ప్రేమ బాటలో వజ్రాల వేట

0
3

[box type=’note’ fontsize=’16’] “నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పలేను. కానీ వాటిని నువ్వు ఒంటరిగా ఎదుర్కోవలసిన అవసరం ఉండదని హామీ ఇవ్వగలను” అనే ఓ ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశాడో చెబుతున్నారు యన్.వి.యస్.యస్ ప్రకాశరావు “ప్రేమ బాటలో వజ్రాల వేట” కథలో. [/box]

[dropcap]రా[/dropcap]ముడు, నర్సమ్మ విజయవాడ కృష్ణలంకలో ఎదురెదురిళ్ళలో చిన్నప్పటి నుండి నివసిస్తూ వుండడం వల్ల ఏదో తెలియని ప్రేమ అభిమానం ఆత్మీయత ఒకరంటే ఒకరికి.

బడి, గుడి ఎక్కడికైనా సరే! ఎంత లేటైనా సరే! కలిసి వెళ్ళడం కలిసి ఇంటికి రావటం పరిపాటి.

రాముడు కుంచం లేని కుటుంబం నుంచి వచ్చాడు, నరసమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ నాన్న ఏదో ఓ లారీ వోనరు దగ్గర లెక్కల గుమస్తాగా చేస్తూ వుండటం వల్ల జరుగబాటుకు లోటు లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు.

నర్సమ్మకు యుక్తవయసు రావడం వల్ల ఓ జరుగుబాటు వున్న కుటుంబంలో పిల్లకు సంబంధం చూడాలనుకున్నాడు తండ్రి. అందుకే తరచు రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెం తిరుగుతూ తన ఎరుకలో వున్న సంబంధాల కోసం వెతకసాగాడు.

చిన్నప్పటి నుండి కలిసి మెలిసి తిరగడం వల్ల రాముడు, నర్సమ్మ వారి ప్రేమ వ్యవహారం ఎలా పరిష్కరించుకోవాలో తరచు కలిసినప్పుడల్లా కలవరపడుతూ ఆలాగే ఆలోచనలకు పదునుపెడుతూ మెరుగైన కుటుంబం, తరుగైన కుటుంబం ఈ రెండూ కలిపే మార్గాన్వేషణలో సతమతమవుతున్నారు.

రాముడికి నర్సమ్మకి వారానికొకసారైనా కలుసుకోవాలంటే అతి కష్టంగా వున్నది. చివరకు చేసేది లేక రాముడు నర్మమ్మను ఊహలోకంలో కలుస్తూ సర్ది పెట్టుకుంటున్నాడు. ప్రేమ ఓ కల అది నిజం కానపుడు ‘కల్లే’ కదా!

రాముడి ప్రేమ కలలోని అష్టపదులు, భావన: “ఈ రోజు నా పెదవులు అకారణంగా చిరునవ్వు నవ్వాయి. ఆ క్షణంలోనే నీ గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటానని ఆ తర్వాత అర్థమైంది.

పాఠకులకు ఆమె కళ్లలో ప్రపంచం కనిపిస్తున్నా – ప్రపంచం అంతటా ఆమె కళ్ళే కనిపిస్తున్నా ప్రేమికులు ప్రేమలో పడ్డట్టే! అసలు ప్రేమ ఎవరికి వారు పాడుకునే పాటలాంటిది. ప్రేమచుట్టు ప్రక్కల వాళ్ళకి ఆనందం కలిగించకపోవచ్చు. కానీ ఎవరి పాట వారికి మధురంగానే ఉంటుంది. నిన్ను ప్రేమించడం, శ్వాసించడం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే నీకు నేను ఐ లవ్యూ చెప్పడం కోసం నా చివరి శ్వాసను ఉపయోగిస్తాను. ఒకరి చేతి రాతను మళ్ళీ మళ్ళీ చదువుతన్నామంటే ఒకరి ఆనంద స్వరం వినప్పుడు నీ పెదాల మీద చిరునవ్వు కదలాడిందంటే, ఇది చదివేటప్పుడు నీ మనసులో ఎవరైనా మెదిలారంటే వారిని నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నావన్నమాటే!

మరియొక విషయం ఈ ప్రపంచానికి నువ్వు ఒక సాదారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమిచే వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం.

జీవిత కాలం అంటే ఎవరికైనా జీవన మరణాల మధ్య కాలం. కాని నాకు మాత్రం నీతో గడిపిన కాలమే జీవిత కాలం అనిపిస్తుంది.

నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పలేను. కానీ వాటిని నువ్వు ఒంటరిగా ఎదుర్కోవలసిన అవసరం ఉండదని హామీ ఇవ్వగలను.”

తన కల నుండి మెలుకువ రాగానే – ప్రేమ ఎంత గొప్పదో కదా! అని దాన్ని సాధించినప్పుడే ప్రేమికుల జీవితం ధన్యం అవుతుంది అని గాఢంగా విశ్వసించి ఎలాగైనా తన ప్రేమకు చిహ్నంగా నర్సమ్మ చేతికి వజ్రం తొడగాలని నిశ్చయానికి వచ్చాడు.

రాముడు తల్లి తండ్రీ ‘రజక’ వృత్తిలో బట్టల ఇస్త్రీ పనిలో ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతున్నారు. తనకా ఇంకా చదువు సంధ్యలు పూర్తి కాలేదు. సంపాదించి తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఇంకా కొంత కాలం పడుతుంది. కానీ తన కార్యసిద్ధికి మార్గం ఏంటాని రాత్రింబవళ్ళు ఆలోచించాడు.

తాను ఇంటర్‌మీడియట్ 2వ సంవత్సరం చదివేప్పుడు ఫిజికల్ సైన్స్ మాష్టారుగారు చెప్పిన ఓ పాఠం స్మరణకొచ్చింది.

