ప్రాంతీయ దర్శనం -20: గుజరాతీ – నేడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా గుజరాతీ సినిమా ‘లపేట్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘లపేట్’

[dropcap]నే[/dropcap]టి గుజరాతీ సినిమా కూడా మారిపోయిన ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లాగే కమర్షియల్ కాలక్షేపాలే. కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ సినిమాలే. గత సంవత్సరం 56 సినిమాలు నిర్మించారు. వీటిలో 25 ఫ్యామిలీ డ్రామాలే వున్నాయి. 19 కామెడీలు, మిగిలినవి యాక్షన్ సినిమాలు. ఈ సంవత్సరం మార్చి వరకూ 14 నిర్మిస్తే, 8 ఫ్యామిలీ డ్రామాలే తీశారు. 5 కామెడీలు, ఒక సైన్స్ ఫిక్షన్ తీశారు. కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలూ ప్రజాదరణ కోల్పోతున్నా తీయడం మానడంలేదు. తెలుగులో రొమాంటిక్ కామెడీలు ఫ్లాపవుతున్నా అవే తీస్తున్నట్టు. ప్రేమలు, కుటుంబ కథలు తప్ప ఇంకో కథ ప్రక్రియ తెలియని నేపధ్యం లోంచి వస్తున్న మేకర్లతో ఈ పరిస్థితి. ఇలా వొక ఇంకో దుస్థితి 2019 ఫిబ్రవరిలో విడుదలైన ‘లపేట్’ (వ్యూహం) అనే కామెడీ.

దీనికి దర్శకుడు నిశిత్ బ్రహ్మ్భట్. ఇతను గతంలో ‘చకీ కహే చాకా జో బాకా’ అనే కామెడీ తీశాడు. ‘లపేట్’ తర్వాత ‘ఫేస్‌బుక్ ఢమాల్’ అనే ఇంకో కామెడీ నిర్మాణం చేపట్టాడు. ఎప్పుడో 1990 లనాటి సినిమలన్పించేలా పాత వాసనలతో తీస్తాడని పేరు తెచ్చుకున్నాడు.

           

‘లపేట్’లో భాను ప్రతాప్ (ప్రశాంత్ బరోట్) ఒక డాన్. అతడికో కూతురు మౌసమ్ (భక్తీ కుబోవత్) వుంటుంది. ఈమెకి పెళ్లి చేయాలనుకుంటాడు. మూడు సంబంధాలు చూస్తాడు. ఒక ఎన్నారై, ఒక గ్రామీణుడు, ఇంకో గూండా. ఈ ముగ్గుర్లో ఒకర్ని సెలెక్టు చేసుకోమంటాడు. ఆమె తేల్చుకోలేకపోతుంటే ఆ ముగ్గురూ ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మొదలెడతారు, ఒకర్నొకరు దెబ్బ తీసుకుంటూ. ఇంతలో ఈమె తండ్రి ప్రత్యర్ధి, ఎదుటి డాన్ చందూ (విక్కీషా) ఈమెని కిడ్నాప్ చేసేందుకు ఒక కిడ్నాపర్‌ని నియమిస్తాడు. ఈ విషయం తండ్రి భాను ప్రతాప్‌కి తెలుస్తుంది. కూతురికి స్వయంవరంగా పంపిన ముగ్గుర్లో ఒకడు ఆ కిడ్నాపర్‌ అని సమాచారమందుతుంది. దీంతో కంగారు, కన్ఫ్యూజన్ మొదలవుతాయి. అటు కూతురు ఎవరు బావున్నాడో తేల్చుకోలేకపోతుంటే, ఇటు తండ్రికి ఎవరు కిడ్నాపరో అర్థంగాదు. కిడ్నాపర్‌ని కనిపెట్టి కూతుర్ని ఎలా కాపాడుకోవాలా అని నానా తిప్పలు పడతాడు.

ఇదీ కథ. ఈ కథ చెప్పుకుంటే బాగానే అన్పిస్తుంది. చూడాలంటేనే ఇబ్బంది పడాలి. ఈ కన్ఫ్యూజన్‌తో కూడిన కామెడీ కథని సరైన విధంగా కథనం చేయలేకపోయాడు దర్శకుడు. చాలా నీరసమైన కథ అల్లాడు. దీంతో నటులు ఎంత బాగా చేయాలన్నా బ్రేకులు పడ్డాయి. ఎన్నారైగా నయన్ శుక్లా, గ్రామీణుడు చందన్‌గా కేతన్, గూండాగా జిగ్నేష్ నటనలో సమర్థులే. అయితే పేలవమైన సీన్లు వీళ్ళ టాలెంట్‌కి బ్రేకులేశాయి. ప్రత్యర్ధి డాన్ చందూగా విక్కీ షా చెప్పుకోదగ్గ యువ నటుడు. హీరోయిన్ భక్తీ కుబోవత్ కూడా ఏమీ తీసిపోలేదు.

ముందు చెప్పుకున్నట్టు ఇది 1990 లనాటి సినిమా. కొత్త తరం దర్శకుడుగా తనొచ్చాడే గానీ, పాతనే వడ్డిస్తూ ప్రేక్షకుల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ కామెడీ కానీ కామెడీలో బావున్నవి రెండు పాటలు, ఛాయాగ్రహణం మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here