Site icon Sanchika

ప్రమాద ఘంటికలు

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘ప్రమాద ఘంటికలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]లకత్తాలో,
జూనియర్ డాక్టర్ –
ఘటన..
యావత్ భారతదేశం
తలదించుకోవాల్సిన
మహాదుర్ఘటన..!
భరోసా లేని బ్రతుకుతో
భయంభయంగా —
బ్రతుకుతున్న ఆడపిల్ల
రక్షణ కరువైన..
ఈ సమాజంలో ,
బలిపశువు అవుతున్న
బహు దీనురాలు..!
ఇంటా-బయట,
బడిలో – గుడిలో..
ఎక్కడా రక్షణలేని..
నిస్సహాయురాలు..!
ఆడపిల్ల ఉనికి
ప్రశ్నార్థకం అయిపోతూన్న
ఈ ప్రమాదఘడియల్లో
ప్రతిఒక్కరూ స్పందించాలి!
ఆడపిల్లల రక్షణ కోసం,
ఆడ – మగ తేడా లేకుండా
మనసున్న ప్రతివారూ
ఉద్యమించాలి..!
స్త్రీ శక్తికి
తగిన ఊతం ఇవ్వాలి..
నేరగాళ్లకు ఉరిశిక్ష పడాలి!!

Exit mobile version