Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-9

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

అన్నమయ్య రెండవ భాగం:

వీర శైవ కవులకు, తాళ్ళపాక కవులకు భేదములు:

వీర శైవ కవులు తాళ్ళపాక కవులు
1 12, 13, శతాబ్దులు 15, 16 శతాబ్దులు
2 పలువురు భిన్నులు, అందరు పురుషులే ఒక కుటుంబములోని వారే. పలువురు స్త్రీలు కూడా కలరు.
3 ఆర్యుడు నన్నే చోడుడు ఆర్యుడు అన్నమాచార్యుడు
4 ప్రముఖులు ఫాల్కురికి సోమన ప్రముఖుడు పెదతిరుమలాచార్యుడు
5 మత ప్రచారమే దృష్టి వీరు వస్తువునందు, భావన యందు రచనయందు, నూతనత్వం సాధించిరి. వస్తువు, భావమునందు రచన యందు నూతనత్వమును సాధించిరి.
6 రచనలో వైవిధ్యం. మతప్రచారమే దృష్టిగా భిన్న సాహితీ ప్రక్రియలు ఆరంభించిరి. వైవిధ్యము అపారము. మత ప్రచారమే దృషిగా గాక నూతనముగా మరికొన్నిటిని కూడా ఆరంభించిరి

.

శైవ కవుల, తాళ్ళపాక కవుల రచనా ప్రక్రియలు:

శైవ కవులు తాళ్ళపాక కవులు
1 ఉదాహరణములు సంస్కృతాంధ్రములందు వీరు ఆరంభించిరి. బసవోదాహరణం ప్రక్రియను చేపట్టి మనోజ్ఞ రచన సాగించిరి. వేంకటేశ్వర ఉదా॥
2 చంపూ కావ్యములు నన్నెచోడుని

కుమార సంభవము

శకుంతలా పరిణయ, శ్రీపాదరేణు మహాత్మాదులు

శైవ కవుల, తాళ్ళపాక కవుల రచనా సామ్యములు:

  1. భాష జాను తెనుగు
  2. వస్తువు – భగవంతుడు. పౌరాణిక – చారిత్రకేతివృత్తములు గ్రహించిరి. భగవద్భక్తుల గాథలు రచించిరి.
  3. భావన లోకమునకు సన్నిహితముగా యుండు రచనలో ఆత్మాశ్రయ కవితా భావనయే ప్రముఖము. భక్తియే ప్రముఖము, శృంగార, వైరాగ్య తత్వములకు కూడా అవకాశ మేర్పడినది.

జీవిత చరిత్రలు:

శైవ కవులు తాళ్ళపాక కవులు
1 బసవ పండితారాధ్యుల జీవితం సామి చారిత్రకముగా రచించి జీవిత చరిత్ర చరిత్ర రచనకు పునాదులు వేసారు. చారిత్రకముగా చిత్రించి సిసలైన జీవిత చరిత్ర రచన ఆరంభించెను. తాతగారి చారిత్రమును మనుమడే రచించుట ఇందలి విశేషము.

క్షేత్ర మహత్యములు:

శైవ కవులు తాళ్ళపాక కవులు
1 వీర శివ కవులు క్షేత్రమహత్యములు, విడిగా వ్రాసినట్లు కానరాదు. సంస్కృతమున వేంకటాచల క్షేత్ర

మహత్యమును అన్నమయ్య రచించెను.

లక్షణ గ్రంథములు:

శైవ కవులు తాళ్ళపాక కవులు
1 లక్ష గ్రంథములే కాని లక్షణ

గ్రంథములు వ్రాయలేదు.

లక్ష్య గ్రంథములతో బాటు లక్షణ గ్రంథములను కూడా సంగీతమునకు, భాషకు సంబంధించి వ్రాసిరి. గొప్ప సంగీత శాస్త్రవేత్తలు. ఔత్తరాహ దాక్షిణాత్య సంగీత పద్దతులకు సమన్వయ మార్గం కల్పించినవారు వీరే. వాగ్గేయకారులే కాదు లక్షణకారులు కూడా.

