పర్యావరణం కథలు- 5: ప్రతిన

0
2

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘ప్రతిన’ అనే కథలో పర్యావరణానికి హాని కలిగించమని ప్రతిన పూనిన నిధి గురించి సరళమైన కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]ని[/dropcap]ధికి సంక్రాంతి సెలవులు. తాతగారి తోట బంగ్లాలో అదేనండి ఫార్మ్ హౌస్‌లో రెండురోజులు పండగ జరుపుకోవటానికి అందరు వెళ్లారు.

నిధి ఒక్కతే చిన్నపిల్ల, 8 యేళ్ల వయసుది కావటంతో ఆడుకోవటానికి ఎవ్వరులేక, టీవీ చూసి చూసి విసుగుగా ఫీల్ అయ్యింది.

నిధికి తాతగారి తోటలోని ఉడుతలు, కుందేళ్లు, బాతులు, ఆవుదూడలు, కుక్కలు, పక్షులు అన్ని స్నేహితులు.

లంచ్ తర్వాత బోరుగా ఉందని బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెట్టి తనకు నచ్చిన పాటలు వింటూ డాన్స్ చేస్తున్నది. పనిలో ఉన్న అమ్మ విసుక్కుని “నిధీ! ఏమిటా సౌండ్? తగ్గించు. లేదంటే తోటలోకి పో” అన్నారు.

నిధి తోటలోకి వచ్చి సౌండ్ మరింత పెద్దగా పెట్టి డాన్స్ చేస్తూ, కూనిరాగం తీస్తూ ఫ్రెండ్ అయినా ఉడుతా ఉఫ్ ఉఫ్ దగ్గరికి వచ్చింది.

చెట్టు మీద అందంగా కట్టుకున్న ఇంట్లో పడుకున్న ఉడుతను “ఓయ్! నిద్రమత్తు ఉఫ్ లే! బద్ధకి” అని అరిచింది.

నిధి పెట్టిన స్పీకర్ సౌండ్‌తో నిద్ర డిస్ట్రబ్ అయిన ఉఫ్ ఉఫ్ ఉడుత విసుగ్గా “నిధీ! నన్నెందుకు నిద్ర లేపావు?” అంది.

“ఉఫ్! నువ్వు నాకు పర్యావరణాన్ని క్లీన్ చెయ్యటంలో హెల్ప్ చేస్తా అన్నావు. మర్చిపోయావా?” అంది నిధి కోపంగా.

“కం క్విక్! ఆలస్యం చేస్తే పర్యావరణం మనల్ని సిక్ చేస్తుందిట.”

“ఓకే ఓకే. మనకి ఇంకా హెల్పింగ్ హాండ్స్ కావాలి. ఇద్దరి వల్ల కాదు. వెళ్లి బన్నీ రాబిట్‌ని పిలు” అంది ఉఫ్ ఉడుత.

బలంగా ఉన్న బన్నీ రాబిట్ తోటలోని క్యాబేజీ కొరికి తింటూ కనపడింది.

“బన్నీ! దొంగా. మా తోటలోని కూరలు అడక్కుండా తింటున్నావా?” అంటూ నిధి ఆపింది.

“ప్లీజ్!” అనిన బన్నీతో “సరే నాకు హెల్ప్ చెయ్యాలి” అంది నిధి.

ఒప్పుకున్న బన్నీ “మనం నేలను క్లీన్ శుభ్రం చేసి ఇంకా చాల విత్తనాలు వేసి కూరలు పండిద్దాము, తినటానికి” అన్నాడు.

“గుడ్ ఐడియా! సరే పద” అన్న నిధితో –

“అమ్మో! అదొక పెద్ద పని. నావల్ల కాదు. నాకంటే బలంగా ఉండే రాంబోని డాగ్‌ని పిలుద్దాం. వాడికి చాలా పనులు వచ్చు” అన్నాడు బన్నీ.

