Site icon Sanchika

పొద్దు పొడుపు వెన్నెల

[శ్రీమతి సుజాతకోకిల రచించిన ‘పొద్దు పొడుపు వెన్నెల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]తొ[/dropcap]లి పొద్దు పొడుపులో తొలి కిరణము
ప్రకృతిని మైమరిపించే శుభోదయము
వెచ్చని తొలిస్పర్శే మనిషికి ఆనందము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

అమావాస్య చీకటిలో మబ్బుల చాటున
చంద్రుడు గబుక్కున కనుమరుగాయన
ప్రేమజంటలకు చీకట్లే ఆనందమాయన
చూడ చక్కని తెలుగు సున్నితంబు

వెన్నెలలో వెలుగుల నక్షత్రాలు
వెల్లివిరిసిన ప్రకృతి సొగసులు
తనివితీరని వెన్నెల నయగాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

వెన్నెల రారాజు చంద్రుడట
దేనికి జంకనివాడు అతడట
వెన్నెల్లో మెరిసేతారల వెలుగంట
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పొద్దు పొడవుగా వస్తాడు
మబ్బుల చాటున చూస్తాడు
వెన్నెల వెలుగులు చూపిస్తాడు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

Exit mobile version