Site icon Sanchika

ఫోటోగ్రాఫర్

[dropcap]బ్ర[/dropcap]హ్మ ముహూర్తం గురించి అందరూ గొప్పగా చెబుతారు. అది మంచి ముహూర్తం అని, అప్పుడు చేసే ఏ పని అయినా చక్కగా కుదురుతుంది అని; అప్పుడు చదివితే విద్యార్థులకు మంచి విద్య వస్తుంది అని; ఇంటి గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు ఒక్కటేమిటి అన్నిటికీ బ్రహ్మ ముహూర్తం బహు బాగా వర్తిస్తుంది అని పెద్దలు చెప్పగా వింటూ పెరిగాను.

ఇంతకూ చెప్పనే లేదు కదూ నా పేరు రవి. సూర్యోదయ సమయాన పుట్టానని, నాకు ఆ పేరు బహు చక్కగా ఉంటుంది అని ఆ పేరు పెట్టారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక్క నాడు కూడా సూర్యోదయాన్ని నేను చూసి ఎరగను. ఎప్పుడూ అర కొర మార్కులు చదువు బండిని లాగుతూ టెన్త్ క్లాస్ ముగించేటప్పటికి తెల్లవారింది. ఇంతలో నాన్న బైక్ మీద నుంచి పడి, కొన్ని నెలల తర్వాత ఆయన మరణించారు.

ఒక్కసారిగా నా జీవితం స్తంభించిపోయిన ఫీలింగ్ కలిగింది. నాకు చదువు వంటబట్టలేదు, కనీసం నాకు ఇష్టమైన ఫొటోగ్రాఫర్ కావాలన్నది నా కోరిక. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోలు తీయడం అనేది పెద్ద సరదాగా ఉండేది. ఎవరు అడిగినా వారికి శ్రమ లేకుండా ఫోటోలు తీస్తూ వారి నవ్వులాట చూడటం నాకు పిచ్చ క్రేజ్‌గా మారింది. ఇంటిని నడపడానికి అమ్మకు నాన్న ఉద్యోగం దొరికింది. అమ్మ చదివింది తక్కువ అయినా ఆమెకున్న చలాకీతనం వల్ల ఎలాగో పనిని నేర్చుకొంది, మేం జీవితం వెళ్ళబుచ్చసాగాము. చివరకు అమ్మ నన్ను ఫోటోగ్రఫీ కోర్సులో చేర్పించింది. అంతే ఒక్కసారిగా నాకు రెక్కలు వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది.

అమ్మ కొత్త కెమెరా మరియు బైక్ కొనిచ్చింది. నా జీవితంలో కొత్త మలుపు వచ్చింది. బైక్ పోయినంత వేగంగా నా మనసులోని కోరికలు వెళ్ళేవి. తొందరగా అన్నీ ఫోటోగ్రఫీ మెళకువలు నేర్చుకున్నాను. త్వరలో కొత్త ఫోటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలి అనే నా కోరిక తీరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాంకులో లోన్ తీసుకుని ఎలాగో ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టాను. నాకింద సహాయానికి అంటూ ఒక అబ్బాయిని కూడా పెట్టుకున్నాను. ఇదిగో ఇక్కడ రవి (ఇది సూర్యోదయం) నా జీవితంలో చూడటానికి అవకాశం కలిగింది. సాధారణంగా గృహ ప్రవేశాలు, పెళ్లి ముహూర్తం ఉదయాన్నే ఉంచుతారు. ఇప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ రవిని తిలకించ సాగాను. అరుణోదయాన్ని నా కెమెరాలో బంధించగలిగాను.

పెళ్లి రోజు బ్రహ్మ ముహూర్తంతో నా పని మొదలైంది అంటే సరిగా వేడి కాఫీ నిబ్బరంగా తాగటానికి టైం ఉండదు. కాఫీ వేడి తగ్గాక ముందు తాగే లోపు పెళ్లి కూతురు ముసిముసి నవ్వుల ఫోటో తీయాలనే తపనతో కాఫీ కప్ దూరంగా ఉంచా. ఇంతలో కాశీయాత్రకు పెళ్ళికొడుకు వెళుతున్నాడు, ఇంతలో నా అసిస్టెంట్ వచ్చి “టిఫిన్ తిను, నేను చూసుకుంటా” అని అన్నాడు. కానీ కాశీ యాత్రలో గొడుగు పట్టుకొని ఉన్నప్పుడు తీసే స్పెషల్ ఎఫెక్ట్స్ నాకు వచ్చినట్టు వాడికి రావు అని, “తర్వాత తింటా” అని నవ్వాను. ఇలాగే తాళి కట్టేటప్పుడు, తలంబ్రాలు, సప్తపది అంటూ సరిగా భోజనం చేయటానికి వ్యవధి దొరకలేదు. వచ్చిన చుట్టాల నవ్వులు, గుసగుసల మధ్య వారి నవ్వుల జల్లులు నా కెమెరాలో బంధిస్తూ ఉండిపోయాను. ఇంతలో కన్నె పిల్లల హడావిడి చెప్పకనే నా చూపు వెళుతూ ఉండేది. పెళ్లి యజమాని మొహమాటానికైనా “వెళ్లి భోజనం చేయండి సార్” అని అన్నా కూడా ఊపిరి పీల్చుకోలేనంతగా బిజీగా ఉన్నాను. ఇంతకూ అమ్మాయి అప్పగింతలతో నా పని భారం తీరినట్టుగా కెమెరాను కూడా బ్యాగులో బంధించి ఇంటికి వచ్చి పడుకున్నా, కానీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిల నవ్వు ముఖాలు నిద్ర పట్టనివ్వటం లేదు.

మూడవ రోజు ఉదయాన్నే ఫోటోల కాపీలతో పెళ్లి ఇంటికి పోయిన నాకు బహు గొప్ప స్వాగతం దొరికింది. కొత్త జంటతో పాటు పెళ్లి పెద్దలు కూడా ఫోటోలను చూసి గొప్పగా అభినందించారు. వేడి కాఫీతో పాటు నాకు ఇవ్వవలసిన డబ్బుతో పాటు కొత్త పీనట్ చొక్కా కూడా పెట్టారు. పని అయిందన్న సంతోషంతో బైక్ ఎక్కి ఇంటికి రాసాగాను. ఫోటో తీసే కెమెరాను రూమ్‌లో పెట్టాలని రూమ్ లోకి వెళ్లి చూసా. అక్కడ టేబుల్ మీద పడిన పెళ్లి ఫోటోల నెగెటివ్స్ నా కాళ్ళ ముందు కనబడ్డాయి. అవి నెగెటివ్స్ అయినా వాటి నవ్వు ముఖాలు నా మనసులో బంధించి ఉన్నాయి అనే ఆలోచన వచ్చి నవ్వుతూ నిద్రలోకి జారుకున్నాను.

Exit mobile version