Site icon Sanchika

ప్రేమ కావ్యం..!

[శ్రీ వంగల సంతోష్ రచించిన ‘ప్రేమ కావ్యం..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

1.
వారాంతపు సెలవుల మధ్య సాగిన ప్రయాణంలో
మనస్సు తడిసి ముద్దయింది
చార్మినార్ చౌరస్తాలో మెరిసిన ముత్యము
ఇంకా నా కనురెప్పలను అర్పనిస్తనూ లేదు
ఎందుకో ఈ వేళా యద బరువెక్కిపోయింది

2.
తాను కండ్లకు పెట్టిన సుర్మా అందాలను చూసి
నా గుండెల్లో గుచ్చిన సూదులు ఎన్నో
అది వర్ణించన నా తరం అవునా..?
చేతి గాజుల చప్పుళ్లకు గుండె గదులు కదులుతున్నట్లుగా ఉన్నది
ఓ సారి ఆలింగనం చేసుకోవాలని కుతూహలంగా ఉన్నది
అయినా
తానే నన్ను తాకిన చెయ్యి స్పర్శను ఎలా మర్చిపోగలను.

3.
మహానగరంలో ఏ వీధి అంటూ నేను వెతకాలి
పల్లె అయితే నా ఇల్లు అనుకుని నిన్ను నాలో దాచుకుందు
ఇప్పుడు ఆ పట్నం నన్ను పరీక్ష పెట్టినా
నిన్ను నన్ను విడదీయ్యలేదు
ఎన్ని చౌరస్తాలయినా, ఎన్ని రహదారులయినా
అన్ని నీకోసం పరుచుకున్న పూల పాన్పులే

4.
కోయిల లాంటి నీ గాత్రాన్ని ఎలా మర్చిపోయి ఉండగలను
తియ్యనైన నీ మాటలతో నా పెదవులను తాకిన రోజు గుర్తు చేసుకుంటూ ఉంటా
నల్లని ఆ ఆకాశంలో కమ్మిన కరిమబ్బులతో మెరిసిన వేళా
సింగిడయి నీవు నన్ను అల్లుకున్న నాడు
నేను ఈ ప్రపంచాన్ని జయిస్తాను నా ప్రియా..

Exit mobile version