Site icon Sanchika

ప్రత్తిపాటి నానీలు

[dropcap]1[/dropcap]
వెలికి తీస్తే,
ముత్యం విలువ,
చెబితే సత్యం
బలం… తెలుస్తాయి!.

2
కష్టపడడం
తెలిసుండాలి!!
సుఖమేమిటో….
తెలియాలంటే!!!

3
తీరమంతా…
వెతికాను!!!
ఎక్కడా…నా
జ్ఞాపకాల జాడ లేదు.

4
ఎటు కదిలినా…..
ముళ్ళే! గుచ్చుతూ!!!
లోకం నోరు
బ్రహ్మ జెముడు కదా.

5
నాలుగు మాటలు
మాట్లాడితే వాదమా??
తప్పు లేదు,
వాళ్ళు మనువాదులుగా!!

Exit mobile version