है

पढ़ा है मेरी जां, नज़र से पढ़ा है” పూరించాను.

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను…”

మౌనమే.. ప్రియా ధ్యానమై.. మౌనమే.. ప్రియా ధ్యానమై..” వేటూరి పాటెత్తుకున్నాను.

“మాట్లాడాలంటూ మౌనం ఎందుకు?” అంది.

“మాట్లాడాలంటే మౌనం వీడాలిగా….” అన్నాను.

“ఓహో…. సరే… మౌనమేల నోయి ఈ మరపురాని రేయి… ఇక  మౌనమేల నోయి…” పాడింది.

మాట రానీ మౌనమిది.. మౌనవీణ గానమిది… గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది…”

అని పాడుతూనే తను తరువాతి పాట ఏది పాడుతుందో ఊహించాను. అదే పాడింది…

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం… ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం

మనసులో ధ్యానం మాటలో మౌనం …. మనసులో ధ్యానం మాటలో మౌనం …. ” నేనుందుకున్నాను.

మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది” అంది.

ఆ పాట, గోరింటాకు సినిమాలో ఆ సన్నివేశాలు కళ్ళముందు మెదిలి కాసేపు మౌనంగా ఉండిపోయాను.

“ఒక్క పాటతో ఎన్ని జ్ఞాపకాలో కదా…” అన్నాను.

कितनी बातें याद आती हैं तस्वीरें सी बन जाती हैं मैं कैसे इन्हें भूलूँ दिल को क्या समझाऊँ” లక్ష్య్ సినిమాలో పాటందుకున్నాను.

ये तुम्हारी मेरी बातें हमेशा यूँही, चलती रहें ये हमारी मुलाक़तें हमेशा यूँही, चलती रहें” ‘రాక్ ఆన్’ సినిమాలో పాట అందుకుంది.

बीते यूँही अपने सारे दिनरात बातों से निकलती रहे नयी बात” అదే పాటలోని తర్వాతి లైన్ నేను పాడాను – అద్భుతమైన లిరిక్ అందించిన జావేద్ అఖ్తర్‍కి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ.

తనూ కాసేపు మౌనంగా ఉండిపోయింది.

మాట చాలదా..మనసు చాలదా.. మాటలోని మనసులోని మమత తెలియదా” పాడింది.

చెప్పనా చెప్పనా చిన్న మాట” అంటూ ఆపాను.

చెప్పుకో చెప్పుకో ఉన్న మాట” అంటూ తను పూర్తి చేసింది.

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు…” బాలుగారి బ్రీత్‌లెస్ పాడాను.

ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట” అంది.

ఒక్క క్షణం నాకర్థం కాలేదు. తరువాత స్ఫురించింది, అది దొంగరాముడు సినిమాలోని చిగురాకులలో చిలకమ్మా పాటలోనిదని.

ఎదలో గానం పెదవే మౌనం  సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో” పాడింది.

మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా” పాడాను.

పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది…  మౌనమే గానమై మధుమాసవేళలో…” పాడింది

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపున ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా” పాడాను.

నీవు నా ఊహలందే నిలిచావు నేను నీ కళ్ళలోనే వెలిశాను…” పాడింది.

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా” ఈ సారి చక్రి పలికాడు నా గొంతులో.

మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము” అందుకుంది తను.

ఇది కళ్యాణం కమనీయం జీవితం…” పూరించాను.

నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయచూచి – నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయచూచి …. మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి…” అంటూ మిగతా పాటని హమ్ చేసింది.

మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి” పాడాను.

ఎందుకో ఫక్కున నవ్వింది.

ఉన్నమాట విన్నవిస్తా… నువ్వు నమ్మనంటే ఒట్టు వేస్తా…” పాడాను.

మాటల్తో కోట కట్టాడే నా మహరాణీ నీవన్నాడే…” అంటూ సాగదీసింది. కొంచెం ఉడుక్కున్నాను.

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే… ఆడువారి మాటలకు అర్థాలే వేరులే” మిస్సమ్మ పాట పాడాను.

చక్కని మాట చెబుతాను బుల్లోడా… చక్కెర నోట్లో పోస్తావా పిల్లోడా…” అంది మా జయప్రద.

నెలతా ఇటువంటి నీమాట నీదు పాట

నీ వలపు చూపు నీ నడల్

నెమ్మి వినగ కనగ దొరకునే సామాన్య కాముకునకు..

నీ వలపు చూపు దొరకునే బహుతపంబులు గావించి బడయకున్న” సీతారామ కళ్యాణం సినిమాలోని పద్యం… నా నోట వచ్చింది.

మనసు మాట కాని వేళ మాట విన్న మనసు వేళ” అంటూ పాడింది.

ట్యూన్ ఎక్కడో విన్నట్టనిపించింది గాని సినిమా పేరు గుర్తు రాలేదు. అడిగాను, చెప్పింది… సందీప్ కిషన్ సినిమా ‘నగరం’లో పాట అని.

जब कोई बात बिगड़ जाये जब कोई मुश्किल पड जाये तुम देना साथ मेरा, ओ हमनवा” పాడాను. ఓ గొప్ప పాటని అందించిన ఇందీవర్‌కి ధన్యవాదాలు తెలుపుకున్నాను.

ఉన్నట్టుండి నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరం కొన్ని క్షణాలు ఒకరి సమక్షాన్ని మరొకరు ఆస్వాదించాం.

అనకు… ఆ మాట మాత్రం అనకు ఇది ఆఖరి మాటని అనకు నీ మనసు మూసి వేశాననకు నా మాట మరచిపోతాననకు

ఒక్క క్షణం పాటు నా మనసు మొద్దుబారిందా పాటకీ, భావానికి.

నీకు నేను నాకు నువ్వు ఒకరికొరం నువ్వు నేను…” కులశేఖర్ పాట పాడాను

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి… ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి…” అంది రాగయుక్తంగా.

తృప్తి నిండిన మనసులతో మా జుగల్‌బందీ ముగించాం.

మొబైల్‌ని నార్మల్ మోడ్‌లోకి మార్చి, లాప్‌టాప్ ఆన్ చేసి మా ఫేవరెట్ పాటల ఫోల్డర్‌ తెరిచి, ప్లే అల్ నొక్కాను…. సీతామాలక్ష్మి సినిమా పాట మొదలైంది.

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే

కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే

ఏ పాట నే పాడను… బ్రతుకే పాటైన పసివాడను

ఏ పాట నే పాడను… బ్రతుకే పాటైన పసివాడను

ఏ పాట నే పాడను…

ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా మాకిష్టమైన మెలోడీలను విన్నాం. మా గదిలో స్వర రాగ గంగా ప్రవాహం పొంగిపొర్లింది, మా మదిలో మాధుర్యం ఓలలాడింది.

Exit mobile version