డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ ప్రకటన

0
2

[dropcap]‘ఓ[/dropcap]సారి చూడండి.. అంతే!’ (ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక) గ్రూపు నిర్వహిస్తున్న డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీకి కథారచయిత (త్రు)లకు  ఆహ్వానం పలుకుతోంది.

10,000/- రూపాయల విలువ గల బహుమతులు.

1000/- రూపాయల చొప్పున పది కథలకు సమాన బహుమతులు అందజేయబడతాయి.

వాట్సప్‌లో మీ కథలు అందవలసిన చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2023.

ఆ రోజు సాయంకాలం అయిదు గంటల తరువాత వచ్చేవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు

నియమాలు:

  • కథ తెలుగువారి జీవితానికి సంబంధించి సాంఘికమై ఆసక్తిగా చదివించేది కావాలి. చారిత్రక, క్రైమ్ కథలు పంపకూడదు.
  • మీరు మీ చేతిరాతలో రాసుకున్నప్పుడు A4 సైజ్ పేపర్‌లో పేజీకి 25 లైన్లు చొప్పున నాలుగు పేజీలకు మించకుండా (సుమారు 1000 పదాలు వచ్చేలా) నిడివి మీరే చూసుకుని, మీ కథను కేవలం వాట్సప్ లోనే Text ఫార్మాట్ లోనే  9849297958 నెంబర్‌కు పంపించాలి. ఇవి వాట్సప్ లోనే ప్రధానంగా అంతా చదువుకునే కథలు కనుక ఈ నిడివిని ప్రతిపాదించడం జరిగింది.
  • మీ కథ పిడిఎఫ్ గా కానీ, స్కాన్ చేసిగానీ పంపకూడదు. వాట్సప్ మెసేజ్ లానే టెక్స్ట్ ఫార్మాట్ లోనే (యూనికోడ్ డాక్యుమెంట్‌గా నయినా) కథ పంపాలి. అలా లేనివి పోటీకి స్వీకరించబడవు.
  • ప్రసన్నభారతి వాట్సాప్ ఉగాది కథల పోటీ కని పేర్కొంటూ మీ కథ తమ స్వంతరచన అనీ దేనికీ అనువాదం గానీ అనుసరణ గానీ కాదని, మునుపు ఎక్కడా ప్రచురితం కాలేదనీ, పంచుకోలేదనీ, ఏ పత్రికకు గానీ, సామాజిక, ప్రసారమాధ్యమాలకు గానీ పంపలేదని, పంపబోవడం లేదనీ స్పష్టమైన హామీపత్రం కథతో బాటుగా ఉండాలి
  • కథతో బాటు మీ ఫోటో, పూర్తి పిన్ కోడ్‍తో సహా పోస్టల్ అడ్రస్, మీ గూగుల్ పే, లేదా ఫోన్ పే లేక పేటియమ్ నెంబర్ విధిగా పంపించాలి.
  • బహుమతి పొందిన కథలు ‘ఓ సారి చూడండి..అంతే!’ ప్రసన్నభారతి వాట్సప్ ప్రసారసంచిక లోను, ఆపై వీలువెంట ఆ కథలు తెలుగుగ్లోబల్.కామ్ లోనూ పోస్ట్ చేయబడతాయి
  • బహుమతి పొందిన పది కథలు కాక ఎంపిక చేసిన మరో పదిహేను కథలతో కథా సంకలనం ప్రచురించే హక్కు మాకుంటుంది.
  • రచయితలూ, రచయిత్రులూ తమ సృజనాత్మక సరికొత్త కథా రచనలతో శోభకృతు ఉగాది కథలపోటీని విజయవంతం చేయండి!!

ఫిబ్రవరి 10 వ తేదీలోగా మీ కథలు వాట్సప్ చేయాల్సిన నెంబర్ 98492 97958

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here