అనుకోని అతిథి : పేయింగ్ గెస్ట్

1
2

[dropcap]సి[/dropcap]న్మాల్లో చాలా జాన్రలున్నాయి. వాటిలో ఒకటి హారర్/సస్పెన్స్ జాన్ర. ఈ వారం అలాంటిదే ఒక పాకిస్తానీ లఘు చిత్రం “పేయింగ్ గెస్ట్” చూసాను.
సంధ్యా సమయం. చీకటి ఇంకా పడలేదు. అది కాస్త నిర్మానుష్యంగా వున్న ప్రాంతం లానే అనిపిస్తోంది చూడటానికి. ఒక పెద్ద బంగళా. లోపల లేత పసుపుపచ్చ లైట్లు వెలుగుతున్నాయి. వాకిటి తలుపు దగ్గర ఓ యువకుడు నిలబడి వున్నాడు. రెండు మూడు సార్లు బెల్లు కొడితే తలుపు తెరుచుకుంటుంది. ఓ అందమైన పడుచు అమ్మాయి తలుపు తీసి పేరూ వివరాలు అడుగుతుంది. తను ఇక్బాల్ (సైఫీ హాసన్) గురించి వచ్చానని చెబుతాడు. అతని పేరు వకార్ (మునీబ్ బుట్) అనీ, అతన్ని సిరాజ్ పంపించాడనీ తెలుస్తుంది. అతను ఆ ఇల్లు చూడటానికి వచ్చాడు, నచ్చితే తీసుకుంటాడు. ఆ అమ్మాయి (నొరీన్ గుల్వాని) లోపలికి వచ్చి ఇల్లు చూడమంటుంది. అయితే అదంతా ఒక రొమాంటిక్ చిత్రం లో లాగా, నేపథ్యం లో “ఆ భీ జాయియే, ఆ జాయియే” అన్న పాట hush tone లో వినిపిస్తుండగా జరుగుతుంది. వయ్యారంగా నడుస్తున్న ఆమె వెంటే మంత్ర ముగ్ధుడిలా నడుస్తాడు. ఇద్దరి మధ్య సంభాషణా చతురంగా వుంటుంది. అక్కడొక అందమైన స్త్రీ పేంటింగ్ వుంటుంది. దాన్ని తడుముతూ చాలా బాగుంటుంది అంటాడు. ఆ చిత్రం ఈ ఇంట్లోనే వున్నది, మేమొచ్చేనాతికి. బాగుందని అలా వుంచేశాము అంటుంది. కాసేపు తర్వాత టీ తీసుకుంటారా అని అడుగుతుంది. అతను సరేననటంతో లోనికి వెళ్తుంది టీ తేవడానికి. అతనక్కడ కూర్చుని బల్ల మీద వున్న ఓ హారర్ నవల తీసి తిరగేస్తాడు. ఈ లోగా లోపలినుంచి ఏవో శబ్దాలు వినిపిస్తే లేచి నిలబడతాడు. ఆ తర్వాతి కథ మీరు యూట్యూబ్ లోనే చూడండి.


ఒక హారర్ చిత్రం లో లొకేషన్, పాత్రల నటన, సంభాషణ, నేపథ్య సంగీతం అన్నీ తమ వంతు పని చేస్తేనే అది రక్తి కడుతుంది. ఇందులో అన్నీ చక్కగా కుద్రాయి. ముగ్గురు నటులూ బాగా చేసారు. ఇక చాయాగ్రహణంలో కలర్ స్కీం బాగుంది. సగం చిత్రం ఆరెంజి లాంటి రంగులో వుంటే, తర్వాతి సగం గ్రే కలర్ లో వుంది. అవైస్ సులామాన్ దర్శకత్వం బాగుంది. సస్పెన్స్ చిత్రాలు మెచ్చేవారికి ఇది నచ్చుతుంది.

~ ~

యూట్యూబ్ లింక్:
https://youtu.be/D0Y9L8cM2rE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here