[dropcap]పి[/dropcap]ల్లలారా పిడుగుల్లారా
రేపటి భారత పౌరుల్లారా
మందే లేని రోగం కరోనా
ప్రపంచమంతా హైరానా
చేతులు శుభ్రం చేసుకుని
నోటికి మాస్కు వేసుకుని
స్వీయ రక్షణ అనుసరించు
ముందు జాగ్రత్త అవలంభించు
జ్వర లక్ణణం సోకిందా
దగ్గు జలుబు నీకుందా
నిర్లక్ష్యాన్ని విడనాడు
వైద్యుని వద్దకు పరుగులిడు
ఇంటి బయటకు రావద్దు
వీధుల వెంట తిరుగొద్దు
కరచాలనం అసలే వద్దు
నమస్కారమే ఎంతో ముద్దు
పెద్దల సలహా పాటించు
కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించు