[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కవి, పరిశోధకులు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 28 జనవరి 2022 నాడు హైదరాబాదులో మృతి చెందారు.
జనవరి21, 1959న నిజామాబాద్ దగ్గరి పాములబస్తిలో జన్మించిన యెంద్లూరి సుధాకర్, ఆరంభంలో వాజ్ఞ్మయి పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. తరువాత అదే పత్రికకు ఎడిటర్ అయ్యారు. తెలుగు యూనివెర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, హెడ్ అఫ్ థి అడ్వాన్స్డ్ డిపార్ట్మెంట్ (1994-2012) గా పనిచేశారు. రాజమండ్రి తెలుగు యూనివెర్సిటీలో ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేశారు. హైదెరాబద్ తెలుగు యూనివెర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ తుదిశ్వాస విడిచారు.
వర్తమానం, కొత్త గబ్బిలం, మల్లెమొగ్గల గొడుగు, వంటి రచనలు చేశారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
‘నా అక్షరమే నా ఆయుధం’ పేరిట డా. శరణ్ కుమార్ లింబాలే ఆత్మకథని తెలుగులోకి అనువదించారు.
తెలుగు సాహితీ లోకంలో వీరు లేని లోటు తీర్చలేనిది.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి నివాళి అర్పిస్తోంది సంచిక.