[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ప్రకృతితో సంభాషణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]వాహానికీ ఓ భాషుంది
వినగలిగితే
పర్వతాలకీ ఓ భాషుంది
చూడగలిగితే
దట్టమైన అడవికీ ఓ భాషుంది
స్పందించగలిగితే
భాషంటే
కొన్ని పదాల సమూహమూ
మాటల ధ్వనీ మాత్రమే కాదు
వాటి నడుమ మౌనమూ వుంటుంది
నువ్వైనా నేనైనా
మౌనాన్ని వినాలి
నిశ్శబ్దాన్ని తెలుసుకోవాలి
ప్రకృతితో సంభాషించాలి
ప్రేమతో పలవరించాలి