Site icon Sanchika

పొన్న చెట్టు కొమ్మమీద

[dropcap]పొ[/dropcap]న్న చెట్టు కొమ్మ మీద
పొగరు బోతు రామచిలక
పొంచి పొంచి చూస్తోంది
పొందుకై వేచి వుంది    ॥పొన్న॥

మదనుని తాపముతో
మధుర మధుర ఊహలతో
పరితపించి పోతోంది
పలవరించి పోతోంది    ॥పొన్న॥

ఉన్న ఒంపు సొంపులతో
తీపి వలపు భావనతో
రాగాలు తీస్తోంది
రాలుగాయి చిన్నది    ॥పొన్న॥

కులుకు కులుకు పలుకులతో
కొంటె కొంటె చూపులతో
చిలిపి పనులు చేస్తోంది
చిందులే వేస్తోంది    ॥పొన్న॥

రాతిరై పోయింది – చెలి
రానే వచ్చింది
రసికత చూపింది
రాసలీల చేసింది    ॥పొన్న॥

Exit mobile version