Site icon Sanchika

ప్రయత్నం

భావాల కెరటాలు
మస్తిష్కం తీరాన్ని
తాకుతున్నాయి నిరంతరం
అక్షర రూపం దాల్చిన
కవితా నక్షత్రాలను మాత్రం
వినీల సాహితీ ఆకాశంలో
ఒక్కొక్కటిగా పేర్చుతున్నాను
ఏనాటికైనా పాలపుంత ధారగా
మారుతుందన్న చిన్ని ఆశతో.

Exit mobile version