[dropcap]పెం[/dropcap]దోట బాల సాహిత్య పీఠం మరియు శ్రీ వాణి సాహిత్య పరిషత్ వారు 28/08/2022 న సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ఆర్సీ కృష్ణస్వామిరాజు రచించిన ‘రాణి గారి కథలు’ పుస్తకానికి పెందోట బాల సాహిత్య పురస్కారం అందజేశారు.
కార్యక్రమ నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు, మొలక పత్రిక సంపాదకులు టి.వేదాంత సూరి, సాహితీ ప్రియులు పర్కపల్లి యాదగిరి, ఎం.మురళీధర శర్మ, డాక్టర్ సామ సువర్ణా దేవి, డాక్టర్ సిద్దంకి యాదగిరి, రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, ఐతా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.