పిట్టగోడ కథలు-2

0
2

[box type=’note’ fontsize=’16’] డాబా పైన పిట్టగోడ మీద కూర్చుంటే ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని కథలో… అంటూ చిన్ననాటి నేస్తాలను, ఊసులను గుర్తు చేసుకుంటున్నారు కవయిత్రి ఈ కవితలో. [/box]

[dropcap]నా[/dropcap] పేరు సీత నాతో పెట్టుకుంటే పెడతా వాత!
అంతలేసి గుడ్లేసుకుని
కాటుక కళ్లారా పెట్టుకుని
యెర్ర రిబ్బనుతో రెండు పిలకలు
నీలి రంగు ఫ్రాకు, తెల్ల చొక్కా
నుదిటి పై చిన్న శృంగార్ బ్రాండు బొట్టు
ఐదో తరగతికే ఆడ రౌడీలా
మారిపోయిందే అని ఆశ్చర్యపోయా
బెంచిపై ఎవరో కూచున్నారని ఆ వార్ణింగు
తప్పు తనది కాదు వాడిదే అని తేల్చేసా
సీతకే నా ఓటు వేసేసా
విసురుగా వచ్చి నా పక్కన కూచుంది
అమ్మ మీదొట్టు గుండె ఆగినంత పనైంది
నా మాడు పగులద్దేమోనని భయపడ్డ
చిన్నగా నవ్వింది
మా స్నేహానికి గట్టి పునాది పడింది
ఇద్దరి ఇళ్ళు ఇరవై గజాల దూరం
కలిసి బడికి వెళ్లి రావడం
ఆదుకోవడం అన్నీ కలిసే
పెంటయ్య దుకాణంలో మురుకులు కొనడం
రంగయ్య తోటలో బాదం కాయలు కొట్టడం
ఎవరి పెదవులు ఎర్రగా ఉన్నాయో చూసుకుని మురిసిపోవడం
రేగి పళ్ళ బండి వాడు, చెరుకు రసం కన్నయ్య
సీత కి నాకన్నా కొంచెం ఎక్కువ పళ్ళిస్తే
తనకి తెలీకుండా నే ఉడుక్కోవడం
పండగలకి పేడ తెమ్మంటే పోటీ పది మరీ సేకరించడం
స్కూలు మాస్టారు రిపోర్ట్ కార్డు ఇస్తూ, ఇద్దరికీ సమంగా మార్కులొచ్చాయి
మీ స్నేహం ఇలాగే వర్ధిల్లాలి అని దీవించడం
స్నేహం మమ్మల్ని చూసి ముచ్చట పడిందా
లేక మేమే స్నేహానికి దాసులమయ్యామా
పిట్టగోడపై ఆనుకుని గత అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నా
కళ్ళు చేమర్చేంత జ్ఞాపకాలుంటే జీవితమే ఒక జ్ఞాపకమవదా
నవ్వితే బుగ్గపై పడే గుంటలే ఆనందభాష్పాలవ్వవా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here