పర్యావరణం కధలు-1: ప్లాస్టిక్ భూతం

0
2

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా ప్లాస్టిక్ భూతం గురించి బాలల కోసం సరళమైన రీతిలో కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]త[/dropcap]రుణ్ క్లాస్ 6 స్టూడెంట్. వాళ్ళ స్కూల్లో ఎకో – ఫ్రెండ్స్ క్లబ్ గ్రూప్ వచ్చి పర్యావరణానికి, జీవులకు ప్లాస్టిక్ ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను తెస్తున్నదో వివరించారు. ముఖ్యంగా జలచరాలకు అంటే నీటిలో ఉండే జీవులకు. పిల్లలంతా ఆ వీడియో ప్రెజెంటేషన్ కుతూహలంతో శ్రద్ధగా చూసారు. మౌనంగా ఆలోచనల్లో మునిగిపోయారు. కొందరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నారు.

ఇంటికి వచ్చిన తరుణ్ స్కూల్లో జరిగిన విషయాలు నాన్నతో చర్చించాడు. హోమ్ వర్క్, డిన్నర్ చేసిన తరువాత కొద్దిసేపు టివి చూసి తన రూంలోకి వెళ్లి పడుకున్నాడు. డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు ఎవరో తట్టి లేపినట్లు అయ్యింది.

“ఎవరూ?” అని కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా పెద్ద డాల్ఫిన్ ఫిష్ కనిపించి ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్నాడు.

“తరుణ్! నాతో రా! వెల్దాము” అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే “ఎక్కడికి?” అన్నాడు.

“చెబుతాను రా!” అంది డాల్ఫిన్. వారిద్దరూ సముద్రతీరం దగ్గరకు వచ్చారు.

అక్కడ ఒడ్డున పడి ఉన్న కొన్ని పెద్ద చేపలు, ఒక పెద్ద డాల్ఫిన్ కనిపించింది. చుట్టూ జనాలు గుమిగూడున్నారు.

డాల్ఫిన్‌కి పెద్ద యాంకర్ హుక్, చేపలకు చిరిగిన చేపల వల చుట్టుకుని ఉన్నాయి.

“ఏమి జరిగింది? ఎలా జరిగింది? అర్ దే డెడ్?” అని అడిగాడు తరుణ్.

జనాలు పట్టించుకోలేదు.

“చనిపోయాయి” అని బాధతో చెప్పింది డాల్ఫిన్.

“ఎలా?”

“నీకు తెలీదా? మీ వల్లే. మీరు వాడే ప్లాస్టిక్ వల్లే” అంది కోపంగా

“మేమా?”

“అవును. మీరే.”

“రా! మీ వల్ల మా హ్యాపీ ప్రపంచం ఎంత డిస్టర్బ్ అవుతున్నదో చూపిస్తా” అంది డాల్ఫిన్.

తరుణ్ చేయిపట్టుకుని సముద్రంలోకి తీసుకెళ్లింది. తరుణ్ భయపడ్డా పట్టించుకోలేదు. ఎన్నడూ చూడని, ఊహించని సముద్రపు లోతుల్లోకి తీసుకెళ్లింది.

అంతా వింతగా, కొత్తగా, భయంగా అనిపించింది. రకరకాల రంగురంగుల చేపలు, పేరు తెలీని ఇతర జీవులు, వెలుగులు వెదజల్లుతున్నవి, సముద్రపు చెట్లు, పగడపు దీవులు, కొండలు, లోయలు అబ్బో! ఎన్నో! Wow అనుకున్నాడు తరుణ్.

ఇంతలో నీటిలో తేలుతున్న రంగురంగుల జెల్లీ ఫిష్ లాంటివి కనిపించాయి.

వింతగా కుతుహులంగా చూస్తుంటే “తరుణ్! అవేంటో తెలుసా?” అంది.

“జెల్లీ ఫిష్” అన్నాడు

“కాదు. సరిగా చూడు. మీరు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు. వేస్ట్.”

