Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-10

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

అన్నమయ్య మూడవ భాగం:

పద్య రచనకు – పద రచనకూ భేదం:

పద్య రచన పద రచన
1 అక్షర చ్ఛందస్, మాత్రచ్ఛందస్ మీదనే ఆధారపడి వుంటుంది. కాని దాని భాగాల మీద కవికి దృషికి వుండదు ఉండక్కర్లేదు. అక్షర, మాత్రా గణ సంఖ్య ఖచ్చితంగా వుండే చాలు. మాటలు గానీ వాక్యాలు భావానుసారంగా ఎక్కడనైనా తెంచి పెట్టవచ్చు. ఎంత దూరమైన లాగవచ్చు. రాగం చేర్చుకుని పద్యాలు

చదివే రుచి గలవారు ఏ అక్షరాన్నైనా అర్థం చెడకుండా వుంటే సరి. ఎంత పొడవుగాన్నైనా సాగదీయవచ్చును. అంటే అందులో లయ బంధం లేదన్న మాట.

పదాలలో ఆ సౌలభ్యం లేదు. ఇక్కడ ప్రధానమైనవి పాదాలు, పాదమద్యాలు. వాటి అవాంతర ఖండాలు. మొత్తం తాళాల్ని గాక, దాని ఖండాలను కూడా ఆయా

జాతికి తగినట్లు ఒత్తి చూపెట్టవలెను. స్వరానికి శ్రుతి ఎంత ముఖ్యమో, తాళానికి లయ అంతే ముఖ్యం. కనుక తాళము యొక్క ఆది మధ్యాంతాలు కలసి వెనుక

ముందులు కాకుండా సాహిత్యాన్ని పదంలో నడప వలసివుంటుంది. ఆ విభాగాలను వినేవారికి స్పష్టంగా అందిచ్చే పని యతిప్రాసది.

2 యతిప్రాసలున్నాయనిపిస్తే చాలు అని లాక్షణికులు ఉదారంగా తృప్తి పడతారు. యతి ప్రాసలను స్పష్టంగా చూపవలె.

 

‘‘పెంవేదం దమకట్టి తక్కువలు రూపింపంగ నేలా విచారింపన్ వారికి మేలు సంధి” అని పద్యం ఈడ్చినట్లు ధారాళశైలిలో పదం రచింప వీలు లేదు. మరి

“కలలోని సుఖమైన – కలియుగమా, వెన్న

కలిలో నెక్కడిదె – కలియుగమా

కడిగడ గండమై కాలము గడపేవు

కడుగ కడుగ రొంపి – కలియుగమా

బడలిక వాపవు – పరయేదో చూపవు

గడిచేతి మును నీవు – కలియుగమా.

అన్న రీతిగా శబ్దం వాక్యాలు అమర్చవలసి వుంటుంది.

3 అధిక పదములు పునరుక్తులు నిరసించిన ఫరవాలేదు. అధిక పదములు, పునరుక్తులు వుంటాయి.
4 స్వతంత్రమైనవి, ధారాళరగ కల్గినవి. అర్థ భావాలకు అవకాశం వున్నది. అఖండత, వెశాల్యం, సూక్ష్మత వైవిధ్య గుణాలు కలిగినవి. అవి అన్నియు పద రచనలో చూపలేము
5 పద్యరచనలో అవకాశం లేదు రాగ, తాళాలు, అర్థం భావ భావనలు,

వర్చస్సు, శక్తి, ఆకర్షణ వున్నది.

ఈ రెండు రకాలు అనుభ వించడంలో ఈ దృష్టి భేదం చాలా ముఖ్యం.

వేంకటేశ్వరుడే పరమతత్వమనే నిశ్చలంబైన గట్టి నమ్మిక కలవాడు. ఆ మూర్తినే ఆది భౌతికమైన, ఆధ్యాత్మికమ్మెన సర్వ ప్రపంచంలోనూ, అంతర్భాగముగా బహిర్యామిగా భావించి, పూజించి, ప్రేమించి, కలహించి, ప్రాధేయపడి, ప్రార్థించి, పొగడి, తెగడి, అనుభవించి, ఏకీభవించి జీవితం లోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నిటా అతని బ్రతుకే బ్రతికిన వాడు. ఆ అనుభవాలన్ని మానసికంగా కాయికంగా మాత్రమే కాక, వాచికంగా కూడా అనుభవించినాడు. ఆ వాచికానుభావాలే ఆయన పదకవితలు.

