ప్రార్థన

1
4

[Rabbi Tamara Cohen రచించిన ‘No Pain Like Our Pain’ అనే కవితని అనువదించి అందిస్తున్నాము.]


[dropcap]నీ[/dropcap]వు నాకు ప్రసాదించిన బాధ లాంటి బాధ ఇంకొటి ఉందేమో వెతికి చూడు – Lamentations 1:12
~
మాకు ఆ దృష్టిని ప్రసాదించు ప్రభూ
వారి పిల్లల్లో మా పిల్లలను
మా పిల్లల్లో వారి పిల్లలను
దర్శించే దృష్టిని ప్రసాదించూ ప్రభూ..

కన్నీటితో నీలాలు గారే పసిపిల్లల కళ్ళల్లో
పిల్లల కోసం దుఃఖించే  ప్రతి తల్లిలో
ఆత్మగౌరవం ముసుగులో పోరాడే ప్రతి వీరుడిలో
నిన్ను దర్శించే దృష్టిని ప్రసాదించు ప్రభూ..

దివ్యమూ, భవ్యము అయిన దుఃఖ దేవతా,
మా ప్రత్యేకతను మరచి
ఇది మాదేనన్న పట్టును విడిచి
బాధ, జాలి, న్యాయం  చూసే దృష్టిని ప్రసాదించు ప్రభూ..

బాధలు, ఆశలు, భూమి, మానవత
కష్టాలు, సాహసాలు
అన్నీ కలసి పంచుకోవాలన్న దృష్టిని
నీకు ప్రతిరూపాలయిన నీ పిల్లల్లో కలిగించు ప్రభూ..

‘ఇన్షాహ్  అల్లాహ్’  అన్నా
‘కెన్ యెహి రట్జోన్’  అన్నా
అంతా నీ ఇష్టమేనని
అంతా నీకే చెందుతుందన్న
సమ్యక్ దృష్టి
ప్రసాదించు ప్రభూ..
~

ఆంగ్ల మూలం: Rabbi Tamara Cohen
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్


No Pain Like Our Pain
by Rabbi Tamara Cohen

Rabbi Tamara Cohen is the VP and Chief of Program Strategy at Moving Traditions. More of her liturgical poetry can be found in Siddur Lev Shalem and on ritualwell.org. In this prayer she speaks of God as “the Divine Exiled and Crying One,” images that come from rabbinic tradition about the Shechinah, which are particularly apt for this last week of the period of the Omer, known as the week of Malchut/Shechinah.
“Look carefully and see if there could possibly be pain like my pain, like the one bestowed by You upon me.” – Lamentations 1:12

Dear God, help us look,
look closer so that we may see
our children in their children,
their children in our own.

Help us look so that we may see You –
in the bleary eyes of each orphan, each grieving childless mother,
each masked and camouflaged fighter for his people’s dignity.

Dear God, Divine Exiled and Crying One,
Loosen our claim to our own uniqueness.
Soften this hold on our exclusive right – to pain, to compassion, to justice.

May your children, all of us unique and in Your image,
come to know the quiet truths of shared pain,
shared hope,
shared land,
shared humanity,
shared risk,
shared courage,
shared peace.

In Sh’Allah. Ken Yehi Ratzon.
May it be Your will.
And may it be ours.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here