పెళ్లి పత్రిక

1
2

[dropcap]సి[/dropcap]రా ఆగే దాకా
అక్షరాల పయనం
మధ్య మధ్య నుడికారం
అందమైన పదాలకు సిరి అలంకారం!
యాభై ఆరు అక్షరాల సందడి
మంగళ వాయిద్యాలను మరిపిస్తూ
దీర్గాలు మఖమల్ వస్త్రంలా పరుచుకుంటుంటే
ఏత్వాలు ఏనుగు అంబారీనెక్కి నడుస్తుంటే
ఒత్తులు రాజసంతో ఊగుతుంటే
ఆ వర్ణాల ముచ్చటాట తెలుప తరమా!
అచ్చులు ఆడ పెళ్లి వారు
అంటే ప్రియ ప్రాణములు
హల్లులు మగ పెళ్లి వారు
అంటే ప్రియత ప్రాణులు
రాసేది వరుడైతే
రాయించేది నవ వధువు!
వారిరువురి శుభ మందహాసాలు
ఈ మంగళ ముహూర్తానికి ఆద్యాలు
పసుపు అద్దిన పత్రిక
కుంకుమలు కూర్చిన అర
నలుదిశలా ఉన్న పేరెంటాళ్లకు నిమంత్రణం
పసుపు, కుంకుమ కలిపిన గంధపు సువాసనం
బంధు మిత్ర సపరివార రాకకు శ్రీకారం!
~ పెళ్లి పత్రిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here