“ప్లాస్టిక్ వేస్ట్? సముద్రంలో ఎలా వచ్చింది?”

“ఎలా అంటే మీ అవసరం కోసం తయారుచేసి వాడిపడేసిన ప్లాస్టిక్‌ని అనేకరకాలుగా మా ప్రపంచం అదే సముద్రాలూ, నదులు, నీటిలోకి డంప్ చేస్తున్నారు. ఎక్కువగా వన్ టైం యూజ్ చేసేవే ఎక్కువ” అంది కోపంగా.

కొన్ని చేపలు నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ని ఫుడ్ అనుకుని నోరు తెరిచి తినడానికి ప్రయత్నిస్తుంటే “వద్దు. వద్దు. అవి ప్లాస్టిక్. ప్రమాదం” అని వెనక్కి పిలిచింది డాల్ఫిన్. అవి నిరాశతో ఆకలితో వెళ్లిపోయాయి.

“చూసావా మీరు పడేసిన ప్లాస్టిక్‌ని ఫుడ్/ఆహారం అనుకుని మా సముద్ర జీవులు తినడంతో, అవి గొంతులో, పొట్టలో ఇరుక్కుని, అరగక, తిండిలేక ఆకలితో నీరసించి చనిపోతున్నాయి. ఒడ్డుకు కొట్టుకువచ్చిన చేపలు చూసావుగా” అంది.

“అవునా? అయ్యో!” అన్నాడు తరుణ్

“నువ్వు చూసినట్లు జాలరులు/ఫిషర్ మాన్ పడేసిన వలలు, లంగరు హుక్కులు/యాంకర్ హుక్స్ లాంటి ఇతర పరికరాలు కూడా మా ప్రాణాలకు శత్రువులుగా మారుతున్నాయి. అటు చూడు” అంది.

నీటిమీద ఎగురుతూ చేపలను పట్టి తినాలని ట్రై చేసిన కొంగలు, ఇతర సముద్రపు పక్షులు కొన్ని నీటి పైన తేలుతున్న వలలో చిక్కుకుని గిలగిలకొట్టుకుంటున్నాయి.

వాటిని విడిపించటం ఎలా? అని కంగారుపడుతున్న డాల్ఫిన్ చూసి, తరుణ్ వాటిని బంధించిన వలను తప్పించాడు.

బ్రతుకు జీవుడా! అని ఆ బర్డ్స్ ఎగిరిపోయాయి ఆకలితో.

“నేను అనుకున్నంత బ్యాడ్ బాయ్ కావు నువ్వు” అని డాల్ఫిన్ మెచ్చుకుంది. తరుణ్ నవ్వాడు సిగ్గుగా.

“తరుణ్! దాదాపు 100 యియర్స్ బ్యాక్ మా సముద్రం/నీటిలో ఉండే జీవులకు జీవితం ఎంతో హాయిగా ఉండేది. అప్పుడు ప్లాస్టిక్ లేదు. ఎప్పుడైతే మీరు ప్లాస్టిక్ వాడకం ఎక్కువ చేసారో, వాడకుండా ఉండలేకపోతున్నారో మాకు బాధలు మొదలు అయ్యాయి. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాలు.  తరుణ్! ఒక ఇయర్‌లో మీరు తయారుచేసే ప్లాస్టిక్‌ని ఎలా కొలుస్తారో తెలుసా?”

“తెలీదు.”

“ఏనుగుల బరువుతో.”

“ఏనుగుల బరువుతోనా” అన్నాడు ఆశ్చర్యంతో

“ఒక ఇయర్‌లో తయారయిన ప్లాస్టిక్ 30 మిలియన్ ఏనుగులతో సమానమట.”

“ఓహ్ మై గాడ్” అన్నాడు తరుణ్

“ఇంకా చెబుతా విను. 1950 నుండి ఇప్పటివరకు ఒక బిలియన్‌కి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పడేసారు.  ప్లాస్టిక్ పర్యావరణంలో త్వరగా నశించిపోదని తెలుసుగా? నీటిలో పడేస్తున్నారు. కలుషితం చేస్తున్నారు. గాలి కూడా ప్లాస్టిక్కుని మోసుకొచ్చి వదిలిపెడుతుంది. దీనికి తోడు వాటర్ ట్రాన్స్పోర్ట్/షిప్స్, పడవలు పడేసే వ్యర్ధాలు మరిన్ని.”