“రాంబో! ఏడి? “

“అదిగో అక్కడ” అటువైపు చూస్తే పొగ కనిపించింది. అటువెళ్లి

“రాంబో! రాంబో! ఎక్కడున్నావు?” అని గట్టిగా పిలిచింది నిధి.

పొగలోంచి బైటకి వస్తున్న రాంబోతో నిధి – “రాంబో అంత పొగ ఎక్కడిది?” అంది.

“ఓహ్! అదా? నీకు తెలుసా అందరు పెద్ద హీరోలు సిగరెట్ రింగులు రింగులుగా వదులుతూ తాగుతారుట” అంది రాంబో.

“సో! వాట్?” అంది నిధి.

“నేను అలాగే తాగటానికి ట్రై చేస్తున్నా. కావాలంటే నీ చుట్టు రింగులు రింగులుగా పొగ వదలనా?” అంది రాంబో.

సరే అన్న నిధికి వచ్చిన పని గుర్తుకు వచ్చింది. ఇంతలో పొగ వల్ల నిధి, ఉఫ్ ఉడుతకి విపరీతమైన దగ్గు వచ్చి దగ్గారు.

దగ్గుతున్న నిధి “రాంబో! నువ్వు మాకు పర్యావరణాన్ని క్లీన్ చెయ్యటంలో హెల్ప్ చెయ్యాలి” అంది.

“సరే. నాకంటే ఎక్కువ బలం ఉన్న మోనా ఆవు దూడని పిలుద్దాము హెల్ప్‌కి” అంది రాంబో.

తోటలో తిరుగుతూ గడ్డి తింటూ గడ్డితో పాటు కూరల నార్లను అదేనండి బేబీ ప్లాంట్స్‌ని తొక్కి తినేస్తోంది.

“మోనా! మోనా! వాట్ అర్ యు డూయింగ్?” అని పిలిచింది నిధి.

“ఏంటి?” అని పలికిన మోనాతో తాను వచ్చిన పని చెప్పింది. క్లీనింగ్ అనగానే ఎగిరి గంతులు వేసిన మోనా కాళ్ళ క్రింద చాల చిన్న మొక్కలు నలిగి చనిపోయాయి.

“వండర్‌ఫుల్ జాబ్! ఎప్పుడు మొదలు పెడదాము?”

అందరు రాంబో ప్రక్కన చేరారు. అందరు పొగకి దగ్గటం మొదలుపెట్టారు.

ఉఫ్ ఉడుతకి ఊపిరి ఆడటం లేదు పొగకి. నిధికి దగ్గుతో పాటు కళ్ళు మంట పుట్టి నీళ్లు వచ్చాయి.

“రాంబో! నీ వెధవ సిగరెట్ పొగతో ఊపిరి ఆడక చస్తున్నాము. ఆపు” అని కోపంగా అరిచింది నిధి.

“పొగ మాకే కాదు నీకు మంచిది కాదు. ఆపు” అంది మోనా ఆవు దూడ.

“సారీ” అంది రాంబో.

“రాంబో! నీ సిగరెట్ పొగ నీకు ఫాషన్ కావచ్చు. కానీ మాకు, పర్యావరణానికి మంచిది కాదు” అంది ఉఫ్ ఉడుత.

“ఆ! నా బాడ్ హబిట్ సరే. మరి బన్నీ రాబిట్ /కుందేలు చేసే వృథా సంగతి?” అంది రాంబో.

“యు అర్ కరెక్ట్! బన్నీ నీకు ఒక క్యాబేజీ సరిపోతుంది. కానీ నువ్వు ఎన్ని కొరికి పడేస్తున్నావో తెలుసా? మా తాతకి తెలిస్తే నీకు ఫుడ్ పెట్టకుండా లోపలేస్తాడు. క్యాబేజీలు పెంచకపోతే?” అంది నిధి బెదిరిస్తూ.

సంగతి అర్ధం అయిన బన్నీ “అవును వృథా తప్పే. సారీ!” అంది సిగ్గుపడుతూ.

“అవును మోనా! మరి నీ సంగతి ఏమిటి?” అంది బన్నీ.

“నేనా?  ఏమి చేశాను?”

