ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-6

0
2

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

వాల్మీకి:

వాల్మీకి జననం:

[dropcap]దే[/dropcap]వుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. లోకరక్షణ కొరకై అవతారములు ఎత్తాడు. సర్వశక్తిమంతుడు. ఆ అవతారములన్ని కూడా లోకోద్ధరణ కోసమే. అనంతం నుండి బయలుదేరి కిందకి దిగడం సాధ్యం కాదు. ఆ పరిస్థితులలో అట్టి సందేహములు నిండిన కాలంలో వాల్మీకి జననం అయింది.

గౌతమబుద్ధుడు ఎట్లు తపస్సు చేసి లోకమందలి దుఃఖము పోగొట్టే మార్గం ఏది అని విచారించి స్వాపజ్ఞ సిద్దాంతాన్ని, మతమును స్థాపించెనో అట్టి అవసరమే వాల్మీకికి ఏర్పడింది.

పరిపూర్ణతలో అతనికి సమాధానము దొరికింది, అది వృత్త రూపములో ఉంది. వ్యాసము పెద్దదిగానే చిన్నదిగాని కావచ్చు. కాని వృత్తము పరిపూర్ణమే. అలాగే మానవుడు పరిపూర్ణుడు కావచ్చు అను సమాధానం దొరికింది.

వాల్మీకి పూర్వులందరు సానిని కల్పింప ప్రయత్నించిరి. వాల్మీకి అలాగాక అపరిపూర్ణము నుండి పరిపూర్ణమును, నాది నుండి అనాదిని, కించిద్గుణ మందు నుండి సకల గుణ ముక్తుని ఊహించుటకు ప్రయత్నించెను. ఇతడు నేల నుండి నింగికి బయలుదేరెను. రెండు మార్గములు ఒకటిగావు. కాని మనకు పరిచితమైన విషయము నుండి అవిజ్ఞాతమైన విషయాన్ని ఉహించుట సులభము. అదే వాల్మీకి యొక్క పద్ధతి. సకల గుణగణములు కలవాడు రాముడొక్కడే అని వాల్మీకి విశ్వాసం. రామాయణం రచించుట అతని ప్రత్యేకత. అది ప్రత్యేక వ్యక్తియే నరదేవాదులను కొలుచుటకు ప్రత్యక్ష ప్రమాణము.

సృష్టిలో నాదం వుంది. దానిని స్వరబద్ధం చేసి తాళ గతులతో పలికించినప్పుడు సంగీతం అయింది. ఆ సంగీతములో సాహిత్యాన్ని కూర్చి ఆలపించినవారు వాగ్గేయకారుడు వాల్మీకి. ఆది కావ్యమైన రామాయణాన్ని గాన యోగ్యముగా రచించి లవకుశులచే గానము చేయించాడు.

రామాయణ ఆవిర్భావానికి సంబంధించి ఒక ఐతిహ్యము ప్రచారంలోవుంది. వాల్మీకి మొదట బోయవాడు. కుటుంబ పోషణార్థమై బాటసారులను దోచుకుంటూ సప్తఋషులనే దోచుకోవడానికి సాహసించాడు. వారు అతనికి జ్ఞానోదయము కల్పించాలని “ఎవరి కోసం నీవు ఈ పాపాలు చేస్తున్నావో వారు నీ పాపాలలో కుడా భాగం పంచుకుంటారేమో కనుక్కో” అన్నారు. వాల్మీకి ఆ విధంగా తనవారిని ప్రశ్నించగా వారెవరు ఆతని పాపంలో భాగాలు పంచుకొడాన్ని ఒప్పుకోలేదు. దానితో సంసారం పట్ల విరక్తి చెందిన వాల్మీకి మహర్షుల వల్ల జ్ఞానోదయం పొంది తపశ్చర్యకు పూనుకున్నాడు. ఏకాగ్రమైన, కఠిన తపస్సుతో ఆతని మనస్సులోని మాలిన్యాలన్నీ కరిగిపోయాయి.

