ప్రేమంటే

0
2

[dropcap]ప్రే[/dropcap]మంటే ఒక దాహం
అది తీరని వ్యామోహం
కామి గాని వాడు మోక్షగామి
కాదన్నారు…. అందుకే ॥ ప్రేమంటే ॥

నిప్పైనా సహిస్తుంది
నీరైనా నిలుస్తుంది
నీలోనే రహిస్తుంది
నిండుగా క్షమిస్తుంది ॥ ప్రేమంటే ॥

పగగా మారుతుంది
సెగగా ఎగుస్తుంది
నిలువునా దహిస్తుంది
రాక్షసమై రగులుతుంది ॥ ప్రేమంటే ॥

రాగమై రంజిల్లుతుంది
యోగమై మిగులుతుంది
త్యాగమై వెలుగుతుంది
అజరామర మవుతుంది ॥ ప్రేమంటే ॥

మనసును మురిపిస్తుంది
మమతలు కురిపిస్తుంది
మనిషినే మారుస్తుంది
జీవితమై జ్వలిస్తుంది ॥ ప్రేమంటే ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here