ఈతని కవిత విషయ ప్రధానము కాక విషయి ప్రధానమైనది. అంటే ఇతర వ్యక్తుల కంటే వారి అనుభవాల్ని కంటే తన అంతరంగ బహిరంగానుభవాలనే ముఖ్యంగా వెలువరించేది. ఇది విషయ రచనకు వర్చస్సు నిచ్చే గుణం ఆర్జవం. ఆర్జవం అంటే తాను అనుభవించిన భావాలన్నీ వెలువరించే అకృత్రిమ స్వభావం. ‘హరి ముకుందిని గొనియాడు నా జిహ్వ నిను గొనియాడంగ నేరదెంతైన – నను నెట్లు పలికితీ నైచ్యంపు బలుకు’ అని సాళ్వనరసింగ రాయుని మాటను తిరస్కరించి, సంకెళ్లతో – చెఱసాల అనుభవించాడు. ఆ నిష్కల్మష భగవద్భక్తి బలం చేతనే ఆ సంకెళ్లను తెంచుకుని బైటపడినాడు.

ఆయన రచనలలో మనల్ని పరవశింపచేసే భావబలం, భాష తీర్పు, అనుభావాల లోతు – వైవిధ్యం ఇంకే పద కవి రచనలలో కానరాదు.

ఉదాహరణ: ‘పాపినైనా నా పాల గలిగి త్రోవ – చూపుమన్న నెందు జూపరు’ అనే పదం.

ఆశ, నిరాశ, నమ్మకం, సందేహం, తృప్తి, వేసట, కోపం, దీనత, దుఃఖం, ఆనందం మొదలైన భావాలన్నీ అన్నమయ్య పదాలలో స్థిరంగా ప్రతిఫలించాయి.

భక్తితోనే గాక శృంగారంలో కూడా అందెవేసిన చెయ్యి అతనిది అని చెప్పుటకు ఈ క్రింది ఉదాహరణ గమనిస్తే చాలు.

“నిను బాసిన యట్లు నెలతకు వియోగదశ లెన్నడను దోస విది యేమొ కాని”

ఇట్లే శ్రీ వేంకటేశ్వరుని డోలా విహారం, గుర్రపుస్వారి, గరుడ యాత్ర మొదలగు ఆటలన్నిటిని వట్టి వినోదాలుగా గాక విశ్వ లీలా విహారాలుగా కలిపి చిత్రించి అనుభవించినాడు అన్నమయ్య. మనం అనుభవించితే ధన్యులమౌతాము. ఈ పదాలు పాడుకోగలిగితే సరే. పాడలేని వారికిని పద్యాలుగా చదువుకొని ఆనందింప గలిగినంత స్వతంత్రమైన అర్థ భావ రచనల అందచందాలు నిండిన నిధులివి.

అన్నమయ్య – పురందర దాసులు:

అన్నమయ్య చరిత్రలో చిన్నన్న ఇట్లు వ్రాశాడు.

గద్య పద్యముల డెబ్బది రెండుమంది – యాద్యులచేఁ గొనియాడించుకొన్న

రసికుండ శ్రీపండరంగవిఠ్ఠలుఁడు – కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-

———————————–

ప్రతిలేని గతుల సంభావించె నపుడు (పుటలు 44-45)

~

దీనిని బట్టి వీరిరువులు కలసి వున్నది చారిత్రకస్తుతయే కాని ఈ ఉదంతమును సందేహిస్తూ వ్రాసిన శ్రీ పంచముఖి గారి వాదము సమంజసముగా తోచదు. వ్యాస రామ పురందర దాసుల జీవిత విశేషములను గూర్చి సంప్రదాయజులు పలువిధాలైన అభిప్రాయములు వెలిబుచ్చారు.

మాధ్వుడగు పురందరదాసు అన్నమయ్యను వెన్నుని గానె భావించి కీర్తించుట – పంచముఖిగారి అభిప్రాయం సరియైనదే కావచ్చు. “వ్యాసరాయలవారు దాసరెందర పురందర దాసరయ్య” అనియు, వారి రచనలను ‘పురందరోపనిషత్తు’ అని ప్రశంసించెను. అలాగే పురందరదాసు, కనకదాసు, విజయదాసాదులచే గూడిన దాస కూటముని కూడా నిర్వహించి పామర లోకమునకు గేయ రచనలు మూలమును, భక్తి భావ అను బిక్షను పంచిపెట్టారు. తాళ్లపాక వాగ్గేయకారులు అవతరించి ‘హరిదాస కూటము’ నిర్వహించినారు. అన్నమాచార్యులు ‘నీ దాసుండనై దాసరినైతి’ అనియు, ‘భువి హరిదాసులమని’యు తమ్ము తాము వర్శించుకున్నారు. తెలుగు దేశమందలి వైష్ణవ దాసరి భజన (హరిదాసు కూటము)లకు తాళ్లపాక వారే పితామహులు.