నారదుని ఉపదేశంతో రామ మంత్రాన్నే జపిస్తున్న ఆ మహర్షి మనస్సు అభిరామ రామమందిరముగా రూపొందింది. వీతక్రోధుడు సమదర్శి అయిన ఆ మహర్షి అంతరంగాన్ని ఒక ఆర్తనాదం కదలించింది.

ఆ ఎలుగు ఏ దేవతలదో, ఋషులదో కాదు కనీసం మానవులదైనా కాదు, ఒక క్రౌంచ పక్షిది. పక్షియైనా ఆర్తనాదం చేస్తువుంటే కరుణతో కదలిపోయింది. ఋషి హృదయం ద్రవించింది. ఆ ముహుర్తంలోనే ఋషి లోని కవి కళ్ళు తెరిచాడు. అన్యాయంగా, నిష్కారుణంగా జతబాసి మనతేని పక్షి జంటను ఎడబాపిన బోయవానిపై ధర్మాగ్రహము, ఆ కవి వాక్కులోంచి సత్యస్వరూప ఆకర్షణీయమైన శ్లోకముగా వెలికురికింది. అదే

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః।  

యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం॥

తనకు కల్గిన బాధకు తను శోకిస్తే అది శ్లోకంగా మారదు. లోకం బాధ తనదిగా అనుభూతి చెందగల బుషితుల్యుడైన కవి శోకం శ్లోకంగా వ్యక్తమవుతుంది. ఇదే ‘మానిషాద’ అవతరణానికి ప్రాణభూతం. అప్రయత్నంగా తన నోట వెలువడిన శోకోద్దీప్త క్రోధ వాక్కులు లయాన్వితమై యుండటం గమనించి తానే నివ్వెరపోయాడు బుషి. తనలోని కవిని గుర్తించాడు. సాధించిన జ్ఞానం, వెలువడిన శ్లోకాన్ని విశ్లేషించుకొని అనుష్టుప్ ఛందంగా గుర్తించింది. గాన యోగ్యమైన సాహిత్యాన్ని సృష్టించిన ఆనందంలో తన కళాసృష్టి సార్థకం అయ్యేలా రామాయణ మహాకావ్యాన్ని ఆది ఛందస్సుతో రచించాడు. ఛేది అనే ధాతువుకు ఆహ్లదాన్ని కల్గించేది అని అర్థం. ఈ కారణం వల్లనే హృదయానికి ఆహ్లదం కలిగించే గాన యోగ్యమైన లయబద్ధమైన సాహిత్యగతికి ఛందస్సు అనే పేరు వచ్చింది. మనకు లభ్యమైనంతలో వేదాల తరువాత అనుష్టుప్ మొదటి ఛందస్సు. ఆది కావ్యం రామాయణం ఈ ఛందస్సుతో వ్రాయబడిన మొట్ట మొదటి కావ్యం.

లౌకిక వాఙ్మయమున వ్రాయబడిన ప్రథమ గ్రంథము వాల్మీకి రామాయణం అని చెప్పవచ్చు. వేదముల సారమే రామాయణం అనియు, అదియే వేదతుల్యమని భావించవచ్చు. రామాయణ కథ సంస్కృతముననే అనేక విధములైన దృశ్య శ్రవ్యములుగా రూపొందితమై ఇతర మహాకవికృతముగా కాళిదాసాదులచే వ్రాయబడింది.

బౌద్ధ, జైన, చార్వాకాది ప్రస్థానములందును రామాయణం ప్రస్తరించియుంది. అవి

  1. వేదములు మరుగుపడిపోవుట
  2. ఉపనిషత్తులలో బ్రహ్మ పదార్థము అవాఙ్మనసగోచరమగుట
  3. సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వవ్యాపకత్వాది గుణములు కలిగిన దేవుని ఉహించనలవి కాకుండుట.
  4. రామునిలో అక్కడక్కడ స్వల్పముగానే, అధికంగానో, ఏకైకముగానో, రాశీభూతముగానో అతని గుణజాలమును కాంచుచుండుటచే దేవుడగుట.
  5. అతను ఆదర్శ స్వరూపుడు, ఆర్తత్రాణపరాయణుడు, దీనబంధువు. కాబట్టి ‘రఘుపతి రాఘవ రాజారాం – ఈశ్వర అల్లా తేరోనామ్’.

