Site icon Sanchika

‘పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ’ – వ్యాసాలకు ఆహ్వానం

[dropcap]“ప్రే[/dropcap]మ పెళ్ళే పెళ్ళి. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ప్రేమ వుండదు. కాబట్టి పెళ్ళికి ముందే ప్రేమించి పెళ్ళి చేసుకోవటమే ఉత్తమం. పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకుంటే మరీ మంచిది. పారిపోయి చేసుకుంటే ఇంకా మంచిది” ఇలా ప్రచారం చేస్తూ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళల్లో ప్రేమ వుండదని, ఏదో విడవలేక కలసివుంటారు, తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా అనీ చేస్తున్న ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే, సవ్యంగా సంసారం చేస్తున్నవారు కూడా తెలియని అసంతృప్తికి గురవుతున్నారు. మానసిక వేదనను అనుభవిస్తూ న్యూనతాభావానికి గురవుతున్నారు. ఇది వారి మానవ సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది.

సమకాలీన సమాజంలో నెలకొని వున్న ఈ పరిస్థితిని గమనించిన సంచిక ఒక ప్రయోగం చేస్తోంది.

అరేంజ్డ్ మేరేజ్… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకున్న వారందరినీ ఆహ్వానిస్తోంది.

సంచికతో మీ పెళ్ళి ముచ్చట్లు పంచుకోండి. పెళ్ళి ఎలా కుదిరింది? ఆ సమయంలో మీ భావాలేమిటి? ఒకరిని చూసి ఒకరెలా భావించారు? ఏ రకంగా దగ్గరయ్యారు? పెళ్ళి తరువాత మీలో కలిగిన భావాలేమిటి. అనురాగం ఎలా జనించి, విడదీయరాని బంధంగా మారింది? ఎలాంటి ఒడిదుడుకులనెదుర్కున్నారు? కలసి ఎలా కష్టాలనెదుర్కున్నారు? సుఖంలో ఎలా ఆనందించారు? వంటివి వివరిస్తూ…. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటో వ్యాస రూపంలో వివరించాలి….

ఇది భార్యాభర్తలిద్దరూ కలసి రాయాల్సిన శీర్షిక. ఎలాంటి అతిశయోక్తులు, వర్ణనలు లేకుండా సూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా మీ ప్రేమ కథను పంచుకోండి. పెళ్ళి తరువాత ప్రేమలోని మాధుర్యాన్ని తెలియచెప్పండి.

మీ అనుభవం రాసేందుకు నిడివి పరిమితి లేదు. రీడబిలిటీ వుండాలి. భార్యాభర్తల పెళ్ళి ఫోటోతో పాటూ ప్రస్తుతం వారి కుటుంబం ఫోటో, పిల్లలు, ఒకవేళ జాయింట్ ఫామిలీ అయితే కుటుంబ సభ్యుల ఫోటోలూ జతపరచాలి. వెంటనే పంపండి. ప్రచురణార్హమైన రచనలను తదుపరి సంచికలో ప్రచురిస్తాము. ఇలా ఒక నెలలో ప్రచురితమయ్యే అనుభవాల్లో… ఉత్తమంగా అనిపించిన అనుభవానికి (వ్యాసానికి) సంచిక తరుఫున బహుమతి వుంటుంది….

ఇంకేం… పెళ్ళి తరువాత  ప్రేమ స్వరూపాన్ని వివరించండి…

Exit mobile version