ఎఱ్ఱమట్టి నేలలో భూమిలో కార్బన్ – కింబర్లిన్ – రసాయనిక చర్య వల్ల అదే వర్షం పడడం వల్ల సూర్యరశ్మికి తళుకు తళుకు మని మెరిసే వజ్రాలు మట్టిలో కనిపిస్తూ వుంటాయని ఇది అనంతపురం జీల్లా “వజ్ర కరూర్” గ్రామంలో రాయల కాలం నుండి ఇక్కడ పట్టుదలతో వెదికే వాళ్ళకి వజ్రాలు స్పటిక రూపంలో లభిస్తాయని వాటిని వ్యాపారులు తగిన మూల్యాన్ని చెల్లించి కొని విదేశాలకు ఎగుమతి చేస్తారని చెప్పిన పాఠం గుర్తుకు రాగా….

వెంటనే రాముడు అంకుంటిత దీక్షతో పట్టుదలతో ఇంట్లో చెప్పా చెయ్యకుండా రాయలసేమ అమరావతి పాస్టు పాసింజర్‌ని ఎక్కడానికి గుంటూరు చేరుకోగా, సరిగ్గా సాయంత్రం 5.30 నిమిషాలకి అమరావతి పాసింజరు గుంటూరు నుండి బయలుదేరింది. మరుసటి రోజు మద్యాహ్నం గుంతకల్లు చేరేక రాముడు తిరిగి అనంతపూర్ రైలు ఎక్కగా.. తిన్నగా హిందూపూర్‌లో దిగి కాస్త తను కూడా తెచ్చుకున్న పైకంతో కడుపుకి కాస్త పట్టెడు భోజనం చేసి ఆ వూళ్ళో విచారించగా అప్పటికే తొలకరి ప్రారంభమై చెదురు మదురు వర్షాలు పడుతూ వుండడంతో ఆ వూరి నిండా చుట్టు ప్రక్క గ్రామాల నుండి చేరిన కూలీలు, ధనార్జనాపరులు చివరకు బిచ్చగాళ్ళు సహితం వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ వజ్రకరూర్‌లో వజ్రాల వేటకు పూనుకున్నారు.

రాముడు బయలుదేరిన విశేషమేమిటో గానీ తనతో బాటే రైలు ప్రయాణం చేసిన తోటి వ్యక్తి ప్రత్యేకంగా పని గట్టుకుని ధనార్జనా అభిలాష కొందరిదైతే… రాముడు మాత్రం నర్సమ్మతో ప్రేమ వివాహం ప్రాధాన్యంగా వజ్రాల వేట కొనసాగించాడు.

ఆ వూరి రైతులు వారి పొలాలలో వజ్రాల వేటకి ఏ మాత్రం అభ్యంతరం చెప్పేవారు కాదు.

సూర్యోదయం నుండి ఈ వేట మొదలు పెట్టేవారు. సూర్యకిరణాలకు భూమి పైన రాళ్ళపై తళుక్కున మెరుస్తుంటే అక్కడే జనాలు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఒక గుండు వజ్రం దొరికితే ఇక ఆ వ్యక్తి కోటీశ్వరుడే!

అందుకే ఎంత శ్రమ అయినా వదలని విక్రమార్కుడి తమ్ముడిలా, వంచిన తల ఎత్తకుండా తన ప్రేమ పవిత్రమైతే తన దీక్ష ఫలిస్తుందన్న రాముడి విశ్వాసం, వివాహాలు స్వర్గంలో స్థిరపడతాయన్న సూక్తి నిజంగా రాముడి విషయంలో నిజమైయినది. మొదటి వారం రోజులలోనే రాముడి దృష్టి ఓ వజ్రపు గుండుపై పడింది. వెంటనే ఆ ప్రదేశాన్ని చేతులతో తవ్వి మట్టిని తప్పించి ఆ వజ్రపు గుండును చేతపూనాడు. తోటి బీదా, బిక్కీ రైతు జనం అంతా పోగై రాముడి అదృష్టాన్ని శ్లాఘించారు. ఇంకా వుండి వెదికితే ఇంకా వజ్రాలు లభిస్తాయని తోటివాళ్ళు ఎంత చెప్పినా ఆశకు లోబడక తను వచ్చిన పని నెరవేరిదని భగవంతుడికి ఓ మొక్కు మొక్కి తిరుగు ప్రయాణంలో మళ్ళీ విజయవాడ వచ్చి చేరాడు.

ఈ జరిగిన విషయాలన్నీ తల్లికి తండ్రికి నర్మమ్మ తల్లిదండ్రులకు తెలిపి తానిప్పుడు “వజ్రాల కోటీశ్వరు” నని చెప్పి పెళ్ళికి పిల్లనిస్తారా అని ధైర్యంగా నర్సమ్మ తండ్రిని అధికారంగా అడగగా, వెంటనే గుమాస్తాకు కోటీశ్వరుడు అల్లుడుగా దొరికాడు అని ఆయన మురిసిపోయాడు.

నర్సమ్మకి తెలుసు నిజమైన ప్రేమకు ఓటమి ఉండదని. రాముడు, నర్మమ్మ రాముడు తల్లిదండ్రులు అంతా బీసెంట్‌రోడ్‌లో ఓ ఎలెక్ట్రికల్ డ్రై క్లీనర్ ఎ.సి షాపు ఓపెన్ చేసి విజయవాడలో పెద్ద వ్యాపారులుగా స్థిరపడ్డారు. అందుకే పెద్దలు అంటారు అదృషవంతుణ్ణి చెరిపేవాడు లేడు, నిర్భాగ్యుణ్ణి బాగుచేసేవాడు లేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here