రామాయణ రచనా కాలం:

  1. చారిత్రకముగా అనగా మనకు నిశ్చయంగా తెలిసిన రాజుల పాలనములో లభించిన శాసనములు వానిలో నిరూపించబడిన కాలము బట్టి లెక్క వేయుట.
  2. సనాతనముగా భారతదేశమున గణనలోని వచ్చిన యుగముల లెక్కనుబడి శక సం॥ లో విక్రమార్క శకమును బట్టిగాని నిరూపించుట.
  3. గ్రంథంలో వర్ణింపబడిన ఆచారములు, గ్రహములు, తేదీలు, వానిలోని భాష.

పాశ్చాత్య పండితుల విమర్శ:

  1. బాల్టర్ – భారత విజ్ఞాన సర్వస్వమున రామాయణకాలం – క్రీ. పూ. 8671- 02 అనియు
  2. జాన్సన్ – క్రీ. పూ. 2022 అనియు.
  3. హామిల్టన్ – క్రీ. పూ. 950 అనియు
  4. టాద్‍గార్ – 1100 బి.సి అనియు
  5. ఆర్. యస్. ఛటర్జీ: బుద్ధుని నిర్యాణ కాలమును బట్టి అనియు, సూర్యవంశపురాజుల వంశవృక్షమును బట్టియు 1700 బి.సి. అని వ్రాసిరి.
  6. జాకోబి గారు: ఒక పూర్ణ గ్రహణము ఆధారంగా తీసికొని లెక్కపెట్టి క్రీ. పూ. 6 నుండి 8 శతాద్బం నడుమ కాలం అని వ్రాసిరి.

సంస్కృతము వైదిక, లౌకిక – అనే వైదిక, లౌకిక భాష అయినది. వైదిక అనగా – వేదములు, ఉపనిషత్తులు. లౌకిక అనగా రామాయణం, అష్టాదశ పురాణములు, కావ్యములు మొదలైనవి.

రామాయణ ఇతివృత్తం:

రాముని సమక్షంలో కుశలవులు గానం చేయుట, శ్రీరామచరిత్ర ప్రబంధం సంస్కృత భాష. అందువలన వాల్మీకి రామాయణం ఇటు సంగీతపరంగా ఆది లక్షణ ప్రబంధం అని, అటు సాహిత్యపరంగా ఆది కావ్యం అని చెప్పవచ్చు భారతదేశంలో లౌకిక సంగీత సాహిత్యాలని ఆదరించి పోషించిన ఆది ప్రభువరేణ్యుడు శ్రీరామచంద్రమూర్తియే.

ప్రాచీన కాలంలో అనేక సంగీత శాస్త్ర గ్రంథాలు వచ్చాయి. మనకు లభ్యమయిన వాటిలో

  • భరతముని – నాట్యశాస్త్రం
  • దత్తిలువయ – దత్తిలం
  • నారదుడు – సంగీత మకరంధం
  • పార్శ్వదేవుడు – సంగీత సమయసారం
  • శార్ఙ్గదేవుడు – సంగీత రత్నాకరం – ముఖ్యమైనవి

వాల్మీకి కూడా సమస్త మానవుల వలె జనన మరణాదులకు పాల్పబడిన వ్యక్తియే. అతడు ప్రచేతసునకు 10వ పుత్రుడు అని చెప్పబడింది. అతడు వేదవేదాంగ తత్వజ్ఞుడనియు, తపస్వాధ్యాయనిరతుడని రామాయణం చదివిన తెలుస్తుంది.