సంకీర్తన పద రచనలు:

శైవ కవులు తాళ్ళపాక కవులు
1 వీరశైవ కవి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రాదులందు అంతకు పూర్వమాంధ్రదేశమున యుండిన సంగీత రచనలను గూర్చి విపులముగా ప్రస్తావించుటయే కాని వానికి లక్ష్యము ఉదహరించలేదు, రచించుట చేయలేదు. మత ప్రచారమునకు పఅనువగు ఒక ప్రక్రియగా భావించి, పరిగ్రహించలేదు. సంకీర్తన, పదకవితా పితామహులు, మత ప్రచారానికి స్వామి కెంతరమునకు సంబంధించినది లక్ష్యములు. లక్ష్యములు పేర్కొనుటయే గాక పాడి, ఆడి, పరమపదం చెందారు. సాహిత్య లోకమే వీరిని తరువాతి కాలమున అనుసరించిరి. వీరిపద

రచన సంప్రదాయమే తరువాత భజన, నాటు, సంగీత పద్ధతులకు దారి తీసినది.

2 సంస్కృతాంధ్ర కర్నాటక భాషలందు కవులు బహు భాషా పండితులు. సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలందు కవులు షడ్విద ప్ర్రాకృతములందు కవితలల్లిన వారు బహుభాషా పండితులు.

భక్తి భేదములు:

‘ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ’ (భగవద్గీత, 7వ అధ్యాయం, 16వ శ్లోకం) అని గీతలో చెప్పబడిన ఈ కవులు పలు సందర్భములందు పలు విధముల పరమాత్మని భక్తితో అర్థించుచుందురు.

అన్నమయ్య తాత్వికత:

దేహము – జీవుడు – దేవుడు. భగవత్సేవలో సంకీర్తన. సేవ మహనీయమైనదగుట చేత తత్సేవ లోనే వారు జీవితమెల్ల గడిపి తరించారు.

వారు తమ శరీరమునే ఒక పసిడి వీణగా భావించి, పరమాత్ముని చేతి కర్పించుకొని యాతడు మీదినదెల్ల పలికి వేడుక రాగాలను వింత తాళాలను వినిపింపజేసినారు.

[ఆముక్త మాల్యదలో ‘మాలదాసరి’ కథలో ప్రపంచితమైన సంకీర్తన సేవా మహిమ ఇచట అనుసంధించుకొనవలెను.]

ఉదాహరణ:

“పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను”

దుర్లభమగు నీ మనుష జన్మంబెత్తిన ఫలమును వారు పూర్ణముగ అనుభవింపవలెనని త్రికరణ శుద్ధిగా భావించిరి. ఈ శరీరమును వారొక ఆలయముగ భావించిరి. పరమాత్ముని నెలవగు వైకుఠముగా తలపోసిరి.

ఉదాహరణ:

“నిత్య పూజలివివో నేరిచిన
నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి”

శరీరము ఒక రథము. జీవుడు సారథి. పంచేద్రియములతో ఇది పరుగెత్తును. అందు వసించునది పరమాత్ముడే.

ఉదాహరణ:

“గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ
విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు”

శరీరం ఆలయం కాగా జీవుడు పూజారి. పరమాత్ముడు మూలవిరాట్టు. మానుష

శరీరమెట్టిదైనను జీవుడెట్టి వాడైనను పరమాత్ముని తోడి సంపర్కమే దీనికి భద్రతను చేకూర్చునట్టిది.

ఉదాహరణ:

“పరుసమొక్కటే కాదా పయిఁడిగాఁ జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమీ”

దేహము – జీవుడు – దేవుడు – అను మూడింటింలోను దేవ పరివిత్తము జీవుడు నిత్యుడే కాగలడు కాని అస్వతంత్రుడు. దేవుడు స్వతంత్రుడు, నిత్యుడు.

ఉదాహరణ

“దేహి నిత్యుఁడు దేహము లనిత్యాలు
యీహల నా మనసా యిది మరవకుమీ”

రచనా శైలి:

శ్రీనాథుని కవిత్వంలోని రాజసతా ఇటు పోతన సాహిత్యంలోని సాత్వికతా ఏకమై యిబ్బడి ముబ్బడి కాగా తనలోని ఆత్మార్పణ, నిరాయమత, అద్వైతాలతో ఒబ్బడిగా కలబోసి – అన్నముడు మన కందించిన తేనెతుట్టల మంత్ర నగరమే ఆయన సంకీర్తనములు.

“కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా”

అనగలిగాడాయన.

ఊర్థ్వ పుండ్రలా। తులసి పూసలా। ఏవి ఆపగలవండి యీ భావుకతా వెల్లువలని?

