పిల్లల ఆట (ఇజ్రాయిల్ కవిత)

1
2

[యెహుదా అమిచాయ్ రచించిన ‘The Amen Stone’ అనే కవితని అనువదించి అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]మాధి శిలాఫలక శకలం నా ఎదురుగా ఉంది
దానిపై ‘తథాస్తు’ అని రాసి ఉంది
కొన్ని తరాల క్రితం నాశనం చేసిన యూదుల సమాధుల
శిలాఫలకపు త్రికోణపు ముక్క అది
వందల వందల సంఖ్యలో సమాధులు ముక్కలు
చిందరవందరగా అంతటా పరచుకుని ఉన్నాయి
అనంతమైన అన్వేషణతో నిండి ఉన్నాయవి
పేరు ఇంటిపేరును వెతుకుతోంది
మరణించిన రోజు, జన్మస్థలాన్ని వెతుకుతోంది
కొడుకు తండ్రిని అన్వేషిస్తున్నాడు
పుట్టిన రోజు ఆత్మతో కలిసి శాంతి పొందాలనుకుంటోంది
ఒకదానితో ఒకటి కలిసిన తరువాత పొందుతాయవి విశ్రాంతి
ఈ సమాధుల శకలం మాత్రం నా ఎదురుగా ప్రశాంతంగా ఉంది
అంటోంది ‘తథాస్తు’
ఓ మంచి మనిషి విషాదంతో రాళ్ళన్నిటినీ జమ చేశాడు
మరక లేకుండా వాటిని శుభ్రం చేస్తున్నాడు
వాటిని ఫోటోలు తీస్తున్నాడు
పద్ధతి ప్రకారం శకలాలను పేర్చి సమాధి తయారుచేశాడు
మరణించిన వాడు తిరిగి పునరుజ్జీవితుడైనట్టు
ప్రహేళికను మార్చినట్టు రాళ్ళను మార్చాడు
ఇదొక ఆట. పిల్లల ఆట.

~

మూలం: Yehuda Amichai

ఆంగ్లానువాదం: Chana Bloch

స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్


The Amen Stone
BY YEHUDA AMICHAI
TRANSLATED BY CHANA BLOCH
On my desk there is a stone with the word “Amen” on it,
a triangular fragment of stone from a Jewish graveyard destroyed
many generations ago. The other fragments, hundreds upon hundreds,
were scattered helter-skelter, and a great yearning,
a longing without end, fills them all:
first name in search of family name, date of death seeks
dead man’s birthplace, son’s name wishes to locate
name of father, date of birth seeks reunion with soul
that wishes to rest in peace. And until they have found
one another, they will not find a perfect rest.
Only this stone lies calmly on my desk and says “Amen.”
But now the fragments are gathered up in lovingkindness
by a sad good man. He cleanses them of every blemish,
photographs them one by one, arranges them on the floor
in the great hall, makes each gravestone whole again,
one again: fragment to fragment,
like the resurrection of the dead, a mosaic,
a jigsaw puzzle. Child’s play.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here