వైష్ణవ కూటములే ద్వైతులు. వ్యాసకూట సంప్రదాయం తాళ్లపాక వారు నిర్వహించిన దాసరి కూటములే – కర్ణాటక దాసుకూట సంప్రదాయమునకు దారి చూపినవేమో అనిపించును.

  1. పాండురంగ విఠలుని మీద వందలు కొలది పదములు రచించారు.
  2. అన్నమయ్య రచనలకు పురందర కీర్తనలకు భావమునందును పద ప్రయోగమునందును మాత్రమే గాక పదరచనా వైవిధ్యమందును, పద స్వరూపమునందును కూడా సామ్యమెంతో యున్నది. దీనికి భజనపరుల సాన్నిహిత్యమే కారణమని నా తలంపు.

అన్నమయ్య కీర్తన:

‘శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభా

శరణు రాక్షస గర్వ సింహార శరణు వేంకటనాయకా’

పురందర దాసుల వారి కీర్తన:

‘శరణు శరణు సురేంద్ర వందిత శరణు – శ్రీపతి సేవిత

శరణు పార్వతీ తనయ మారుతి శరణు వేంకటనాయకా’

‘తోడయ మంగళం’ అనబడు తొలిపాటలలో ఒక్కటిగా సర్వత్ర వ్యాప్తిలోనున్న ‘నారాయణతే నమోనమో – భవనారద పన్నుత నమెనమైనమః భవనారద పన్నుత నమెనమెన్నమః ధవనారద సన్నుత నమోనమో’ అను కీర్తన అన్నమయ్యది. అపుడు అది పాడి రాగం. ఇపుడు ‘మధ్యమావతి’.

‘నాద ప్రియతే నమో నమో’ – అను దానిని పురందర వారలయితే ‘నమో నమో’ పురందర దాసుల పదముగా కర్ణాటకులు కొందరు వాడుచున్నారు.

పురందర వారి అలంకారాదులను నేర్చుకొన్నపుడు

సరిగమ పదనిస – సనిదపమగరి

సరిగమరిదమప – సనిదప

మనుచు ప్రారంభకులు పాడుకొన్నట్లు చిన్నచిన్న ఉషాకళ్యాణమున వివరించాడు.

అన్నమయ్య ద్విపదను బట్టి చూడగా అన్నమయ్య మొట్టమొదట శృంగార సంకేర్తనములను, పిదప అధ్యాత్మ సంకీర్తనములను రచించినట్లు తోచును.

జయదేవుని కవితా ప్రభావము, తాళ్లపాక వారి కవితపై ప్రసరించినట్లే తాళ్లపాక వారి కవితా ప్రభావము తరువాతి క్షేత్రజ్ఞాదుల కవితపై ప్రసరించినది చెప్పవచ్చు.

అన్నమయ్య – క్షేత్రయ్య పదాలలో గల సాదృశ్యములు:

  1. ఇరువురి పదరచనలు బహువిధ శృంగార భావములను భిన్న నాయకావస్థలను చిత్రించి ప్రతిపాదించునట్టివే.
  2. స్వీయ నాయికకే ప్ర్రాముఖ్యం. పరకేయానాయికను గుర్చిన పదములు కొన్ని మాత్రమే గలవు .
  3. పదములు వ్రాయుటలో అలంకారశాస్త్రములోని ‘రసమంజరి’ లోని శృంగార ప్రధానములగు సర్వలక్ష ణములను వ్రాయుట క్షేత్రయ్య యొక్క అభిప్రాయమని తోచదు.
  4. నాయికావస్థలను చిత్రించు విషయంలో ఇద్దరి రచనలను బోల్చి చూచినపుడు భాషలోను పలుకుబడిలోను భావ ప్రకటన విధానములోము సామ్యము గోచరించును. సామెతలు, గ్రామోక్తులును, సహజమగు రీతి ఔచిత్యముతో ప్రయోగింప బడినది.
  5. శృంగార పదములు పెక్కులు. నృత్యాభినయములు అనుకూలమగు పద లాలిత్యము తోను సౌకుమార్యంతోను నొప్పినదివే. భావ ప్రదర్శన అనువుగ విలంబ గతిలో పాడదగినవే.
  6. పాట సంప్రదాయము కూడా ఇంచుమించుగా ఒకే తీరుగా యుండును. తాళ్లపాక వాడిన రాగములు, క్షేత్రయ్య కందని రాగ స్వరూపములు కొన్ని తాళ్లపాక వారు గుర్తించారు. ముఖారి, ఆహిరి, కాంభోజి ఇరువురు వాడిన రాగములే.

(ఇంకా ఉంది)

Exit mobile version