ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-14

0
2

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

నారాయణ తీర్థులు – రెండవ భాగం:

కృష్ణలీలా తరంగిణి యందు 12 తరంగములు కలవు. వాటి వివరాలు:

ప్రథమ తరంగము (కృష్ణ ప్రాదుర్భావము):

  • మంగళాచరణము
  • అధికారి నిరూపణము
  • ప్రబంధ ప్రతిపాధ్య కథా సంగ్రహం
  • అశరీర వాణి శ్రవణము
  • కంస ప్రతిజ్ఞ
  • దేవకీ వసుదేవుల కారాగార గృహప్రవేశము
  • భూదేవి భగవంతుని శరణంబు వేడుట
  • శ్రీమన్నారాయణు సన్నిధికి సనకాదులేతెంచుట
  • బ్రహ్మదులు భగవంతుని స్తుతించుట
  • కృష్ణావతార ఘట్టము
  • బ్రహ్మదులు కృష్ణుని నుతించుట
  • దేవకీ వసుదేవులు స్తుతించుట
  • వసుదేవుడు భగవత్ప్రేరణచే కృష్ణుని గోకులమున చేర్చుట – దుర్గా విలాసము

ద్వితీయ తరంగము (బాల లీలలు):

  • బాల లీలా కథాసంగ్రహము
  • నంద యశోదాదుల రామకృష్ణల లాలించుట
  • గర్గాచార్యుడు బాలురకు నామకరణం చేయుట
  • యమళార్జున భంజనము

తృతీయ తరంగం (గోవత్స పాలనము):

  • వత్స పాలనా వర్ణనము
  • రామకృష్ణులు గోవులను గాచుట

చతుర్ధ తరంగం (కృష్ణ గోపాల వర్ణనము):

  • కథాసంగ్రహము
  • బలరామ కృష్ణులు గోవులను పాలించుట
  • కాళీయ మర్దనము
  • కాళీయుని రక్షించుట
  • ఖరాది రాక్షసులను చంపుట
  • భాండీర వన వర్ణనము
  • ప్రలంబాషు బకాది వధ
  • దావానల భక్షణము

పంచమ తరంగం (గోవర్ధనోద్ధరణము):

  • గోపి వస్త్రాపహరణము
  • కృష్ణ గోపి సంవాదం
  • గోవర్ధనోద్ధరణం
  • ఇంద్ర కామదేనువులు శ్రీకృష్ణుని నుతించుట

షష్ట తరంగం (శ్రీకృష్ణ గోపి సమాగము):

  • కృష్ణ గోపి వర్ణన
  • శరదృతు వర్ణన
  • గోపిక అన్యోన్యము సరస సల్లాపంబులాడుట
  • కృష్ణుడు గోపికలకు నీతి మార్గము ఉపదేశించుట
  • గోపికలు కృష్ణుని నుతించుట
  • కృష్ణుని గోపికలు పరిగ్రహించుట

సప్త, అష్టమ తరంగములు (రాసక్రీడ):

  • తత్వోపదేశము చేయిట
  • రాసక్రీడా వర్ణన
  • గోపికా గీతములు
  • కృష్ణుని అంతర్ధానము
  • కృషుని అన్వేషణము
  • కృషుని సాక్షాత్కారము
  • రాధాకృష్ణుల సంవాదము
  • గోపికలు కృష్ణుని గూర్చి రాధని అడుగుట
  • రాధా గోపికలకు కృష్ణుని పరతత్వం చెప్పుట

నవ తరంగం (మధురా ప్రవేశము):

  • కంసాక్రూర సంవాదము
  • అక్రూరుడు బృందావనమున కేతెంచుట
  • అక్ళూరుడు కృష్ణుని సేవించుట
  • ఆక్రూరుడు రామ కృష్ణుల మేల్కొపుట
  • కృష్ణుడు తోడ మధురాపురికి వేంచేయుట
  • మధురాపురీ వర్ణన

దశమ తరంగం (కంస నిరూరణము):

  • మధురాపురీ పౌరస్త్రీలు రామ కృష్ణులను వర్ణించుట
  • కృష్ణుడు కుబ్జను అనుగ్రహించుట
  • కృష్ణుడు కువలయా పీడాదులు వధించుట
  • దేవతలు కంస సభను చేరిన కృషుని నుతించుట
  • కంస వధ
  • ఉద్ధవుడు గోపికల మాటలు కృష్ణనకెరింగించుట

ఏకాదశ తరంగం (ద్వారకా ప్రవేశము):

  • గోపికోద్ధవ సంవాదము
  • భ్రమక గీతలు
  • కాలయవనాది వధ

ద్వాదశ తరంగం (రుక్మిణీ కల్యాణము):

  • రుక్మిణీ మనో నిశ్చయము
  • రుక్మిణీ కృష్ణునకు పత్రిక పంపుట
  • రుక్మిణీ విరహము
  • రుక్మిణీ స్వయంవరము
  • లగ్నాష్టకము
  • రుక్మిణీ కల్యాణము
  • కృష్ణుడు జాంబవతి మున్నగు వారల పెండ్లి యాడుట
  • మంగళం

~

నారాయణ తీర్థులు – రాగాలు:

యదుకుల కాంభోజీ, కేదారం, ముఖారి, సావేరి, కాంభోజి, మధ్యమావతి, కురంజి, ద్విజావంతి, బిలహరి, మోహన, ఆనందభైరవి. సౌరాష్ట్రం, వరాళి, దేశాక్షి, ధన్యాసి, ఆసారి.

