[dropcap]పి[/dropcap]ల్లలమండి పిల్లలం
వెన్నెల వాన జల్లులం
తెల్లని వన్నె మల్లెలం
అందాల హరివిల్లులం
మహిలో మేము జ్యోతులం
మమకారాల మాలలం
మిలమిల మెరియు తారలం
జలజల జారు ధారలం
ప్రగతికి మేము బాటలం
జగతికి మేము రాజులం
పరిమళించే తోటలం
పసిడి కాంతుల మూటలం
నిండు వెన్నెల తునకలం
పచ్చపచ్చని మొలకలం
తీపి ఊసుల చిలుకలం
మందహాసపు వెలుగులం
విశ్వమందున వేల్పులం
తల్లిదండ్రుల ఆశలం
మంచికి మేము మిత్రులం
భారతమ్మ సుపుత్రులం