ప్రకృతి కాంత

0
2

[dropcap]ప[/dropcap]చ్చ చీర కట్టుకొన్న
ప్రకృతి కాంత
నువ్వు అచ్చమైన
తెలుగుదనపు స్వచ్ఛత కాంత
పాలరాతి సౌధాలు నీ ముందెంత
వేల పూల పరిమళం నీదేనంట
అది నాదే అంటా..
***
నిన్ను చూస్తే సన్యాసి
ఈలే వేయడా..
నువ్వు కన్ను కొడితె
సంసారిగా మారేపోడా..
రామచిలకల రాజ్యానికి
నువ్వు రాణివి కాదా..
ఇంద్రధనస్సు నీ కోసం
గిఫ్టుగ తేనా..
***
నీవో చూపు చూస్తే
శత్రువే మిత్రుడై పోడా
నీ ఊపు చూస్తే
విశ్వమంతా నిన్ను చుట్టబోదా
నువ్వు పాటకి బీటేస్తే
హిట్టైపోదా..
ఏడేడు వింతలు ఏడున్నాయో
వింతల్లో వింతలన్నీ
ఈడున్నాయి..
నీలో ఉన్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here