అదే విధముగా ‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట’ అని పోతన అంటే

“నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా”

అంటాడు అన్నమయ్య.

భక్తితత్వంలో, నిష్కరణత్వంలో ఎంత సాపత్యమో చూశారా. అంతే కాదు, కృషుని ‘యశోద ముంగిట ముత్యం’ అన్నప్పుడు; ‘ఘన కుండలములు నీ కథలు నా చెవులకు’ అన్నప్పుడు; ‘పాపపు వేళల భయపడెన వేళ ఓపినంత హరినామ మొక్కటే గతి గాక’ అన్నప్పుడు పై సాపత్యం మరింతగా ప్రస్పుటమౌతుంది.

ఇక పోతన భాగవతాన్ని తన కంకితం చేయలేదని సర్వజ్ఞ సింగ భూపాలుడో యెవరో ఆగ్రహించి భాగవతాన్ని భూస్థాపితం చేయించాడని ఒక కథ గదా! అలాగే అన్నమాచార్యుడు వ్రాసిన ‘ఏమొకో చిగురుట ధరమును’ అనే సంకీర్తన విని సాళ్వ నరసింగరాయలు తనపై కూడా అటువంటి కీర్తనను వాసి యిమ్మన్నాడుట. మహాభక్తుడైన అన్నమయ్య తిరస్కరించడంతో కోపించి, చెరసాలలో వుంచాడుట.

భక్త రామదాసును జైలులో వెడితే –

‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము’ అంటూ తనకి కష్టాలేమిటి అని రాముణ్ణి నిలేసి అడిగాడు. కాని అన్నమయ్య అలా అనడు.

“ఆకటి వేళల అలపైన వేళల..
పాపపు వేళల భయపడిన వేళ..
ఓపినంత హరినామ మొక్కటే గతి గాక” అని ఆలాపించాడు.

ఇలాగే ఇలాగే

“వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు జట్టిగొని వురమున సతమైతివమ్మా”

శృంగార కీర్తనలు రచించి పద కవితా పితామహుడుగా పేర్గాంచి అర తెరమరుగున నాడే తన ‘పలుకుదేనెల’ సానిని, వేంకటేశానిగా చేసి ధన్యుడయ్యాడు. ఆ సంకీర్తనలలో పాడుకోవడానికి వీలైనవే, అందరి హృదయాల్ని పరవశింప చేసినవి.

“అంతరంగమునఁ దాను హరిఁ దలఁచినఁ జాలు
అంతటి మీఁదటి పనులాతఁ డెరుగు
పంతమున నాతనిపై భారము వేసినఁ జాలు
వింత వుద్యోగములు గోవిందుఁడే యెరుఁగు”

– అని తన జీవితాన్ని వేంకటేశ్వరార్పణం చేసి నిశ్చింతగ ఆత్మ కల్యాణంతో బాటు లోక కల్యాణాన్ని కూడా సాధించిన మహాభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యులు. లేకున్న ఇంత సారస్వత రాశిని ఒక వ్యక్తి, తన జీవిత కాలంలో సాధించడం సామాన్యమైన పని కాదు.

ఈ సాధ్యానికి వారు ఉపయోగించిన సాధనం శరణాగతి. ఇది బ్రహ్మానంద వేదాంత రహస్యమని ఈ భక్త కవే లోకానికి చాటి చెప్పినాడు.

“వేడుకకు వెలలేదు వెన్నెలకు కొల లేదు
పండిత, పామరులను అలరించును..”

అప్పటి పరిస్థితులు పరిణామములు:

తెలుగు వాఙ్మయపు చరిత్రలో కీ.శ. 15వ శతాబ్దం ఒక ప్రధాన ఘట్టం. కవితా కన్యక ముగ్ధయై, తొలి ప్రాయపు తళుకులు, అందరినీ ఆకర్షించు చెళుకులు నేర్చుకొను కాలమది. నిర్లక్ష్యపు నెరసులు, పలుకులు బిరుసులు నిండిన రచనలప్పటివి. భావములలో ప్రశాంతి కంటే, నెమ్మది కంటే – ఆత్రము ఆవేగము ప్రబలంగా తోచిన వాతావరణమది. కవులకు లోక కళ్యాణాని కంటే ఆత్మ కల్యాణంలో అభినివేశమెక్కువ. తపస్సు కంటే ధీరత్వం ప్రబలం. కనికరము కల ఆచారత్వాని కన్నా ఆగ్రహంతో నిండిన ఆచార్య పుంస్త్వం ఎక్కువ వ్యాపించిన జీవితమప్పటి కవీశ్వరులది.

