[dropcap]ఒ[/dropcap]క కమ్మని కవితై
ఆమె నాముందు నిలిచింది,
నాలోని కవిని..
కవ్వించి.. కవ్వించి..,
ఆమె హృదయ సౌధాన్ని,
కవితాలయం చేసింది,
నన్నొక సాహిత్యకారుడిగా,
ఆమె కవితాలయంలోకి..
కమ్మగా ఆహ్వానించింది!
నేనిక్కడైతే..
ఆమె సుదూరంగా ఎక్కడో..
చేతి ఆభరణంగా..
సెల్ ఫోన్లు లేని రోజులవి,
చేతి ఉత్తరాలో..
తపాల బంట్రోతులో
ప్రేమ సందేశాల నందించి,
పుణ్యం కట్టుకున్న..
మధురాతి మధురమయిన,
శుభ సమయాలవి!
ఉత్తరాలు..
ప్రత్యుత్తరాలు
మా హృదయ వికాసానికి తోడై,
ఫలించిన ప్రేమను,
పెళ్లిగా నిలబెట్టాయి,
దరి చేర్చిన లేఖలన్నీ,
మా ప్రేమ కావ్యమై మిగిలాయి!!