[dropcap]రం[/dropcap]గంపేటలో రంగయ్య – రంగవ్వ అనే దoపంతులు ఉండేవారు. వీరు ఒక పూరి గుడిసెలో నివసించేవారు. వీరికి శ్రీలత ఏకైక సంతానం. పాపం రంగయ్య ఆరోగ్యం బాగోలేక మంచానికే పరిమితం అయినాడు. రంగవ్వ బిక్షాటనo చేస్తూ కుటుంబాన్ని నడిపేది. శ్రీలతకు చదువు అంటే చాలా శ్రద్ద, బాగా చదివేది. కానీ పాఠశాలకు తమ పేదరికo కారణంగా చినిగిన దుస్తులతో,పుస్తకాలు,పెన్నులు లేకుండా వెళ్ళేది.
విధ్యార్థులందరూ శ్రీలతను ఈసడిoచుకుని, తరగతిలోకి రానివ్వకుoడా వరండాలో కూర్చోపెట్టేవారు. ఇది అవమానంగా భావించేది శ్రీలత. ఒకరోజు దొంగతనాలు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి, అర్దరాత్రి వేళలో ఇళ్ళలో దొంగతనాలు చేయడం ప్రారంభించిoది. దొంగిలించిన డబ్బులతో మంచి బట్టలు,పుస్తకాలు ,పెన్నులు కొనుక్కునేది.
ఇలా రోజు రాత్రులలో దొంగతనాలు చేస్తుoడగా ఒకసారి పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. జైలు అధికారి ఎందుకు దొంగతనం చేశావు అని అడిగితే శ్రీలత తన గురించి మొత్తo చెప్పింది. అందుకు ఆ జైలు అధికారి శ్రీలతను తన ఇంటికి తీసుకెళ్ళాడు. మంచి పాఠశాలలో చేర్పించి మంచి బట్టలు, ఆహారం అందించి సొంత కూతురులా చూసుకున్నాడు. అందుకు కృతజ్ఞతగా శ్రీలత బాగా చదివి పదవతరగతిలో జిల్లాలోనే మొదటి స్థానం పొందింది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రీలతను అభినందించి, ఉన్నత చదువులు చదివించడానికి ముందుకు వచ్చాడు. శ్రీలత కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మండల అభివృద్ధి అధికారినిగా కొలువు సాధించి, తనలాంటి పేద విధ్యార్థులను చదివించి గొప్ప వారిగా తీర్చిదిద్దిoది.
పి .శ్రుతి, 9వ తరగతి
zphs.లక్ష్మీదేవి పల్లి,
మండలం: నారాయణరావు పేట, జిల్లా: సిద్దిపేట