Site icon Sanchika

ప్రవహించే నీరు

[శ్రీమతి ఆర్. లక్ష్మి వ్రాసిన ‘ప్రవహించే నీరు’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]వహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది
అలలుండే జీవితం నిర్మలంగా ఉంటుంది
చుక్కలన్నీ చీకటిలోనే మెరుస్తాయి
ఆశలన్నీ నిరాశలోనే మెరుస్తాయి.
జీవన నిర్ఝరిలో
అనుభవాల అలలు ఉండాలి
ఆశల తళుకుల వెనుక
నిరాశ నిండుగా ఉండాలి.
తూరుపులో ఉదయించిన కాంతిరేఖలు
పడమరలో అస్తమించక మానవు
నిశీధపు నింగిలో మెరిసే తారకలు
ప్రభాతపు చైతన్యంలో మునగక మానవు

Exit mobile version