ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 1

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీపదాలు అనే సూక్ష్మ కవితా ప్రక్రియలో మూడు పాదాలు, పాదానికి మూడేసి పదాలు ఉంటాయి, ప్రతిపాదం అర్థవంతంగా ఉండడం లక్షణం. ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలలో ఇది మొదటి భాగం. [/box]

~

*01*
[dropcap]ఎ[/dropcap]న్ని కలల వెన్నెలలు,
ఎన్నెన్ని ఆశల వలలు,
తుదకు అన్నీ శూన్యాకాశాలే!!!
*02*
నిరాశల నీలి మేఘాలు,
నిట్టూర్పుల వేసవి గాలులు,
వదలని నిత్య సంఘర్షణలు!!!
*03*
రెప్పల వాకిలి మూయడానికి
తెరవడానికి నడుమ మనిషి..
అదే అసలైన జీవితం!!

*4* 4_6( ఉదయం)
తూరుపున ఎరుపు పిట్టొకటి…
గులాబీ కనులు విప్పేలా…
వేల రెక్కలతో ఎగురుతోంది…
5
కమ్ముకున్న మట్టి చీకటి
తొలగించి పసి మొలకకు
నులివెచ్చని కౌగిలి అద్దుతుంది
6
మందారమొగ్గల బుగ్గలకు ఎరుపునద్ది,
కోవెల గంటను మేలుకొలిపి
వాకిట ముగ్గును ముద్దాడుతుంది!!

*7* (7_9 బంధం)
బంధమంటే చెట్టుకే తెలుసు,
మొదలు నరికినా చిగురిస్తుంది,
తల్లివేరు తపన అది!!!
8
అనుబంధమంటే అల్లిక కాదు,
ఆత్మీయస్పర్శ నేనున్నాననే భరోసా,
కుటుంబమే దానికి పునాది!!
9
కొన్ని బంధాలు బంధిస్తాయి
మరికొన్ని దుఃఖాలై బాధిస్తాయి,
మట్టితో అనుబంధమే అమృతం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here