ప్రజా ప్రయోజనాలే పణంగా ఆర్థిక ప్రయోజనాలు

0
3

[box type=’note’ fontsize=’16’] వివిధ దేశాలలో జరుగుతున్న కరోనా వాక్సినేషన్ ప్రక్రియ గురించి ఈ చిన్న వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

[dropcap]జ[/dropcap]ర్మన్ కంపెనీ బయోన్ టెక్నాలజీ రూపొందించిన టీకా మందుల క్లినికల్ ట్రయల్స్, మార్కెటింగ్‌లను ఫైజర్ కంపెనీ చేపట్టింది. అయితే టీకాకు సంబంధించి తయారీ, నిల్వ, పంపిణీ వంటి వివిధ దశలలో ఎక్కడ నిర్వహణా లోపాలు జరిగినా, వాక్సినేషన్ వలన దుష్పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. ఫైజర్, మోడెర్నా కంపెనీల వాక్సిన్‌ను -70ºC, -80ºC ఉష్ణోగ్రతలలో నిల్వ ఉంచవలసి ఉంటుంది. ఆ అతి శీతల స్థితిలోనే వాటి రవాణా, పంపిణీ జరగాల్సి ఉంటుంది.

భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ 81% ప్రభావశీలతను కనబరిచింది. కోవాగ్జిన్ నిల్వ సైతం ఫైజర్, మోడెర్నాల వలె కష్టతరం కాదు.

అయితే టీకాకు సంబంధించి ఏ కారణంగా సంభవించిన దుష్పరిణామాలకైనా తాను బాధ్యత వహించేది లేదని ఫైజర్ మొండి పట్టు పట్టింది. అర్జెంటినా, బ్రెజిల్ వంటి దేశాల ప్రభుత్వాలు ఫైజర్ కంపెనీ బాధ్యాతారహితమైన డిమాండ్లకు లొంగలేదు.

తప్పనిసరి పరిస్థితులలో ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి కొన్ని దేశాలు ప్రజా సంక్షేమం రీత్యా ఫైజర్ వాక్సిన్ విపరిణామాల బాధ్యతను నెత్తిన వేసుకోవడానికి సిద్ధపడ్డాయి.

దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలతోనూ ‘ఫైజర్’కు ఒప్పందాలు కుదిరాయి. కాని షరతులను ఫైజర్ షరతులు ఆ దేశాలకు గుదిబండలు కాగలవన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అయితే అమెరికా ఇప్పటికే ‘ఫైజర్’‍కు 200 కోట్ల డాలర్ల ఆర్డరు ఇచ్చింది. సందిగ్ధతలకు అవకాశం లేని పరిస్థితులను కోవిడ్ కల్పించటమే ఈ సమస్యలన్నిటికీ మూలం. ఫైజర్ ధీమాకు కూడా అదే.

అమెరికాలో వాక్సిన్ విపరిణామాలకు ఫార్మాకంపెనీలదే బాధ్యత. నష్టపరిహార చెల్లింపులూ భారీ మొత్తంలోనే ఉంటాయి. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ‘అత్యవసర సేవలు – సన్నద్ధత’ చట్టం ప్రకారం ప్రజలకు ముఖ్యమైన మందుల నందించే కంపెనీలకు 2024 వరకు వినియోగదారులకు నష్టపరిహారం కేసుల నుండి రక్షణ కల్పిస్తామని ప్రకటించింది.

బ్రిటన్ ఫైజర్‍తో బాటు ఆరోగ్య సిబ్బందికీ వినియోగదారుల కేసుల నుండి (నష్టపరిహారం) రక్షణ కల్పించేలా చట్టంలో సవరణ చేసింది. అయితే ఈ రక్షణ వాక్సిన్ తయారీ, నిల్వ, పంపిణీల ప్రక్రియలలో జరిగిన నిర్లక్ష్యం వలన కలిగే దుష్ఫలితాలకు వర్తించదు. ఆ బాధ్యత కంపెనీలదే. అవి జాగురూకతతో మెలగవలసిందే.