కవితావర్యులలో అగ్రగణ్యుడు అన్నమయ్య అని చెప్పవచ్చు. పదకవిత్వం రచించిన ప్రాచీనులు వీరే. ఇతనికంటే ప్రాచీనులు కానరారు. గేయ కవిత్వం మనుష్యులకు సహజమై పరమ ప్రాచీనమైన రచన కృష్ణమాచార్యుని సింహగిరి వచనాలు అన్నమయ్యకు ముందే పుట్టినా అవి త్యాగయ్య రచనలే ఐనా, గేయ గంధులుగా మాత్రమే ఉన్నవి. ప్రాచీన సంగీత లక్షణ గంధులు చూస్తే, ప్రబంధాలనబడే గేయ రచనలు మన దేశంలో అసంఖ్యాకంగా ఉండేవని, ఆ చాదస్తాలన్నీ వదిలిపెట్టి సుప్రసిద్ధమైన దేశ రాగాలలో, సుగ్రహమైన, లయ, తాళాలలో నిబంధించి సులభీకరించిన రచనలే పదాలు.

పద లక్షణాలు:

1. రెండే అంగాలు – పల్లవి, చరణం. అర్థాన్ని బట్టి చూస్తే, కేంద్ర భూతమైన అర్థం పల్లవిలో ఉంటుంది. దాని విస్తరణమే వివరణమే చరణంలో నిబంధించి వుంటుంది.

“ఎండగాని నీడగాని యేమైనఁగాని
కొండలరాయఁడే మా కులదైవము”

అనేది పల్లవి. ఈ అర్థాన్ని వేరు వేరు శబ్దారాలతో పెంచి పెద్దచేసి

“తేలుగాని పాముగాని దేవపట్టయినఁగాని
గాలిగాని ధూళిగాని కాని యేమైనా
కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి
నీలవర్ణుఁడే మా నిజదైవము”

అని రచించినది చరణం. రెండవ వాక్యాన్ని పల్లవి భావం ఒక వాక్యంలో ముగియకపోతే అ॥ప॥గా భావించబడుతుంది.

2. అట్లే ఒక చరణంలో చేసిన పల్లవి వాక్యార్థ విస్తరణం చాలదని తోచినప్పుడు అట్టివే మరికొన్ని చరణాలు చేర్చవచ్చును.

3. పదానికి మామూలుగా 3 చరణాలుంటాయి. కడపటి చరణంలో కర్తముద్ర చేర్చేవారు. సంగీత దృష్టిలో చూచిన తాళ లయలు రెండు ఆద్యంతం ఒకే రీతిగా గోచరిస్తుంది. పల్లవిలో పాట కుదించిన రాగ భావం చరణంలో సర్వాంగీకారంగా విస్తరింపబడి, కడపటి పల్లవి ఎత్తు గడ అందుకొని లయించి పోతుంది. ఎన్ని చరణాలు రచించినా వాటి రాగ స్వర సంచార క్రమం ఒకే తీరుగా వుంటుంది. దీనికి విరుద్ధంగా ప్రతి చరణానికి రాగా తాళాలు వేరు వేరుగా ఏర్పరచి చేసిన ‘సుళాదులు’ అనే పదాలున్నవి. క్రీ.శ. 15-16 శతాబ్దాలలో కన్నడ భాషలో పుట్టినవి. కాని అవి వ్యాప్తి చెందక మరుగున పడిపోయాయి.

ఈ పద స్వరూపాన్ని రచనలె పరిగ్రహించిన తెలుగు బయకార్లలో ఇప్పటికి అన్నమాచార్యులే ప్రాచీనతముడుగా కానవస్తున్నాడు. ఈతనికి ‘పద కవితా పితామహుడని’ బిరుదు ఇచ్చారు. తరువాత ‘ఆంధ్ర కవితా పితామహు’ బిరుదాన్ని సంపాదించిన అల్లసాని పెద్దన్న కూడా ఇతనివలె నందవరీకయోగి కావడం, ఇతని వలెనే శ్రీ వైష్ణవ మత స్వీకారం చేసినవాడు కావడం కొంత వింత గొలిపే సందర్భాలు.

(ఇంకా ఉంది)

Exit mobile version