Site icon Sanchika

ప్రియాత్మ

[డా. బి. హేమావతి రచించిన ‘ప్రియాత్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]న్ను చూడని నీ కళ్ళని
నా అరచేతులతో మూయాలని
నాతో మాట్లాడని నీ నోటిని
నా పెదవులతో మూయాలని
నాలో ఏదో తీరని కోరిక
కన్నులలో నిన్ను చూసినపుడు
నా ప్రతిబింబాన్ని నే చూసాను
మాట్లాడని నీ పెదవులలో
మమతనే నే చూసాను
ఒడిలోని పాపతో ఎన్నెన్నో ఊసులు
నిన్నే చూసాను నా పాప గా

Exit mobile version