యూరోపియన్ యూనియన్‌లో ఆస్ట్రాజెనికా ఒక్కదానికే మాత్రం షరతులతో కూడిన రక్షణ లభిస్తోంది. తప్పనిసరి పరిస్థితులలో సింగపూర్, కెనడా వంటి దేశాలూ ఫైజర్ వాక్సిన్ విపరిణామాల బాధ్యతను నెత్తిన వేసుకునేందుకు సిద్ధపడ్డాయి (ప్రజా సంక్షేమం రీత్యా).

భారతదేశ ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే పని పెట్టుకోలేదు.

అయితే – వాక్సిన్ వెలువడి వాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇజ్రాయిల్ – టీకా వికటిస్తే సంభవించే పరిణామాలకు తానే బాధ్యత వహించడానికి పూనుకోవడంతో అక్కడ వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగిపోతోంది. ప్రపంచం మొత్తంలో అత్యధిక శాతానికి వాక్సినేషన్ పూర్తి చేసిన దేశంగానూ నిలబడింది. ఇజ్రాయిల్ జనాభా 86 లక్షలు. 60 సంవత్సరాలు పై బడిన వారిలో నూటికి 80 మంది వరకు ‘ఫైజర్’ వాక్సిన్ వేశారు. ఆ కారణంగా వయసు పై బడిన వారిలో కోవిడ్ సోకడం బాగా తగ్గింది.

మోడెర్నాకు సైతం లైసెన్సు జనవరిలోనే లభించినప్పటికీ దాని వాడకం ఇంకా మొదలుకాలేదు. వాక్సిన్ నిల్వలు ఉండిపోయాయి. కోవిడ్ వాక్సిన్‍ను ఆరు నెలలలోపు వాడకపోతే తర్వాత పనికిరాదు. శ్రమ, ఖర్చు అన్నీ వృథా. ‘ఫైజర్’ నిల్వలు సమృద్ధిగా ఉన్న కారణంగా ‘మోడెర్నా’ టీకా నిల్వలు ఉండిపోయాయి. ధర అధికం, బాధ్యత వహించనవసరం లేదుగా.

అవకాశాలు కలసివచ్చిన ‘ఫైజర్’:

వాక్సిన్ ఫలితాలకు బాధ్యత వహించడమే కాకుండా, ఒక్కొక్క డోసుకు ఇజ్రాయిల్ 23 యూరోలు చెల్లిస్తోంది. ఇది చాలా ఎక్కువ.

యూరోపియన్ యూనియన్ ఫలితాల బాధ్యతను ఫైజరే వహించాలని అనడమే కాకుండా ఒక్కో డోసుకు 12 యూరోలు మాత్రమే చెల్లిస్తోంది.

ఇజ్రాయిల్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అంతా తన సమాచారాన్ని డిజిటల్ రూపంలోనే నమోదు చేస్తుంది. వాక్సిన్ సమాచారాన్ని కంపెనీకి అందిస్తోంది. అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం ఫైజర్ ఫలితాలను నిశితంగా విశ్లేషించి నిగ్గు దేలుస్తున్నాయి. వాటి సమాచారం ‘ఫైజర్’ మూడో దశ ప్రయోగాల ఫలితాల సమాచారంతో సరిపోతోంది.

తనకు గల వివిధ సానుకూలతల కారణంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియల్లో ఇజ్రాయిల్ మొదటిస్థానంలో ఉండగా (87%), అరబ్ ఎమిరేట్స్ 53.6%తో రెండవ స్థానంలో, రమారమి 30%తో బ్రిటన్ మూడవస్థానంలో ఉండగా, 20% దరిదాపులో అమెరికా, చాలా తక్కువ శాతంతో చైనా, ఆఖరుగా భారతదేశం వరుసలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here