ద్విజావంతి కర్నాటక సంగీతంలోను, జయజయవంతి అని హిందుస్తానీ సంగీతంలో అంటారు. యక్షగానం పారిజాతాపహరణం కథ. యమకుల లేక యదుకుల కాంభోజి తత్త్వాన్ని బోధించే రాగం. జానపదం నుంచి పుట్టింది. యదుకుల అంటే గొప్ప జ్ఞాని అనే అర్థం.

రాగాలు – ప్రాముఖ్యత

కేదార గౌళ – రక్తిరాగం.

ముఖారి, సావేరి, వరాళి – కరుణ రస ప్రధానమైన భాగాలు

కాంభోజి – ప్రసిద్ధ రాగం. గోవింద ఘటయ తాళం (ఖండచాపు)

మధ్యమావతి – శుభప్రదమైన, మంగళకరమైన రాగం ( సర్వ స్వర మూర్ఛనాకార మేళం, గృహ భేద రాగం)

ఆ: స రి మ ప ని స

అ: స ని ప మ రి స

గృహ భేదం చేస్తే రాగాలు ఈ క్రింది విధంగా వుంటాయి.

మధ్యమావతి – స రి మ ప ని స

  • హిందోళ – ని స గ మ ద ని
  • శుద్ధ సావేరి – స ద స రి మ ప
  • ఉదయ రవిచంద్రిక – మ స ని స గ మ
  • మోహన – రి గ ప ద స రి

కొన్ని రాగాలు భక్తి, కరుణ, శృంగారంతో వుంటాయి.

~

యదుకుల కాంభోజీ – ఆదితాళము

ప॥

ఏహి ముదం దేహి శ్రీ కృష్ణ మాం

పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ

తా: శ్రీకృష్ణా! ఇటు రమ్ము ఓ గోపాలా, నాకానందమును గల్చించి నను రక్షింపుము.

1) నంద గోప నందన శ్రీ కృష్ణ కృష్ణ – యదు

నందన భక్త చందన కృష్ణ కృష్ణ

తా: నీ భక్తుల కానందము కల్గించుటకై యదువంశమున బుట్టియు నందుని భాగమున నిటకు వచ్చితివి. (ఇది యథార్థమును గ్రహించిన గోపిక యొక్క వాక్యమని చెప్పవలసియున్నది).

2) సాధు సాధు క్రుత మిహ శ్రీ కృష్ణ కృష్ణ – లోక

సాధక హితాయ శ్రీ కృష్ణ కృష్ణ

తా: కృష్ణా! నీవు చేసిన పని మిగుల బాగుగ వున్నది. సజ్జనుల కానందము (హితము) గల్పించుటయే కదా నీ పని.

3) నారదాది మునిగేయ శ్రీ కృష్ణ కృష్ణ – శివ

నారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ

తా: నీవు నారాయణ తీర్థుని మిగుల కరుణతో జూచుచుందువు. నారదాది ముహామునులందరు నెల్లప్పుడును నిను గూర్చియే గానము చేయుచుందురు.

~

కురంజి: ఈ రాగం కూడా జానపదం నుంచి వచ్చింది.

మోహన: బహుళ ప్రసిద్ధ రాగం. ఉత్తేజాన్ని కల్గించే రాగం. జాడవ రాగాలలో ఒకటి.

బిలహరి: ఉత్సాహ, రక్తి రాగం. కృష్ణ లీలలు, కృష్ణుని పొగడుతూ వ్రాసిన రచన. ‘పూరయ మమ కామం’ – ఆది తాళం. సాహిత్య అర్థాన్ని బట్టి ఈ రాగం ఎన్నుకున్నారు.

సౌరాష్ట్రం లేక సౌరాష్ట్ర: శుభప్రదమైన రాగం. కచేరి మొదలు, చివర పాడే రాగం. చివర మధ్యమావతితో కచేరిని ముగించుట అలవాటు, కాని అలాంటి అవసరం లేదు.

యమకుల కాంభోజి (చతుశృతి రిషభం) – ఏహి ముదం దేహి శ్రీ కృష్ణ మాం

దేవగాంధారి: శరణం భవ కరుణామయ – ఆది.

సౌరాష్ట్ర: శరణం భవ కరుణామయ – ఆది.

దేవగాంధారిలో చతుశృతి రిషభం. సౌరాష్ట్రంలో శుద్ధ రిషభం (రెంటికి ఈ వ్యత్యాసం వుంది.)

ఆనందభైరవి – దేవదేవం (శ్రీకృష్ణుని చూసిన ఆనందంతో చేసిన స్వర రచన).

మధ్యమావతి – గోవింద మహగోపికా, మరికొన్ని రాగాలలో కూడా పాడుతున్నారు.

కురంజి – జయ జయ గోకులబాల, భైరవి (రాగమాలిక)తో కూడా పాడుతున్నారు; చతురస్ర రూపకం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here