“అవునా?”

“నువెప్పుడు ప్లాస్టిక్ నీళ్లలో వెయ్యలేదా?”

“వేసాను” అన్నాడు సిగ్గుగా.

“పసిఫిక్ సముద్రంలో గ్రేట్ ప్లాస్టిక్ గార్బేజ్ ప్యాచ్ ఉంది. టన్నుల కొద్దీ నీటి మీద తేలుతున్న ప్లాస్టిక్ షిప్స్, పడవలు ప్రయాణానికి/సెయిలింగ్‌కి ఇబ్బంది పెడుతున్నాయి. ఫ్లోటింగ్ ప్లాస్టిక్ డెబ్రీని/తేలియాడే ప్లాస్టిక్ వ్యర్ధాలను పర్యావరణ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ స్పియర్ అని పిలుస్తున్నారు. దీనివల్ల దాదాపు 4 లక్షల సముద్రపు పక్షులు, చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి.

సముద్రపు అలల తాకిడికి, రాళ్ల ఒరిపిడికి ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్‌ల అంటే ఇసుక రేణువులకంటే చిన్నగా మారి ఒడ్డున దొరికే చిన్న చేపలు, నత్తలు, ప్రాన్స్ లాంటివి ఆహారంతో కలిసిపోయి, వాటిని తినే మీ ఆహారంలో చేరి మిమ్మల్ని రోగాలకు గురిచేస్తున్నాయి. మేకింగ్ యు గైస్ సిక్ ఇన్ లాంగ్ రన్.

తరుణ్ 2050 నాటికీ సముద్రంలో చేపలకంటే ప్లాసిక్స్ ఎక్కువగా ఉంటాయట. దారుణం. మీవల్ల మేము త్వరగా చనిపోతున్నాము” అని కన్నీళ్లు పెట్టుకుంది డాల్ఫిన్.

అది చూసిన తరుణ్ డాల్ఫిన్ దగ్గరకు వెళ్లి నిమురుతూ “మై ఫ్రెండ్! మేము ఏమి చెయ్యలేమా?” అని అడిగాడు.

“చాలా చాలా చెయ్యవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాడకుండా ఉండలేరని తెలుసు. తగ్గించగలరు, పడేసే ప్లాస్టిక్కుని మళ్ళీ వాడండి. రీ యూస్, రీసైకిల్, రెడ్యూస్.

గ్వాటిమాల అనే చోట ప్లాస్టిక్‌తో ఇంటి ఇటుకలు, రోడ్లు, ఇంటి పై కప్పు రేకులు లాంటివి చేసి వ్యర్ధాలను తగ్గించటానికి ట్రై చేస్తున్నారు.

తరుణ్ భవిష్యత్తు/ఫ్యూచర్ మీదే. మీరే మమ్మల్ని, మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడాలి. లేదంటే మాకే కాదు మీకు ప్రమాదం. పద. ఆలస్యం అయింది. ఇంటికి వెళదాం” అంటూ తరుణ్ చేయిపట్టుకుని సముద్రం నుండి ఇంటిలోకి తెచ్చి దింపి వెళ్తూ “తరుణ్ మమ్మల్ని సేవ్ చేస్తారా?” అని దిగాలుగా అడిగింది.

“తప్పకుండా మై ఫ్రెండ్” అని హగ్ చేసుకున్నాడు

మెలకువ వచ్చి చూస్తే బెడ్ మీదఉన్నడు. కల కాదు కదా అనుకున్నాడు కానీ కాళ్ళకు ఇసుక అంటుకుంది.

సముద్రాలనూ, జలచరాలనూ ప్లాస్టిక్ భూతం నుండి సేవ్ చేద్దామా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here