“నేను చెబుతా. నీ అల్లరి గెంతులవల్ల నీ కాళ్ళ క్రింద చిన్న బేబీ మొక్కలు నలిగి చనిపోతున్నాయి. అంతేకాదు నీ ఆకలికి కంటే ఎక్కువ తింటూ కొరికి పడేస్తున్నావు ఫుడ్‌ని” అంది కోపంగా నిధి.

“మోనా! స్టాప్ జంపింగ్” అని అరిచింది నిధి.

“నీవల్ల తోటలోని మెడిసినల్ ప్లాంట్స్ చనిపోతున్నాయి.”

“సారీ” అని అంది మోనా కన్నీళ్లతో.

“ఉఫ్ ఉడుతా, నువ్వు నాకు మన చుట్టూ ఉన్న అన్ని పరిసరాలు పర్యావరణంలో భాగం అన్నావు.”

అవునని తల ఊపింది ఉఫ్

“కానీ నువ్వు నీ నెస్ట్‌లో మిగిలిన ఫుడ్ ముక్కలు, చెత్త చెట్టు క్రింద వేసి చెత్త చేసావు.”

నిధికి దొరికిపోయినందుకు ఉఫ్ షేమ్ ఫీల్ అయ్యాడు.

అంతా వింటున్న రాంబో “మా సంగతి చెప్పావు. అరిచావు. మరి నీ సంగతి ఏంటి?” అంది కోపంగా

“నేనా?” అంది నిధి ఆశ్చర్యంగా.

“అవును నువ్వే. నీ హ్యాపీనెస్ కోసం నువ్వు మమ్మల్ని, పరిసరాలను డిస్టర్బ్ చేస్తున్నావు.”

“నేను ఏమి చేసాను?”

“తెలీదా? నీ స్పీకర్ సౌండ్‌తో మా చెవులు దెబ్బతినేలా సౌండ్ పెట్టావు. ఆ శబ్దానికి మేమే కాదు నువ్వు, మీరంతా చెవిటి వాళ్ళు అవుతారని తెలీదా? సౌండ్ పొల్యూషన్ గురించి తెలీదా?” అంది కోపంగా రాంబో.

రాంబో మాటలకి మిగిలిన అందరు “అవును. నీ సంగతేంటి? చెప్పు” అన్నారు.

తన స్పీకర్ లోంచి ఇంకా పెద్ద సౌండ్‌తో వస్తున్న పాటలు ఆపి “సారీ, సారీ” అంది నిధి.

“పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కాదు మనం అందరం కూడా” అంది బన్నీ కుందేలు.

“అవును. అందుకే మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి” అంది రాంబో.

“అవును. సౌండ్, వాటర్, ఎయిర్, సాయిల్ పొల్యూషన్/కాలుష్యం కాకుండా చూడాలి” అంది నిధి.

క్రింద పడేసిన చెత్తని ఎవ్వరు చూడకుండా చెట్ల మొదట్లో వేసింది ఉడుత. త్వరలో అది ఎరువుగా మరి చెట్టుకు మంచి చేస్తుంది.

అందరు కలిసి పర్యావరణంలో భాగంగా పరిసరాలను క్లీన్‌గా పెట్టాలని, వృథాని ఆపాలని ప్లెడ్జి తీసుకున్నాయి.

‘నిధి, బన్నీ, ఉఫ్, మోనా, రాంబో అనే మేము పరిసరాలను క్లీన్‌గా/శుభ్రంగా ఉంచుతాము. వనరులను/ఫుడ్‌ని వృథా/వేస్ట్ చెయ్యము అని ప్రమాణం చేస్తున్నాము’ అన్నారు.

ఇంతలో “నిధీ! వేర్ అర్ యూ?” అని తాత పిలుపు విని “వస్తున్నా తాతా!” అని ఇంట్లోకి పరుగెత్తింది.

మరి పిల్లలూ మీరు కూడా పర్యావరణ ప్లెడ్జి/ప్రతిన తీసుకుంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here