ప్రపంచాన్ని మోయలేమని

0
2

[dropcap]అ[/dropcap]రచేతి వేళ్ళు
కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయి.
రోజులో పద్దెనిమిది గంటలు
ప్రపంచాన్ని మోయలేమని
మనిషితో కలసి పనిచేయలేమని..
~
మొర వినపడని మెదడు
‘హ్యాండ్రేడ్’ డిక్టేటర్ కు
చితక బాధపడి
మొద్దుబారి ‘సెల్’ లో మగ్గుతుంది.
~
జీవితంలో మనిషి అన్ని భాగాల్లో
వేర్లు పాకిన టచ్ ఫోన్లతో
ప్రపంచం ఇంట్లోకి వస్తూ
‘ఒంటరితన’మనే వైరస్ తెచ్చింది.
~
మనిషి
మనిషిని మరచే లక్షణం
మనిషి ముఖచిత్రాన్ని మార్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here