Site icon Sanchika

ప్రకృతి ఒడి

[dropcap]ప్ర[/dropcap]కృతి ఒడిలో పెరిగాము
పొలం బడిలో చదివాము
ఈ నేలే మా పలక
ఈ నాగలే మా బలపం
తల్లిదండ్రీ, గురువు, దైవం
సర్వం తానై నిలిచెను పుడమి ॥ప్రకృతి॥

అరక దున్నడమే అ… అ…
‘అ’ అంటే అన్నం
ఆకు పొయ్యడమే ఆ… ఆ…
అన్నం పెట్టి ఆకలి తీర్చే
ఈ భూమాతంటే భుక్తి, భక్తి ॥ప్రకృతి॥

కారు మబ్బులను పిలిచాము
కాడి ఎడ్లనే నమ్మాము
ఈ ధాన్యపు గింజలలోనే
ధనాల రాశులు చూసాము ॥ప్రకృతి॥

నారు వెయ్యడం తెలుసు
నీరు పొయ్యడం తెలుసు
నమ్ముకున్న ఈ మట్టిలో
మణులు ఏరడం తెలుసు ॥ప్రకృతి॥

శ్రమలో సుఖాన్ని చూసాము
స్వేదం ధారవోశాము
చెమట చుక్కే జయ్యపు గింజై
కడుపుకు చల్లని గంజయ్యింది ॥ప్రకృతి॥

కొత్త వంగడా లేశాము
అధిక దిగుబడిని పొందాము
వివేకంతో విజ్ఞానాన్ని
ప్రపంచానికే పంచాము ॥ప్రకృతి॥

 

Exit mobile version