‘తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం।

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్॥’

వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్న:

‘కోన్వస్మిన్‌ ‌సాంప్రతంలోకే గుణవాన్‌ ‌కశ్చ వీర్యవాన్‌, ‌ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో దృఢవ్రతః’

అతనికి గవేషణలో అట్టి ప్రశ్నలకు తావు కలదు. దానికి కాలము – దేశము, వాతావరణము, నాటి జనుల అవసరము, తన పూర్వముండిన వాఙ్మయము, జనుల ఆధ్యాత అవసరములు, ఐహిక వాంఛలు ప్రేరకాలైనట్లు ఊహింపక తప్పదు. ఎట్టివాడైనను తన పరిసరములను, పరిస్థితులను అనుసరించి యాచించుట స్వాభావికము. ఋగ్వేద సూక్తులు పరిశీలించిన మానవుడు ఎట్టి పరిస్థితులలో యుండెనో మనకు తెలియగలదు. తరువాతవి అయిన యజుస్సామాధర్వములను, వానిలోని కర్మకాండను పరిశీలించిన ఆనాటి మానవ జీవితము ఎట్లు ప్రభావితం అయినదో తెలియగలదు.

విశ్వమున అంతటికి ఒకటే కారణము అది అనాది, అనంతము, నిత్యము, నాది అయిన పరబ్రహ్మమునందు సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ, సర్వవ్యాపకత్వములు అనెడి విశేషములు దుర్వారములు గదా!

ఒకరు పరమేశ్వరుడు లీలా మానుష విగ్రహుడని చెప్పియున్నారు. ఒక కవి “పడతుల్ వేడుక బొమ్మరిండ్ల సుకలోచాగొప్ప నిర్మించబడ్డ మ్రుగ్గుల్ పచరించి పొడమరి చేసి భరించి మా పుటలు నెప్థున్ భక్త చింతామణి” అని వర్ణించి యున్నాడు.

సంగీత ప్రస్తక్తి:

వాల్మీకి మొట్ట మొదటి వాగ్గేయకారుడు, మహర్షి, కవిపుంగవుడు. జ్ఞాని, ద్రష్ట, స్రష్ట కూడా. ఆయన నోటి వెంట శోకంలోంచి వెలువడిన శ్లోకం ‘మానిషాద.. కామమోహితం’. ఇది అప్పటి హరప్రియరాగం. సామగాన మూర్ఛన ఆధార స్వర సప్తకం కూడా ఖరహరప్రియ రాగంలో ఆది తాళంలో ఇమిడివుంది. అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఈ శ్లోకం గానయోగ్యం. శ్లోకంలో స్వరములతో కూడిన స్వరాక్షరములు ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి 16 అక్షరాలు ఉన్నందున ఇది మన ఆధునిక ఆది తాళానికి సరిపోయింది. అలాగే ఇంకో శ్లోకంలో కూడా 16 అక్షరాలతో కూడి, ఆది తాళంలో పాడవచ్చు.

ఉదాహరణ

“శ్రీరామ రామ రామేతి మధురం మధురాక్షరం।

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్॥

స్వరంతో ఆది తాళ గుర్తులతో ‘మానిషాద..’ శ్లోకం ఈ విధంగా రాయచ్చు.

I4 02 02
మ ని స ద ప ద సా ద
మా నీ షా దా ప్ర తి ష్ఠాంత్వం
గ మ సా స ద స మా
అ గ మ శా శ్వ త స మాః
ద స ద ని
య త్క్రౌం చ మి థు నా దే హం
ద గ  మ మ దా
అ వ ధీః కా మ మో హి తం

రామాయాణాన్ని లవకుశులు రాముడి నిండు సభలో అతిరమ్యంగా గానం చేసారు.

అప్పటి షడ్జమ, మధ్యమ, గాంధార, మూర్ఛనలు జాతులతో (అవే ఇప్పటి రాగాలు) కూడి రమ్యంగా గానం చేసారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here