Site icon Sanchika

పిల్లలు నేర్పే పాఠం

[శ్రీ పప్పు రామకృష్ణ రావు రచించిన ‘పిల్లలు నేర్పే పాఠం’ అనే బాలగేయం పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]ల్లలు ఎరుగని పరమానందం
ఎక్కడ దొరుకును చెప్పండి
కల్లలెరుగని పిల్లల కన్నుల
కనుపడు నిదిగో చూడండి
ఎల్లలు ఎరుగని..

ఉన్నది ఊరికి పంచి ఇవ్వడం
ఉన్నదెక్కడో చెప్పండి
తర తమ భేదం తెలియని పిల్లల
తనువుల ఉన్నది తెలియండి
ఎల్లలు ఎరుగని..

దుఃఖాలను మరి దూరం చేసే
దారి ఏమిటో చెప్పండి
పొరుగువాడిని ప్రేమించడమే
మించి ఏమి ఇక లేదండి
ఇది పిల్లలు నేర్పే పాఠం లెండి
పిల్లలు నేర్పే పాఠం లెండి
ఎల్లలు ఎరుగని..

Exit mobile version