[dropcap]క[/dropcap]నులను మరచి
కలలను తెరిపించే
నీ ప్రేమకు జోహార్లు
విరిసిన ఉద్యానవనాన
తడిసిన నీ పాదాల ముద్రణ
నీ ప్రేమకు జోహార్లు
గల గల లాడే నీ ముచ్చట్లు
కురంగపు లాంటి నీ గెంతులు
నీ ప్రేమకు జోహార్లు
రెప్పల పై చిరు చినుకు ఆద్దంలా మారి
నీలో నన్ను చూసుకునే క్షణాలు
నీ ప్రేమకు జోహార్లు
నన్నే మరిచిపించి, నీ లోనే నన్ను పెంచి
నన్నే దోచుకున్న
నీ ప్రేమకు జోహార్లు
నీ నవ్వు నా ముఖ కవళికం
నీ తెగువ నా నమ్మకం
నీ జాణతనం నా చురుకుదనం
నీ ఖేదం నా బలహీనం
నీ ప్రేమ నా బలం
నీ ప్రేమ నా జీవం
రా, తర తరాలకు సరిపడా
చరిత్ర రాద్దాం
రా, జీవనది ప్రవహించేలా
ఏడు అడుగులు వేద్దాం
చిరుతరుణమైన మన ప్రేమను
చిరస్థాయిగా పదిలపరుద్దాం
పంచభూతాల సాక్షిగా
మమేకమవుదాం !